తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 10 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Tue Sep 10 2024 లేటెస్ట్‌ వార్తలు- నేర సామ్రాజ్యం విస్తరణకు రాజకీయ ముసుగు తొడిగితే సహించం - వైసీపీకి సీఎం చంద్రబాబు మాస్​ వార్నింగ్​ - CM Chandrababu Inspected Budameru

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By Telangana Live News Desk

Published : Sep 10, 2024, 7:20 AM IST

Updated : Sep 10, 2024, 10:39 PM IST

10:37 PM, 10 Sep 2024 (IST)

నేర సామ్రాజ్యం విస్తరణకు రాజకీయ ముసుగు తొడిగితే సహించం - వైసీపీకి సీఎం చంద్రబాబు మాస్​ వార్నింగ్​ - CM Chandrababu Inspected Budameru

CM Chandrababu Inspected Budameru Canal Breach : ఏపీలోని విజయవాడను వణికించిన బుడమేరు వాగు గండి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గండ్లు పూడ్చిన ప్రాంతాన్ని కాలినడకన వెళ్లి పరిశీలించారు. గండ్లు పడిన తీరు, విజయవాడను వరద ప్రవాహం చుట్టుముట్టిన విధానంపై సీఎంకు అధికారులు వివరించారు. భవిష్యత్తులోనూ బుడమేరుకు ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - CM CHANDRABABU INSPECTED BUDAMERU

10:25 PM, 10 Sep 2024 (IST)

ఐదుగురు సభ్యుల డ్రగ్స్​ ముఠా అరెస్ట్ - రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం!​ - Police Seized Ganja In Hyderabad

Police Seized Ganja In Hyderabad : ఏపీ నుంచి ముంబయికి గంజాయి తరలిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఓఆర్​ఆర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 254 కిలోల గంజాయి, 2 కార్లు, సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, వస్తువుల విలువ రూ.కోటి నాలుగు లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలను మీడియా సమావేశంలో రాజేంద్రనగర్ డీసీపీ వెల్లడించారు. | Read More

ETV Bharat Live Updates - POLICE ARRESTED GANJA SMUGGLERS

09:12 PM, 10 Sep 2024 (IST)

హైడ్రాకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బంది - Special Police force For Hydra

Special Police force For Hydra : చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రాకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులను కేటాయించింది. ఈ మేరకు డిప్యూటేషన్ ఆదేశాలు ఇస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. | Read More

ETV Bharat Live Updates - SPECIAL POLICE FORCE FOR HYDRA

08:57 PM, 10 Sep 2024 (IST)

కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - CM Revanth Koti Womens University

CM Revanth On Koti Womens University : కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి కీలక ప్రకటన చేశారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో చాకలి ఐలమ్మ కుటుంబాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సన్మానించారు. చాకలి ఐలమ్మ మనమరాలిని మహిళా కమిషన్‌ సభ్యురాలిగా నియామకం | Read More

ETV Bharat Live Updates - KOTI WOMENS UNIVERSITY NAME CHANGE

07:04 PM, 10 Sep 2024 (IST)

భద్రాచలం వద్ద 48 అడుగులకు గోదావరి నీటిమట్టం - రెండో ప్రమాద హెచ్చరిక జారీ - Godavari rising at Bhadrachalam

Godavari rising at Bhadrachalam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - GODAVARI RISING AT BHADRACHALAM

06:15 PM, 10 Sep 2024 (IST)

శాసనసభ నిబంధనల ప్రకారమే పీఏసీ ఛైర్మన్‌ నియామకం : శ్రీధర్​ బాబు - Minister Sridhar Babu on BRS

Minister Sridhar Babu on BRS : రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్​కు లేదని మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. శాసనసభ నిబంధనల ప్రకారమే పీఏసీ ఛైర్మన్​ను స్పీకర్​ నియమించారని తెలిపారు. బీఆర్ఎస్​ పార్టీపై శ్రీధర్​ బాబు పలు విమర్శలు గుప్పించారు. పీఏసీ ఛైర్మన్ నియామకం విషయంలో బీఆర్ఎస్​ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. | Read More

