ETV Bharat / state

ఇకపై BCAలోనూ స్పెషలైజేషన్లు - బీటెక్​ తరహాలో ఏఐ, ఎమ్​ఎల్​, డేటా సైన్స్​ తదితర కోర్సులు - Specializations In BCA

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

BCA Courses Revamp : దేశవ్యాప్తంగా బీసీఏతో పాటు బీబీఏ కోర్సులు ప్రస్తుత అకడమిక్​ ఇయర్​లో యూనివర్సిటీ నిధుల సంఘం( యూజీసీ) నుంచి ఏఐసీటీఈ పరిధిలోకి వచ్చిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలోనే బీసీఏ కోర్సులో తీసుకురావాల్సిన సంస్కరణలు మార్పులు చేర్పులపై ఏఐసీటీఈ దృష్టిసారించింది. బీసీఏకు మోడల్ విద్యాప్రణాళిక తీసుకురావడం, ఎంట్రీ- ఎగ్జిట్​ ఆప్షన్ తదితర అంశాలపై బెంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్​ బీఎల్​ మురళీధర నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నివేదికను అందజేసింది.

BCA Courses Revamp
BCA Courses Revamp (ETV Bharat)

Specializations In BCA : ఇంజినీరింగ్​ విద్యలో ఎన్నో రకాల బ్రాంచీలు, కోర్సులు, డిగ్రీలోనూ వివిధ రకాల సబ్జెక్టుల కాంబినేషన్లు. కానీ బీసీఏ మాత్రం వీటికి భిన్నంగా ఉంటుంది. బ్యాచిలర్​ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్​(బీసీఏ)లో చేరితే మాత్రం అందరూ ఒకే రకమైన సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. వచ్చే అకాడమిక్​ ఇయర్​ నుంచి(2025-26) నుంచి ఈ విధానంలో మార్పులు రానున్నాయి. బీసీఏలోనూ బీటెక్​ మాదిరిగా స్పెషలైజేషన్లు రానున్నాయి.

దేశవ్యాప్తంగా బీసీఏతో పాటు బీబీఏ కోర్సులు ప్రస్తుత అకడమిక్​ ఇయర్​లో యూనివర్సిటీ నిధుల సంఘం( యూజీసీ) నుంచి ఏఐసీటీఈ పరిధిలోకి వచ్చిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలోనే బీసీఏ కోర్సులో తీసుకురావాల్సిన సంస్కరణలు మార్పులు చేర్పులపై ఏఐసీటీఈ దృష్టిసారించింది. బీసీఏకు మోడల్ విద్యాప్రణాళిక తీసుకురావడం, ఎంట్రీ- ఎగ్జిట్​ ఆప్షన్ తదితర అంశాలపై బెంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్​ బీఎల్​ మురళీధర నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నివేదికను అందజేసింది.

ముసాయిదా మోడల్​ విద్యాప్రణాళికను విడుదల చేసిన ఏఐసీటీఈ దానిపై సూచనలను ఆహ్వానించింది. త్వరలోనే తుది విద్యాప్రణాళిక విడుదల చేయనుంది. బీబీఏకు తుది విద్యా ప్రణాళికను సంబంధిత అధికారులు ఇప్పటికే విడుదల చేశారు.

ఇవీ ముఖ్యమైన సిఫార్సులు

  • 3 ఏళ్ల కోర్సయిన బీసీఏలో మూడో ఏడాది నుంచి స్పెషలైజేషన్‌ను ప్రవేశపెట్టుకోవచ్చు. అందులో భాగంగా బీసీఏ(డేటా సైన్స్‌), బీసీఏ(ఏఐ అండ్‌ ఎంఎల్‌), బీసీఏ(ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌) లాంటి కోర్సులు తీసుకురావాలి.
  • బీసీఏ ఆనర్స్, బీసీఏ ఆనర్స్‌ విత్‌ రీసెర్చ్‌ పేరిట 4 ఏళ్ల కోర్సులను అందించాలి. ఆనర్స్‌లో మూడు, నాలుగో ఏడాదిలో స్పెషలైజేషన్లు చదవాల్సి ఉంటుంది.
  • బీసీఏలో ఏ స్పెషలైజేషన్‌ ఎంచుకున్నా ఫస్ట్​ ఇయర్​ రెండు సెమిస్టర్లలో అందరికీ ఒకే తరహా సబ్జెక్టులు బోధించాలి. రెండో ఏడాది నుంచి స్పెషలైజేషన్‌లో ఒక పేపర్‌ ప్రత్యేకంగా ఉండాలి. మూడు, నాలుగో సంవత్సరంలో పూర్తిగా స్పెషలైజేషన్​ను చదువుతారు.
  • పాఠ్యాంశాల్లో ప్రాక్టికల్స్‌ భాగం పెంచాలి. దానివల్ల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం విద్యార్థుల్లో పెరుగుతుంది.
  • క్రెడిట్​ విధానం ఉంటుంది. 3 ఏళ్ల కోర్సుకు 120, నాలుగేళ్ల కోర్సుకు 160 క్రెడిట్లు ఉంటాయి.

రాష్ట్రంలో కొద్ది కళాశాలలే ముందుకు : బీసీఏ( బ్యాచిలర్​ ఆఫ్ కంప్యూటర్​ అప్లికేషన్స్​), బీబీఏ కోర్సులు తమ పరిధిలోకి వచ్చినందున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని మూడు నెలల క్రితమే ఏఐసీటీఈ ఆదేశాలు జారీ చేసింది. దానిపై కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చెందటం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో 3ఏళ్లపాటు దాని పరిధిలోకి రాకుండా అనుమతించాలని కోరాయి.

ఈ నేపథ్యంలోనే విద్యాశాఖతోపాటు ఉన్నత విద్యామండలి సైతం ఏఐసీటీఈకి లేఖలు రాసింది. కాగా అక్కడి నుంచి స్పందన రాలేదు. ఈ క్రమంలో ఓయూ అధికారులు రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఫలితంగా కొన్ని కాలేజీలు మాత్రమే ఏఐసీటీఈకి దరఖాస్తు చేసి అనుమతులు పొందాయి. దాని పరిధిలోకి పోతే శాశ్వత భవనం, తగినంత విస్తీర్ణం, ఇతర మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఏటా అనుమతికి ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నది యాజమాన్యాల భయం. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోనే బీసీఏ, బీబీఏ కళాశాలలున్నాయి.

నీట్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ - స్థానికత వ్యవహారంలో రాష్ట్ర విద్యార్థులకు ఊరట - NEET Counselling Case Update in TG

బీటెక్ ఫస్ట్ ఇయర్​లో 9,677 విద్యార్థులు ఫెయిల్ - జేఎన్టీయూలో ఏం జరుగుతోంది? - PASSING PERCENTAGE DROP IN JNTUH

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.