తెలంగాణ

telangana

By Telangana Live News Desk

Published : 4 hours ago

Updated : 12 minutes ago

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 3 October 2024 

Latest Telangana News - Thu Oct 03 2024 తెలంగాణ లైవ్ వార్తలు- జానీ మాస్టర్​కు మధ్యంతర బెయిల్ మంజూరు - కారణం ఇదే ​ - Interim Bail For Jani Master

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

11:46 AM, 03 Oct 2024 (IST)

జానీ మాస్టర్​కు మధ్యంతర బెయిల్ మంజూరు - కారణం ఇదే ​ - Interim Bail For Jani Master

Interim Bail For Jani Master : అత్యాచార ఆరోపణలపై అరెస్టైన డ్యాన్స్​ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్​కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉందని కోరుతూ జానీ మాస్టర్​ బెయిల్​కు దరఖాస్తు చేసుకోగా, పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈ నెల 6వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది. | Read More

ETV Bharat Live Updates -

10:56 AM, 03 Oct 2024 (IST)

ఇకపై BCAలోనూ స్పెషలైజేషన్లు - బీటెక్​ తరహాలో ఏఐ, ఎమ్​ఎల్​, డేటా సైన్స్​ తదితర కోర్సులు - Specializations In BCA

BCA Courses Revamp : దేశవ్యాప్తంగా బీసీఏతో పాటు బీబీఏ కోర్సులు ప్రస్తుత అకడమిక్​ ఇయర్​లో యూనివర్సిటీ నిధుల సంఘం( యూజీసీ) నుంచి ఏఐసీటీఈ పరిధిలోకి వచ్చిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలోనే బీసీఏ కోర్సులో తీసుకురావాల్సిన సంస్కరణలు మార్పులు చేర్పులపై ఏఐసీటీఈ దృష్టిసారించింది. బీసీఏకు మోడల్ విద్యాప్రణాళిక తీసుకురావడం, ఎంట్రీ- ఎగ్జిట్​ ఆప్షన్ తదితర అంశాలపై బెంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్​ బీఎల్​ మురళీధర నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నివేదికను అందజేసింది. | Read More

ETV Bharat Live Updates - AICTE FOCUS ON BCA COURCES

10:38 AM, 03 Oct 2024 (IST)

వానాకాలం సీజన్​ నుంచే 'సన్నాల బోనస్' - ఈ-కుబేర్‌ ద్వారా విడిగా చెల్లింపు! - Bonus for fine Rice Paddy

Govt Focus On Bonus For Fine Rice : సన్న వడ్లకు బోనస్​ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, వానాకాలం సీజన్​ నుంచే అమలు చేయనుంది. అన్నదాతల నుంచి కొనుగోలు చేసే సన్నధాన్యానికి ఇచ్చే బోనస్​కు సంబంధించి కసరత్తు చివరి దశకు చేరుకుంది. క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ రూపంలో రైతులకు రూ.2,445 కోట్ల ప్రయోజనం చేకూరుతుందని పౌరసరఫరాల సంస్థ వర్గాలు చెబుతున్నాయి. | Read More

ETV Bharat Live Updates - GOVT FOCUS ON BONUS FOR FINE RICE

10:06 AM, 03 Oct 2024 (IST)

పల్లె బాట పట్టిన నగరవాసులు - సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో పరిస్థితి ఎలా ఉందంటే? - Secunderabad railway station rush

Dussehra 2024 : నగరంలో అప్పుడే దసరా పండుగ ఎఫెక్ట్ కనిపిస్తోంది. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో తల్లిదండ్రులు వారి పిల్లలతో సొంతూళ్లకు పయనం అవుతున్నారు. దీంతో సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ ప్రయాణికులతో రద్దీగా మారింది. అడుగుతీసి అడుగు వేయాలన్నా ఖాళీ లేకుండా ఉంది. | Read More

ETV Bharat Live Updates - DUSSEHRA 2024

10:07 AM, 03 Oct 2024 (IST)

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​ - ఇక వాట్సాప్​ ద్వారా దర్శనం బుకింగ్​ - TTD Ticket Booking Through Whatsapp