ETV Bharat Live Updates - MINISTER SRIDHAR BABU ON BRS

05:33 PM, 10 Sep 2024 (IST)

మరుగుదొడ్డే నివాసంగా జీవనం సాగిస్తున్న వృద్ధురాలు - ఇల్లు కట్టిస్తానని సీఎం రేవంత్ భరోసా - REVANTH GRANTS HOUSE TO OLD WOMAN

CM Revanth Respond On Old Woman House Problem : వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఇల్లు లేక మరుగుదొడ్డిలో జీవనం సాగిస్తున్న మల్లమ్మ దీనస్థితి గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. వృద్ధురాలికి అండగా నిలవాలని అధికారులని ఆదేశించారు. ఇంటి మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. | Read More

ETV Bharat Live Updates - CM RESPOND ON OLD WOMEN HOUSE

05:04 PM, 10 Sep 2024 (IST)

హుస్సేన్‌సాగర్‌లో గణేశుడి నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్​ సిగ్నల్! - షరతులు వర్తిస్తాయి - Hussain Sagar Ganesh Immersion

హుస్సేన్ సాగర్​లో వినాయక నిమజ్జనాలపై హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం కేవలం మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మాత్రమే హుస్సేన్ సాగర్​లో నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. | Read More

ETV Bharat Live Updates - HUSSAIN SAGAR GANESH IMMERSION

04:34 PM, 10 Sep 2024 (IST)

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 41% నుంచి 50 శాతానికి పెంచాలి : భట్టి విక్రమార్క - DY CM Bhatti On Finance Commission

16th Central Finance Commission Meeting Points : ప్రస్తుతం రాష్ట్ర ఆదాయమంతా అప్పులు చెల్లించేందుకే సరిపోతుందని, అందుకే గత అప్పులను రీస్ట్రక్చరింగ్ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని ప్రతిపాదించినట్లు వివరించారు. | Read More

ETV Bharat Live Updates - 16TH CENTRAL FINANCE COMMISSION

04:06 PM, 10 Sep 2024 (IST)

తెలంగాణ పట్టణాభివృద్ధి భేష్ - అదనపు రుణాల అంశాన్ని పరిశీలిస్తాం : పనగఢియా - 16th Finance Commission Meeting

16th Central Finance Commission Meeting in Hyderabad : సెస్, సర్ ఛార్జీల్లోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని ఆర్ధిక సంఘం ఛైర్మన్ అరవింద్‌ పనగఢియా తెలిపారు. ప్రజాభవన్‌ వేదికగా జరిగిన 16వ కేంద్ర ఆర్థిక సంఘం మీటింగ్​ అనంతరం పలు అంశాలను ఛైర్మన్ పనగఢియా వివరించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సర్కార్​ పట్టణాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతపై ప్రశంసించారు. | Read More

ETV Bharat Live Updates - CENTRAL FINANCE COMMISSION TEAM

02:24 PM, 10 Sep 2024 (IST)

భారత్​ శరవేగంగా ముందుకు దూసుకుపోతోంది : వెంకయ్యనాయుడు - Prof CR Rao Birth Celebrations

104th birth anniversary of Prof CR Rao : రాజకీయాలు కమీషన్లుగా మారాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో రాజకీయాల పట్ల వ్యతిరేక భావన కలుగుతోందని అన్నారు. హెచ్​సీయూలో నిర్వహిస్తున్న ప్రొ.సీఆర్​ రావు 104వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. | Read More

ETV Bharat Live Updates - PROF CR RAO BIRTH CELEBRATIONS

02:25 PM, 10 Sep 2024 (IST)

3 నెలల్లో బీసీ కులగణన చేయండి - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - caste census in Telangana

Telangana HC on Caste Census : బీసీ కులగణన 3 నెలల్లో చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కులగణన చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. | Read More

ETV Bharat Live Updates - HC ON CASTE CENSUS IN TELANGANA

02:17 PM, 10 Sep 2024 (IST)

