ETV Bharat / bharat

ఝార్ఖండ్ ఎన్నికల్లో కుటుంబ సభ్యుల మధ్యే పోటీ - ​ ఫలితాలను తేల్చేది సంతాల్‌ గిరిజనులే! - JHARKHAND ELECTION 2024

ఝార్ఖండ్‌ రెండో విడతలో 38 స్థానాలకు ఎన్నికలు - ఈ ఎన్నికల్లో సంతాల్ గిరిజనులే కీలకం

Jharkhand Election 2024
Jharkhand Election 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2024, 7:33 AM IST

Jharkhand Election 2024 Santhal Pargana : ఝార్ఖండ్‌లో తొలి విడత పోలింగ్‌ పూర్తి కావడం వల్ల రెండో విడతపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నెల 20వ తేదీన రాష్ట్రంలోని మిగిలిన 38 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో గిరిజన ప్రాంతాలు అధికంగా ఉండటం వల్ల ఝార్ఖండ్‌ ముక్తి మోర్చాకు (జేఎంఎం) అత్యంత కీలకం కానుంది. ఇక్కడి ఫలితాలే వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఎవరు పాలించేదీ తేల్చనున్నాయి. ఈ ప్రాంతంలోని మొత్తం 38 సీట్లలో 18 సీట్లలో ఫలితాలను సంతాల్‌ గిరిజనులే తేలుస్తారు. జేఎంఎంకు ఈ ప్రాంతం కంచుకోట కావడమే కాకుండా ఈసారి రక్త సంబంధీకుల మధ్య పోటీ నెలకొనడం ఆసక్తికరంగా మారింది.

కుటుంబాల పోటీ
ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బర్హైట్‌ నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన మరో నియోజకవర్గం దుంకా నుంచి ఈసారీ ఆయన సోదరుడు బసంత్‌ సోరెన్‌ పోటీ చేస్తున్నారు. హేమంత్‌ గతంలో దుంకాను వదులుకోవడం వల్ల బసంత్‌ ఉప ఎన్నికల్లో గెలిచారు.జమాలో హేమంత్‌ వదిన సీతా సోరెన్‌ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆమె ఇటీవలే జేఎంఎం నుంచి బీజేపీలోకి మారారు. గాండేయ్‌లో హేమంత్‌ సతీమణి కల్పనా సోరెన్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడ గిరిజనులు, ముస్లింలు కలిపి 40శాతందాకా ఉన్నారు. ఇదే కల్పన బలం.

సంతాల్‌ పరగణ
సంతాల్‌ పరగణ నుంచి ఝార్ఖండ్‌కు ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు. ఆరుగురు మంత్రులుగా పని చేశారు. ఈ ప్రాంతంలో గిరిజన సెంటిమెంటును జేఎంఎం ప్రస్తావిస్తోంది. బంగ్లాదేశీల వలసలను బీజేపీ ప్రచారాస్త్రంగా మలుచుకుని ప్రచారాలు చేసింది. గత ఎన్నికల్లో సంతాల్‌ల ప్రాబల్యమున్న 18 సీట్లలో జేఎంఎం 9, కాంగ్రెస్‌ 5 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ నాలుగు సీట్లే దక్కించుకుంది.

81 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఝార్ఖండ్​లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 13న 43 స్థానాలకు పోలింగ్ జరగగా, 20న మిగతా నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 23న ఓట్స్ కౌంటింగ్ జరగనుంది. ఇక ఈ ఎన్నికల్లో ఎన్​డీఏ, ఇండియా కూటమి మధ్య ద్విముఖ పోరు జరగనుంది. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం)- కాంగ్రెస్‌ కూటమి హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమైంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.