ETV Bharat / sports

ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కిన పుజారా- తొలి టెస్టు కోసమే! - PUJARA BORDER GAVASKAR TROPHY

సీనియర్ బ్యాటర్ పుజారా ఆసీస్​ బయల్దేరినట్టు సమాచారం - ఎందుకంటే?

Cheteshwar Pujara
Cheteshwar Pujara (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 19, 2024, 6:57 AM IST

Cheteshwar Pujara Border Gavaskar Trophy : మరో మూడు రోజుల్లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా- భారత్ మధ్య తొలి టెస్టు మొదలు కానుంది. అయితే ఈ ప్రతిష్ఠాత్మక సిరీస్​కు ముందే టీమ్ఇండియాకు ఆందోళన మొదలైంది. వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం కానుండగా, యంగ్ బ్యాటర్ శుభ్​మన్ గాయం వల్ల అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఫ్యాన్స్​లో ఆందోళన నెలకొంది. ఇలాంటి సమయంలో టీమ్ఇండియా నయా వాల్ ఛెతేశ్వర్ పుజారా ఆస్ట్రేలియాకు పయనమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆసీస్​లో పుజారా ఏం చేయనున్నాడు?

బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి టీమ్ఇండియా జట్టులో పుజారాను బీసీసీఐ ఎంపిక చేయలేదు. దీంతో సీనియర్ ప్లేయరైన పుజారా ఒక్క అవకాశం ఇస్తే బాగుండేది అనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే గిల్ గాయం తర్వాత అతడికి రిప్లేస్​మెంట్​ ఎవరో బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో పుజారా ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కాడని, తొలి టెస్టు సందర్భంగా పెర్త్​లో అతడు కనిపించనున్నాడని ప్రచారం సాగుతోంది. ​దీంతో పుజారా జట్టులో చోటు దక్కించుకున్నాడని ఫ్యాన్స్​ సంబరపడిపోతున్నారు. గిల్ రిప్లేస్​మెంట్ పుజారానే అని భావిస్తున్నారు.

కానీ, పుజారా వెళ్లింది మాత్రం మ్యాచ్ ఆడేందుకు కాదట. ఈ టెస్టు సిరీస్​లో కామెంటరీ చేయడానికి అని సమాచారం. ఈ సిరీస్​ను లైవ్ టెలికాస్ట్ చేస్తున్న స్టార్ స్పోర్ట్స్​ ఛానెల్​లో పుజారా హిందీ కామెంటేటర్​గా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. అంటే పుజారా పెర్త్ వెళ్లినప్పటికీ మైదానంలో కాకుండా, కామెంటరీ బాక్స్​లో కనిపిస్తాడన్న మాట. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత పుజారా మళ్లీ టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేదు. అప్పట్నుంచి డొమెస్టిక్ టోర్నీల్లో పుజారా రాణిస్తున్నప్పటికీ సెలక్టర్ల పిలుపు అందుకోలేదు. కాగా, తన సుదీర్ఘ కెరీర్​లో పుజారా టీమ్ఇండియా తరఫున 103 అంతర్జాతీయ టెస్టు ఆడాడు. అందులో 43.60 సగటున 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు బాదాడు.

'టీమ్ఇండియాలో పూజారాకు ఇంకా ప్లేస్ ఉంది- జట్టుకు అతడు అవసరం!'

25వ రంజీ సెంచరీ బాదిన పుజారా - బ్రియాన్ లారా రికార్డ్ బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.