మాలీవుడ్‌లోనే కాదు 'టాలీవుడ్‌'లోనూ అదే పరిస్థితి? - రెండేళ్ల కిందటే సర్కార్​కు రిపోర్ట్ - SEXUAL ASSAULTS IN TOLLYWOOD

Sexual Assaults in Tollywood : కేరళలో జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్రపరిశ్రమలో ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోనూ ఇలాంటి ఓ నివేదిక ఉందని, దాన్ని కూడా బయటపెట్టాలన్న డిమాండ్ ఇప్పుడు వ్యక్తమవుతోంది. 2018 అక్టోబరులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం 2019 ఏప్రిల్‌లో 25 మందితో కమిటీ వేయగా ఇందులో 12 మంది మహిళలు ఉపకమిటీగా ఏర్పడి విస్తృత అధ్యయనం, పరిశీలన, సంప్రదింపుల అనంతరం ఓ నివేదిక రూపొందించింది. మరి ఆ నివేదిక ఏం తేల్చిందంటే? | Read More

ETV Bharat Live Updates - TOLLYWOOD SEXUAL ASSAULT CASES

12:55 PM, 10 Sep 2024 (IST)

'దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ - భారీ రుణమే రాష్ట్రానికి పెను భారంగా మారింది' - 16th Finance Committee Meeting

16th Finance Committee Meeting at Hyderabad : దేశంలోనే తెలంగాణ యంగెస్ట్​ స్టేట్​ అని, ఫ్యూచర్​ స్టేట్​గా పిలుస్తున్నామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. కానీ భారీ రుణ భారమే తెలంగాణకు పెను భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. | Read More

ETV Bharat Live Updates - CM REVANTH SPEECH

12:45 PM, 10 Sep 2024 (IST)

విజయవాడలో దొంగల స్వైర విహారం - వరద బాధితులను సైతం వదలకుండా చోరీలు - Robbery in Flood Affected Houses

Thefts Flood Victims Houses in Vijayawada : వరదల కారణంగా విజయవాడ ముంపు ప్రాంతాల వాసులు ఎంతగానో నష్టపోయారు. ఎక్కడ చూసినా కన్నీటి చిత్రాలు మనసు కలిచివేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇంత దారుణ పరిస్థితుల్లో ప్రజలు అల్లాడిపోతుంటే దొంగలు మాత్రం తమ పని చూపెడుతున్నారు. బాధితుల ఇళ్లలో దూరి సొమ్ము కాజేసి వారికి మరింత వేదన మిగులుస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - THEFT IN FLOOD AFFECTED AREAS

12:29 PM, 10 Sep 2024 (IST)

రూ.2.3 కోట్లతో గణేశ్​ మండపం అలంకరణ - ఎక్కడో తెలుసా? - ganesh celebrations in ap

Currency Notes Decoration in AP : గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తమ బొజ్జ గణపయ్యను ఒక్కొక్కరూ ఒక్కోలా తీర్చిదిద్దుతూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఏపీలోని మంగళగిరిలో రూ.2.3 కోట్ల కరెన్సీ నోట్లతో గణపతిని అలంకరించనున్నారు. ఈ మేరకు భారీ దండలను తయారు చేశారు. ఇందుకోసం రూ.10 నుంచి రూ.500 వరకూ నోట్లను సేకరించి, వాటిని దండలు, పువ్వులుగా చేశారు. | Read More

ETV Bharat Live Updates - కరెన్సీ నోట్లతో గణేష్ మండపం అలంకరణ

12:29 PM, 10 Sep 2024 (IST)

అక్రమాలు వెలికితీశాడని అక్కసు - దారి కాచి ఆడిట్‌ అధికారిపై ఇంటి దొంగల దాడి - AUDIT OFFICER ATTACKED IN PRAKASAM

