Man Suicide for Helped his Friend in AP : తప్పని చెప్పాల్సిన స్నేహితుడి వివాహేతర సంబంధానికి చేసిన సాయమే అతని పాలిట మృత్యుపాశమైంది. ఈ ఘటనను అవమానంగా భావించిన ఆ యువకుడు, సోమవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడిపైనే ఆధారపడిన వృద్ధురాలైన తల్లి, దివ్యాంగురాలైన చెల్లి అనాథలు అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని బోడేవారిపల్లెకు చెందిన పల్ల దేవేంద్ర (32), చిన్న రమణ, చౌడేపల్లె అగ్రహారానికి చెందిన ప్రసాద్, విశ్వనాథ్ స్నేహితులు. పుంగనూరు నుంచి బెంగళూరుకు కూరగాయలను రవాణా చేస్తుంటారు.
వీరికి ఇదే గ్రామానికి చెందిన చిరంజీవి పరిచయమయ్యాడు. అతను పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్లో వ్యాన్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతనికి పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. ఇదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసే ఓ వివాహిత చిరంజీవికి పరిచయమయ్యారు. వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు నవంబర్ 15న పారిపోవడానికి పథకం వేశారు. దీంతో దేవేంద్ర వారిద్దరూ పారిపోవడానికి తన స్నేహితుడైన ప్రసాద్ వద్ద ఉన్న కారును తీసుకొచ్చి చిరంజీవికి ఇచ్చాడు.
స్నేహితులను విచారించిన పోలీసులు : వివాహితను ఎక్కించుకుని చిరంజీవి ఆ కారులో పరారయ్యాడు. ఈ క్రమంలో తన సోదరి కనిపించడం లేదంటూ వివాహిత సోదరుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు స్నేహితులను ఆదివారం స్టేషన్కు పిలిపించి విచారించారు. మళ్లీ సోమవారం కూడా విచారణకు రావాలని పంపించేశారు. ఈ ఘటను అవమానంగా భావించిన దేవేంద్ర, తన స్వగ్రామంలోని వ్యవసాయ పొలాల్లోని చెట్టుకు సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాన్ని పుంగనూరు శవాగారానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని మహిళ బ్లాక్ మెయిల్ : ఓ 50 ఏళ్ల మహిళ, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితోనే ఆ సంబంధాన్ని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేసింది. కుటుంబసభ్యలకు చెప్పి పరువు తీస్తానంటూ డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో భయపడిపోయిన ఆ వ్యక్తి ఆమెకు రూ.2 లక్షలు ఇచ్చాడు. అయినా ఆమె ఇంకా డబ్బులు కావాలంటూ డిమాండ్ చేయగా గొంతు నులిమి హత మార్చాడు. ఈ పూర్తి కథనం కోసం ఇక్కిడ క్లిక్ చేయండి
ఈత నేర్పిస్తామని తీసుకెళ్లి బాలుడి హత్య - వివాహేతర సంబంధమే కారణం