Dwarf Planet Pluto: మరుగుజ్జు గ్రహం ప్లూటోకు అతిపెద్ద చంద్రుడైన 'చరోన్'పై కార్బన్ డయాక్సైడ్ (బొగ్గుపులుసు వాయువు), హైడ్రోజన్ పెరాక్సైడ్ వాయువుల ఉనికిని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. బాహ్య సౌర వ్యవస్థలో మంచు ఎలా ఆవిర్భవించిందీ, ఆ తర్వాత ఎలాంటి మార్పులకు లోనయిందీ తెలుసుకునేందుకు ఈ పరిణామం ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి.
ప్లూటోకు ఐదు సహజ చందమామలు ఉన్నాయి. వాటిలో చరోన్ అతిపెద్దది. 1978లో దాన్ని కనుగొన్నారు. చరోన్‌పై మంచు, అమ్మోనియా, కర్బన సమ్మేళనాల ఉనికి గతంలోనే బయటపడింది. అమెరికాలోని సౌత్‌వెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తల నేతృత్వంలోని బృందం తాజాగా చరోన్‌పై కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్‌లను గుర్తించింది.
ఎలక్ట్రాన్లు/అయాన్ల వంటి ఆవేశ కణాలు ఢీకొట్టడంతో మంచు విడిపోయి.. హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువులు విడుదలయ్యాయని, అవి కలిసి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రధానంగా జాబిల్లి చరోన్‌పై మంచు ఉపరితలంపై కార్బన్ డయాక్సైడ్ ఉందని వెల్లడించారు.
చంద్రయాన్-3 మరో కీలక ఆవిష్కరణ- జాబిల్లిపై భారీ పురాతన బిలం - New Discoveries of Chandrayaan3