Audit Officer Attacked in Ongole : విధులు సక్రమంగా నిర్వహించడమే ఆయన పాలిట శాపమైంది. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అక్రమాలను వెలికితీయడమే ఆయన చేసిన తప్పయింది. తప్పు జరిగిందని చెప్పినందుకు దారి కాచి మరీ అతడిపై దాడికి తెగబడ్డారు. సహోద్యోగి అని కూడా చూడకుండా కళ్లల్లో కారం కొట్టి విచక్షణారహితంగా కర్రలతో కొట్టారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. | Read More

ETV Bharat Live Updates - PRAKASAM AUDIT OFFICER ATTACKED

12:04 PM, 10 Sep 2024 (IST)

హుస్సేన్‌సాగర్‌లో గణేశ్​ నిమజ్జనాలకు అనుమతి లేదు - ట్యాంక్​బండ్​పై ఫ్లెక్సీల ఏర్పాటు - Not Allowing Ganesha immersion

Not Allowing Ganesha immersion in Hussainsagar : హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. | Read More

ETV Bharat Live Updates - GHMC FLEXI IN HUSSAIN SAGAR

11:57 AM, 10 Sep 2024 (IST)

రుణం మొత్తం చెల్లించినా - ఆగని లోన్​యాప్​ వేధింపులు - మరో ప్రాణం బలి - Man Suicide by Loan App Harassment

Man Suicide in Hyderabad : లోన్​ యాప్​ ఒత్తిడి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్​లో చోటుచేసుకుంది. రుణం చెల్లించినా ఒత్తిడి చేస్తుండటంతో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. | Read More

ETV Bharat Live Updates - MAN SUICIDE DUE TO LOAN APP

10:47 AM, 10 Sep 2024 (IST)

పంచాయతీ ఎన్నికలకు ముందే ఆ సర్పంచ్​ గెలిచేశారు - అదీ ఏకగ్రీవంగా! - Sarpanch Unanimous Election

Telangana Local Body Elections : రాష్ట్రంలోని గ్రామాల్లో సర్పంచ్​ల పాలన ముగిసి, దాదాపు ఆరు నెలల పైనే దాటిపోయింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. కానీ ఇంతలోనే ఓ గ్రామానికి సర్పంచ్​ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేంటి ఎన్నిక అవ్వకుండానే సర్పంచ్​ అవ్వడం ఏంటని అనుకుంటున్నారా? అయితే ఇది చదివేయండి. | Read More

ETV Bharat Live Updates - TELANGANA LOCAL ELECTIONS

10:33 AM, 10 Sep 2024 (IST)

భద్రాచలం వద్ద 45 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం - మొదటి ప్రమాద హెచ్చరిక జారీ - Godavari rising at Bhadrachalam

Godavari rising at Bhadrachalam : ఎగువ నుంచి పోటెత్తుతోన్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. దీంతో గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 45 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. | Read More

ETV Bharat Live Updates - WATER LEVEL RISING IN BHADRACHALAM

10:25 AM, 10 Sep 2024 (IST)

మతిస్తిమితం లేని వ్యక్తిపై బైక్​ తొక్కించి, తాడుకట్టి ఈడ్చుకెళ్లి - మద్యం మత్తులో యువకుల దుశ్చర్య - Two accused killed beggar in medak

A Beggar Murder Under the Influence of Alcohol : పాపం రోడ్డు పక్కన భిక్షాటన చేసుకునే వ్యక్తిని దొంగతనం చేశాడనే పేరుతో మద్యం మత్తులో ఇద్దరు యువకులు హత్య చేశారు. ఈ ఘటన ఈ నెల 4న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్​ జిల్లా శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. | Read More

ETV Bharat Live Updates - MEDA MURDER CASE UPDATE

10:13 AM, 10 Sep 2024 (IST)

హైదరాబాద్‌లో సెల్లార్లకు ఇక సెలవు? - వాటికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వ యోచన - TG Govt on Cellars

TG Govt Planning to Stop Cellars : బహుళ అంతస్తుల్లో వాహనాల పార్కింగ్‌ కోసం చేపట్టే సెల్లార్ల నిర్మాణాలకు స్వస్తి పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సెల్లార్లపై ఫిర్యాదులు వస్తుండటంతో పాటు వర్షపు నీరు చేరి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మేరకు సెల్లార్లనే అనుమతించకుండా చట్టబద్ధత తీసుకొచ్చి, పురపాలక చట్టంలోని భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరించనున్నట్లు సమాచారం. | Read More

