ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 1 October 2024 

Telangana News - Live Updates Today: తెలంగాణ Tue Oct 01 2024 లేటెస్ట్‌ వార్తలు- హైదరబాద్​లో భారీగా హవాలా మనీ - రూ. 1.21 కోట్ల నగదు సీజ్​ - Huge Hawala Money Seized in Hyd

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Telangana Live News Desk

Published : Oct 1, 2024, 7:10 AM IST

Updated : Oct 1, 2024, 11:00 PM IST

10:57 PM, 01 Oct 2024 (IST)

హైదరబాద్​లో భారీగా హవాలా మనీ - రూ. 1.21 కోట్ల నగదు సీజ్​ - Huge Hawala Money Seized in Hyd

Huge Hawala Cash Seized by Police : హైదరాబాద్​ నగరంలోని సుల్తాన్‌బజార్‌లో భారీ మొత్తంలో హవాలా డబ్బు పట్టుబడింది. వాహన తనిఖీలలో రూ.1.21 కోట్ల నగదును పోలీసులు గుర్తించి, సీజ్​ చేశారు. ఈ హవాలా డబ్బు తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HUGE HAWALA MONEY IN HYDERABAD

09:55 PM, 01 Oct 2024 (IST)

హైదరాబాద్​లో భారీ వర్షం - పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ జామ్​ - Heavy Rains In Hyderabad

Heavy Rains In Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రహదారులు జలమయంకావడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. పంజాగుట్ట-అమీర్‌పేట రహదారి చెరువును తలపించేలా వరద నీటితో నిండిపోయింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYDERABAD HEAVY RAINS

09:50 PM, 01 Oct 2024 (IST)

హైడ్రా జీవో 99 చట్టబద్ధతను సవాల్ చేస్తూ పిటిషన్ - మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు - TELANAGANA HIGH COURT ON HYDRA

High Court On HYDRA GO NO 99 : హైడ్రా ఏర్పాటుపై తీసుకొచ్చిన జీవో 99పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జీవో అమలును నిలిపిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ప్రభుత్వం కౌంటరు దాఖలు చేసేదాకా జీవో అమలును నిలిపిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TELANGANA HIGH COURT ON HYDRA

07:41 PM, 01 Oct 2024 (IST)

2017లో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేష‌న్ ఏర్పాటు చేసిందెవరు? : మంత్రి శ్రీధర్​ బాబు - Minister Sridhar Babu Fires On BRS

Minister Sreedhar Babu On Musi Riverfront Issue : మూసీ ప్రక్షాళనపై మంత్రి శ్రీధర్‌బాబు గత ప్రభుత్వంలో జరిగిన సమావేశం వివరాలను వెల్లడించారు. బీఆర్ఎస్​ ప్రభుత్వంలో మూసీ ప్రక్షాళన ఆలోచన చేసిందని, అనేక సమావేశాలు నిర్వహించిందని చెప్పుకొచ్చారు. సర్వే నిర్వహించి బఫర్‌ జోన్‌, అక్రమ నిర్మాణాలను గుర్తించిదని చెప్పారు. అప్పటి ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారమే ముందుకు వెళ్తున్నామన్న శ్రీధర్‌బాబు, వారు చేస్తే మంచి మేము అమలు చేస్తే మాత్రం తప్పంటూ రాద్దాంతం చేయడం తగదన్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MINISTER SRIDHAR BABU SLAMS ON BRS

07:30 PM, 01 Oct 2024 (IST)

హైదరాబాద్‌ ఊరేగింపుల్లో డీజేలపై నిషేధం : సీపీ సీవీ ఆనంద్​ - DJ Sound Ban in Hyderabad

DJ Sound Banned in Hyderabad : ఊరేగింపులు, పండుగల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై హైదరాబాద్​ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని డయిల్‌ 100కు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డీజేలపై నిషేధం విధిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DJS ARE BANNED IN HYD

07:27 PM, 01 Oct 2024 (IST)

'మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్​కు మంచి పేరు రాకూడదనే - బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం' - Chamala Kiran Kumar on Musi River

Chamala Kiran Kumar Reddy On Musi River Issue : మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్​కు మంచి పేరు రాకూడదనే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పేదలకు అన్యాయం జరగకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లు, మహిళలకు రుణాలు, పిల్లల చదువులకు బాధ్యత తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. మూసీని ప్రక్షాళించకపోతే హైదరాబాద్​కు భారీ నష్టం తప్పదన్న చామల ఏటా వర్షాకాలంలో పడవల్లో తిరగాల్సి వస్తుందని వివరించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CHAMALA KIRAN KUMAR COMMENTS

05:43 PM, 01 Oct 2024 (IST)