TTD Ticket Booking Through Whatsapp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దైనందిన జీవనంలో భాగంగా మారిన వాట్సాప్ సేవల్ని ఇక శ్రీవారి దర్శనాలు సులభతరం చేసేందుకూ అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. వాట్సప్ ద్వారా సినిమా టిక్కెట్లు, గ్యాస్ బుకింగ్, విమాన టికెట్లు సైతం సులభంగా బుక్ చేసుకుంటున్నప్పుడు భక్తులు తమకు నచ్చిన రోజు దైవదర్శనం సులభంగా చేసుకునే వీలు కల్పించాలన్నది ఆంధ్రప్రదేశ్​ సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. | Read More

ETV Bharat Live Updates - TTD TICKET BOOKING THROUGH WHATSAPP

09:04 AM, 03 Oct 2024 (IST)

దసరా ఎంజాయ్​ చేసేందుకు ఊరెళ్తున్నారా? - ఈ జాగ్రత్తలు మీకోసమే - మర్చి'పోయారో' మొత్తం ఊడ్చేస్తారు! - HOME SAFETY MEASURES BY POLICE

Home Safety Measures By Police : దసరాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దసరా పండుగను సొంతూరు, కుటుంబసభ్యుల మధ్య నిర్వహించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలోనే సెలవులకు సొంతూళ్లకు వెళ్లే నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ పోలీసులు సూచిస్తున్నారు. దొంగతనాల కట్టడికి జంట నగరాల్లోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. | Read More

ETV Bharat Live Updates - HOME SAFETY MEASURES BY POLICE

08:49 AM, 03 Oct 2024 (IST)

'సీతారామ'లో మరో ముందడుగు! - రూ.4 వేల కోట్ల పనులకు రేపోమాపో టెండర్లు!! - Sita rama lift project

Sita Rama Project : సీతారామ ఎత్తిపోతల పనుల్లో మరో ముందడుగు పడనుంది. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావొస్తుండగా, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాలను రేపో, మాపో టెండర్‌ ప్రకటన జారీ కానుంది. మొత్తం దాదాపు రూ.4 వేల కోట్ల పనులకు టెండర్‌ ప్రకటన వచ్చే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. | Read More

ETV Bharat Live Updates - SITARAMA PROJECT

08:45 AM, 03 Oct 2024 (IST)

నేటి నుంచి రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం - తొలి విడతలో ఈ జిల్లాల్లో ప్రారంభం - Govt To distribute Fish seeds

Free Fish Seeds Distribution In TG : రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ఆరంభం కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. పండుగ వాతావరణం నడుమ మత్స్యకారులు ప్రత్యేక పూజలు చేస్తూ చెరువుల్లోకి చేప పిల్లలు వదలనున్నారు. మత్స్యకార కుటుంబాల్లో సిరులు కురవడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - FREE FISH SEEDS DISTRIBUTION

07:44 AM, 03 Oct 2024 (IST)

'మీ మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు' : సమంతకు మంత్రి సురేఖ క్షమాపణలు - Konda Surekha Apologize to Samantha

Konda Surekha Apologize to Actress Samantha : నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. మంత్రి మాటలపై సమంత ఘాటుగానే స్పందించారు. ఆమెతో పాటు నాగార్జున, నాగ చైతన్య సహా సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సైతం మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. ఈ విషయం పెద్దది కావడంతో తాజాగా మంత్రి క్షమాపణలు తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - MINISTER SUREKHA TWEET

07:16 AM, 03 Oct 2024 (IST)

నేటి నుంచి ప్రారంభం కానున్న కుటుంబ డిజిటల్​ కార్డుల ప్రక్రియ - ఆ 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు - telangana family digital cards

Family Digital Cards in Telangana : రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి కుటుంబ డిజిటల్​ కార్డుల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామాలు, వార్డులు, డివిజన్లలో ఈ నెల 7 వరకు అధికారులు ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యుల వివరాలు నిర్ధారించుకుంటారు. మరణించిన వారిని తొలగించడం, కొత్తవారిని చేర్చడం వంటి ప్రక్రియ నిర్వహిస్తారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో డిజిటల్ కార్డుల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. | Read More

ETV Bharat Live Updates - FAMILY DIGITAL CARDS IN TELANGANA
Last Updated : 12 minutes ago

ABOUT THE AUTHOR

...view details