ETV Bharat Live Updates - GOVT ON CELLARS IN BUILDING

09:04 AM, 10 Sep 2024 (IST)

'అప్పటికి, ఇప్పటికి 109 ప్రశ్నల జవాబులు మార్చారు' : డీఎస్సీ ఫైనల్​ 'కీ'పై వెల్లువెత్తిన అభ్యంతరాలు - DSC Final Key Objections

Objections on DSC Final Key : రాష్ట్రంలో డీఎస్సీ తుది ‘కీ’పై పలు జిల్లాల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వందలాది మంది అభ్యర్థులు పాఠ్య పుస్తకాలను తీసుకుని సోమవారం పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి తరలివచ్చారు. ప్రాథమిక, తుది 'కీ' మధ్య 109 ప్రశ్నల జవాబులను మార్చినట్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో జనరల్‌ ర్యాంకు జాబితా ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - OBJECTIONS IN DSC KEY

08:42 AM, 10 Sep 2024 (IST)

వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.16500 - చనిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు, రూ.5 లక్షలు - tg govt paid 16500 to flood victims

Telangana Govt Help Flood Victims : భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రతి కుటుంబానికి రూ.16,500 నగదు తక్షణమే ఇవ్వాలని నిర్ణయించుకుంది. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు వరద నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. | Read More

ETV Bharat Live Updates - FLOOD AFFECTED AREAS IN TELANGANA

07:03 AM, 10 Sep 2024 (IST)

భారీ వర్షాలు, వరదలకు కోలుకోలేని స్థితిలో ఖమ్మం జిల్లా - రూ.417 కోట్లు బురద పాలు - Floods loss in Khammam

Khammam Loss Report : భారీ వర్షాలు, వరదలు ఖమ్మం జిల్లాను కోలుకోలేని దెబ్బతీశాయి. మున్నేరు విలయం పరివాహక ప్రాంతాలకు అపార నష్టం మిగిల్చింది. ముంపు ముప్పుతో మున్నేరు ప్రభావిత ప్రాంతాలు కకావికలం కాగా ప్రజా, ప్రభుత్వ ఆస్తులకు ఊహించని నష్టం వాటిల్లింది. వరద మిగిల్చిన విషాదంతో నిలువ నీడలేక, కట్టుకునేందుకు దుస్తులు లేక బాధిత కుటుంబాలు బోరుమంటున్నాయి. జిల్లాలో రూ.417 కోట్ల 69 లక్షల మేర నష్టం జరిగినట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా నివేదికలు ప్రభుత్వానికి పంపింది. | Read More

ETV Bharat Live Updates - FLOODS DAMAGE IN KHAMMAM

06:55 AM, 10 Sep 2024 (IST)

చెరువుల ఎఫ్​టీఎల్​, బఫర్ జోన్లపై రీసర్వే చేశాకే 'బుల్డోజర్' - వ్యూహం మార్చుకున్న హైడ్రా - HYDRA resurvey FTL and buffer zones

Hydra Changed Tactics : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా తన వ్యూహాన్ని మార్చుకుంది. చెరువుల ఎఫ్​టీఎల్​, బఫర్ జోన్లపై రీసర్వే చేసి కొత్తగా మార్క్ చేశాకే కూల్చివేతలకు దిగబోతుంది. ఇప్పటికే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న వారి జోలికి వెళ్లబోమని హైడ్రా ప్రకటించింది. కొత్తగా నిర్మించే ఆవాసాల కూల్చివేతలకు సంబంధించి బిల్డర్ల ద్వారా బాధితులకు పరిహారం ఇప్పించేలా అండగా ఉండాలని నిర్ణయించుకుంది. | Read More

ETV Bharat Live Updates - HYDRA IS SENSATIONAL DECISION
Last Updated : Sep 10, 2024, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details