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అంతర్రాష్ట్ర ఆపరేషన్ - 27 మంది సైబర్​ నేరగాళ్ల అరెస్ట్ - IPS Shikha Goyal On Cyber Crimes

IPS Shikha Goyal Press Meet On Cyber Arrests : దేశంలో సైబర్​ దాడులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్రానికి చెందిన సైబర్​ సెక్యూరిటీ టీమ్​ అలర్ట్​ అయ్యింది. ఈ మేరకు తొలిసారి అంతర్రాష్ట్ర ఆపరేషన్​ నిర్వహించి, 27 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేసింది. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు సహా ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఆ వివరాలను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్‌ తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CYBER SECURITY DIRECTOR SHIKHA GOEL

05:03 PM, 01 Oct 2024 (IST)

ఆ ఫ్యామిలీలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే - డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటిన తండ్రీకుమారులు - Father and Son Selected in DSC

Father and Son Achieved Ranks in DSC 2024 : మూడుసార్లు డీఎస్సీ పరీక్షలు రాశాడు. ప్రతిసారీ స్వల్ప మార్కుల తేడాతో ఉద్యోగం పొందే అవకాశం కోల్పోయాడు. వరుస వైఫల్యాలు ఎదురైనా కుంగిపోలేదు. వయసు మీద పడుతున్నా అధైర్యపడలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయున్ని కావాలన్న లక్ష్యాన్ని వీడలేదు. వయో పరిమితి సడలింపును అవకాశంగా మలచుకున్నాడు. 2023 డీఎస్సీకి శక్తినంతా కూడదీసుకుని సన్నద్ధమయ్యాడు. చివరకు 50 ఏళ్ల వయసులో, ఆఖరి ప్రయత్నంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని దక్కించుకున్నాడు. తాను చివరి ప్రయత్నంలో సర్కారీ నౌకరీ సంపాదిస్తే, అతని పెద్ద కుమారుడు ఇదే డీఎస్సీలో మొదటి ప్రయత్నంలోనే కొలువు కొల్లగొట్టాడు. తండ్రి, కుమారులిద్దరే కాదు కుటుంబం మొత్తం ప్రభుత్వ ఉద్యోగులే. కటిక పేదరికం నుంచి అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఎదిగిన ఆ కుటుంబంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FATHER AND SON GOT RANKS IN DSC

04:48 PM, 01 Oct 2024 (IST)

హైదరాబాద్​లో కూల్చివేత చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపేయాలి : బీజేపీ ఎంపీ లక్ష్మణ్ - BJP MP Laxman Comments On Hydra

BJP MP Laxman Comments On Hydra : హైదరాబాద్​లో కూల్చివేత చర్యలను ప్రభుత్వం వెంటనే ఆపేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బీజేపీ బాధిత ప్రజల పక్షాన అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. సుందరీకరణ పేరుతో పేదల కడుపు కొడతారా అని ప్రశ్నించారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు ప్రకటించి అమలు చేయలేక హైడ్రా పేరుతో ప్రజల దృష్టి మరల్చేలా డ్రామాలు తెరపైకి తెస్తున్నారని అన్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BJP MP LAXMAN COMMENTS ON CONGRESS

04:34 PM, 01 Oct 2024 (IST)

సైకిల్‌ తొక్కుతూ - క్యూబ్‌ కలుపుతూ - గిన్నిస్‌ రికార్డు సాధించిన నెల్లూరు కుర్రాడు - NELLORE NAYAN GOT GUINNESS RECORD

Nayan Maurya Excelling in Rubiks Cube : సరదాగా స్నేహితులు ఆడుతుంటే చూసి రూబిక్స్​ క్యూబ్‌పై ఇష్టం పెంచుకున్నాడా కుర్రాడు. ఆ ఆటనే హాబీగా ఎంచుకుని సాధన చేశాడు. చదువుల్లో రాణిస్తూనే రూబిక్స్ పజిల్స్‌ పరిష్కరించి పతకాలు పట్టేశాడు. దీనిలో వైవిధ్యం కనబరిచి గిన్నిస్‌ రికార్డుపై గురిపెట్టాడు. సైకిల్‌ తొక్కుతూ అతితక్కువ సమయంలోనే రూబిక్స్ క్యూబ్‌ పజిల్స్‌ పూర్తి చేసాడు. లక్ష్యం పెట్టుకొని గిన్నిస్‌ రికార్డు సాధించాడు. మరి ఆ తెలుగింటి కుర్రాడు ఎవరో మనమూ తెలుసుకుందామా. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - NAYAN MAURYA EXCELLING RUBIKS CUBE

03:57 PM, 01 Oct 2024 (IST)

