ETV Bharat / entertainment

'దేవర' సక్సెస్​ మీట్​ - సెలబ్రేషన్స్​ కోసం తారక్ కూడా వెయిటింగ్ అంట! - Devara Success Meet - DEVARA SUCCESS MEET

Devara Success Meet : జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన 'దేవర' మంచి విజయం సాధించింది. దీంతో సక్సెస్ మీట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దీనిపై నిర్మాత నాగవంశీ తాజాగా ఓ ట్వీట్ చేశారు.

Devara Success Meet
Devara Success Meet (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 11:19 AM IST

Devara Success Meet : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన సినిమా 'దేవర పార్ట్ 1'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజై మంచి విజయం అందుకుంది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమాను ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు నిర్మాత నాగవంశీ థాంక్స్ చెప్పారు. ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ గురించి కూడా ప్రస్తావించారు.

'దేవర సినిమాకు ఇంత పెద్ద విజయం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఈ విజయాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ ఈవెంట్ నిర్వహించాలని తారక్ అన్న పట్టు పట్టాడు. అయితే మేం ఎంత్ర ప్రయత్నం చేసినప్పటికీ దేవి నవరాత్రులు, దసరా సీజన్​ వల్ల ఈవెంట్ ఏర్పాటుకు రెండు రాష్ట్రాల్లో అనుమతి దొరకడం లేదు. అది మా చేతుల్లో లేని పని కదా. ఇందుకు ఫ్యాన్స్, ప్రేక్షకులను క్షమాపణలు కోరుతున్నాం. అయినప్పటికీ మేం ఇంకా ప్రయత్నిస్తున్నాం. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం' అని ఆయన ట్వీట్ చేశారు.

ప్రీ రిలీజ్ క్యాన్సిల్
సెప్టెంబర్ 22న సాయంత్రం హైదరాబాద్​ నోవాటెల్​లో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఈవెంట్​కు అనూహ్యంగా అంచనాకు మించి అభిమానులు రావడం వల్ల నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీంతో తీవ్ర నిరుత్సాహంతో అభిమానులు వెనుదిరిగారు. దీనిపై హీరో ఎన్టీఆర్ అప్పుడే స్పందించారు. ఈవెంట్ రద్దు అవ్వడం వల్ల ఫ్యాన్స్​ కంటే ఎక్కువగా తానే బాధపడుతున్నట్లు చెప్పారు.

కాగా, సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్​లో కనిపించి ఆకట్టుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించింది. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించారు. శ్రీకాంత్, శ్రుతి మరాఠే, ప్రకాశ్ రాజ్, అజయ్ తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా, యువసుధ, ఎన్టీఆర్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కింది.

'దేవర' సక్సెస్ సెలబ్రేషన్స్ - లొకేషన్ కోసం మేకర్స్​ సెర్చింగ్​! - Devara Success Meet

'దేవర' ఓపెనింగ్స్​ - కళ్లు చెదిరే వసూళ్లు! - ఏకంగా ఎన్ని కోట్లంటే? - Devara First Day Collections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.