మూసీ అభివృద్ధి పేరుతో గతంలో అప్పులు తెచ్చి ఎక్కడ ఖర్చు పెట్టారు? : మంత్రి కోమటిరెడ్డి - Musi River Development Project

Musi River Development Project : మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలను తరలించి, మూసీని శుద్ధిచేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో మూసీ ప్రక్షాళనకు ఛైర్మన్‌ను నియమించి ఏం చేశారని, మూసీని ఎందుకు ప్రక్షాళన చేయలేదని ఆయన ప్రశ్నించారు. తాము చేస్తుంటే ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MINISTER KOMATI REDDY SLAMS BRS

03:56 PM, 01 Oct 2024 (IST)

తిరుమల కల్తీ నెయ్యి ఘటన - సిట్‌ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేత - AP DGP ON TIRUMALA LADDU ISSUE

AP DGP ON TIRUMALA LADDU ISSUE : తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై ఏపీ డీజీపీ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్‌ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా సిట్‌ దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - SIT INVESTIGATION STOPPED

03:33 PM, 01 Oct 2024 (IST)

'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం - హోంగార్డ్​ గోపాల్ కుటుంబాన్ని సర్కార్​ ఆదుకోవాలి' - Harish Rao Fires On Congress Govt

Harish Rao Fires On Congress Govt : మల్కాపూర్ కూల్చివేత ఘటనలో గాయపడిన హోంగార్డు గోపాల్​ను మాజీ మంత్రి హరీశ్​రావు పరామర్శించారు. కనీస జాగ్రత్తలు పాటించనందున, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. హోంగార్డు చికిత్సకు కనీసం ప్రభుత్వం వైద్య ఖర్చులు కూడా భరించట్లేదని అన్నారు. గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HARISH RAO VISIT TO HOME GUARD

01:43 PM, 01 Oct 2024 (IST)

బుల్డోజర్ రాజకీయాలపై ప్రజల గళం - రాహుల్ గాంధీకి వినిపించడం లేదా? : కేటీఆర్ - KTR ON MUSI DEMOLITIONS

KTR On Musi Demolitions : బుల్డోజర్ రాజకీయాలపై తెలంగాణ ప్రజల గళం రాహుల్ గాంధీకి వినిపించడం లేదా? అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. సమస్యలపై చిన్నారి అయినా సరే పిలిస్తే వస్తానని తుక్కగూడలో సభలో రాహుల్‌ గాంధీ ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడి, మూసీ ప్రాజెక్టు ప్రభావిత బాధితులను కలవాలని కేటీఆర్ సూచించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KTR QUESTIONED RAHUL GANDHI

01:28 PM, 01 Oct 2024 (IST)

మియాపూర్​లో సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని దారుణ హత్య - అతడి పనేనా? - Software Woman Murdered in Miyapur

Young Software Woman Murdered in Hyderabad : వివాహితను తన ఇంట్లో పదునైన ఆయుధంతో హత్య చేసిన ఘటన మియాపూర్​లో స్థానికంగా కలకలం రేపుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల క్రితం భర్త వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి విడాకుల కేసు కోర్టులో ఉండగానే తను హత్యకు గురైంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - YOUNG SOFTWARE WOMAN MURDERED

01:20 PM, 01 Oct 2024 (IST)

మూసీ రివర్​బెడ్​లో కూల్చివేతలు షురూ - కూలీల సహాయంతో నివాసాల నేలమట్టం - Demolitions at Shankar Nagar

Musi Demolitions at Shankar Nagar : హైదరాబాద్‌ మలక్‌పేట నియోజకవర్గ పరిధిలోని మూసీ నదీ గర్భంలో నిర్వాసితుల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. శంకర్‌నగర్‌లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DEMOLITIONS AT SHANKAR NAGAR

01:01 PM, 01 Oct 2024 (IST)

'ప్రభుత్వానికి సహకరించకపోగా అనవసర విమర్శలు' : బీఆర్​ఎస్​ తీరుపై తుమ్మల మండిపాటు - Minister Tummala On Loan Waiver

Minister Tummala On Loan Waiver : రైతులను ఆదుకుంటున్న తమ ప్రభుత్వానికి సహకరించకపోగా బీఆర్ఎస్​ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. రుణమాఫీపై బీఆర్ఎస్​ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. మూడు విడతల్లో రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని వెల్లడించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MINISTER TUMMALA ON LOAN WAIVER

11:30 AM, 01 Oct 2024 (IST)

దోపిడీ కొండంతా- రాబట్టేది గోరంతా - సైబర్​ మోసాల సొమ్ము రికవరీలో పోలీసుల అలసత్వం - Less Recoveries in Cyber Crimes

Police Recovering Less Amount in Cybercrime : సైబర్​ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లాభాల ఆశచూపుతూ సైబర్ మోసగాళ్లు భారీగా దండుకుంటున్నారు. సైబర్ నేరాల్లో కోల్పోయిన సొమ్ములో పోలీసులు అతి కష్టం మీద తక్కువ మొత్తంలో రికవరీ చేస్తున్నారు. దీనికి కారణం బాధితులు సకాలంలో ఫిర్యాదు చేయకపోవడమేనని వారు పేర్కొంటున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - LESS RECOVERIES IN CYBER CRIMES

10:21 AM, 01 Oct 2024 (IST)

దొంగలున్నారు తస్మాత్​ జాగ్రత్త - దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారికి పోలీసుల టిప్స్ ఇవే! - Home Safety Tips for Dussehra

Home Safety Tips for Dussehra by police : రాష్ట్రంలో దసరా ఉత్సవాలు ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో చాలా మంది తమ ఫ్యామిలీలతో పాటు నగరం నుంచి స్వగ్రామాలకు ప్రయాణమవుతుంటారు. దీనినే ఆసరాగా తీసుకుని కొంతమంది గజదొంగలు రెచ్చిపోతుంటారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దోపిడీల పర్వం సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్​ పోలీసులు చోరీల నివారణకు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HOME SAFETY MEASURES BY POLICE

10:07 AM, 01 Oct 2024 (IST)

అశ్లీలం చూస్తే ‘కటకటాలే ’ - సాంకేతిక ఆధారాలతో ఆచూకీ కనిపెడుతున్న పోలీసులు - Pocso Cases Increasing in Hyderabad

Pocso Cases Increasing in Hyderabad : చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు డౌన్​లోడ్​ చేసి చూసినా, వ్యాప్తి చేసినా ఇక జైల్లో ఊచలు లెక్కపెట్టాడానికి సిద్ధంగా ఉండాల్సిందే. సాంకేతిక ఆధారాలతో పోలీసులు కనిపెడుతున్నారు. చిన్నారుల అశ్లీల దృశ్యాలు చూసినా, సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు పంపినా పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం ఐదేళ్లు జైలు శిక్ష విధించనున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - చైల్డ్ పోర్నోగ్రఫీపై పోలీసుల నజర్

08:45 AM, 01 Oct 2024 (IST)

గంజాయి​ సరఫరాకు అడ్డాగా మారిన వరంగల్​ - స్మగ్లింగ్​పై పోలీసుల ఉక్కుపాదం - GANJA SMUGGLING IN WARANGAL

Ganja Seized in Warangal : గంజాయి రవాణాతో పాటు సరఫరాదారులపై కఠిన చర్యలు చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన సరకు పట్టుబడుతోంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పెద్దమొత్తంలో గంజాయి సాగయ్యేది, అయితే పోలీసుల నిఘా పెరగడంతో పండించడం మానేసి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం అలవరుచుకున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GANJA SEIZED IN KHAMMAM

07:49 AM, 01 Oct 2024 (IST)

మా లక్ష్యం కూల్చివేతలు కాదు, చెరువుల పునరుద్దరణ మాత్రమే- హైడ్రా​ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు - HYDRA Clarity on Musi Demolitions

HYDRA Clarity on Musi Demolitions : హైడ్రా లక్ష్యం కూల్చివేతలు కాదని చెరువుల పునరుద్దరణ మాత్రమేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రాపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. హైడ్రా తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వివిధ అంశాలపై స్పందించిన రంగనాథ్, మూసీ సుందరీకరణతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. కూల్చివేతలన్నీ హైడ్రావి కావని స్పష్టం చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYDRA CLARITY ON DEMOLITIONS

07:22 AM, 01 Oct 2024 (IST)

సామాజిక మాధ్యమాలపై సర్కార్​ ఫోకస్ - ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు​ పెడితే జైలుకే! - CONGRESS COMPLAINTS ON FAKE NEWS

Congress Complaint on Social Media Handles : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులతోపాటు సర్కారుపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర పదజాలంతో వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కొన్ని యూట్యూబ్‌ చానళ్లు వాస్తవ విరుద్ధమైన అంశాలు ప్రసారం చేస్తూ ప్రభుత్వానికి అన్వయించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను ప్రభుత్వానికి జోడిస్తూ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ చేస్తుండడంతో పలు వీడియోలపై కాంగ్రెస్‌ పార్టీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CONGRESS COMPLAINTS CYBER POLICE

07:01 AM, 01 Oct 2024 (IST)

ఆదిలాబాద్​, నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం- ఎనిమిది మంది మృతి - Road Accident AT Adilabad

Road Accident in Adilabad : ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లాలో గుడిహత్నూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ఆదిలాబాద్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం

Last Updated : Oct 1, 2024, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.