తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 27 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Fri Sep 27 2024 లేటెస్ట్‌ వార్తలు- విశాఖ స్టీల్​ప్లాంట్ సెయిల్​లో విలీనం? - శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా కేంద్రం కసరత్తు - vizag steel plant merge sail

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By Telangana Live News Desk

Published : Sep 27, 2024, 7:10 AM IST

Updated : Sep 27, 2024, 9:57 PM IST

09:54 PM, 27 Sep 2024 (IST)

విశాఖ స్టీల్​ప్లాంట్ సెయిల్​లో విలీనం? - శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా కేంద్రం కసరత్తు - vizag steel plant merge sail

Vizag Steel Plant Merge With Sail : విశాఖ స్టీల్‌ ప్లాంట్​ను సెయిల్‌లో విలీనం చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. స్టీల్‌ ప్లాంట్ మనుగడకు, మూలధనం అందించేందుకు దీనిని ఓ ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. అదే విధంగా ఎన్‌ఎండీసీకి భూమిని విక్రయించడం, బ్యాంకు రుణాల అంశాలను సైతం పరిశీలిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - VIZAG STEEL PLANT MERGE WITH SAIL

09:52 PM, 27 Sep 2024 (IST)

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుభవార్త - ఇక టూర్‌లకు ఫ్రీగా వెళ్లొచ్చు - HYDERABAD TOURISM DEVELOPMENT

Hyderabad Tourism Development : హైదరాబాద్‌లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం పలు పారిశ్రామిక సంస్థలు ముందుకొచ్చాయి. సీఎం రేవంత్‌ సమక్షంలో పర్యాటకశాఖతో ఒప్పందం చేసుకున్నాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆయా ప్రాంతాల్లోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శించేందుకు "తెలంగాణ దర్శిని" పేరుతో కార్యక్రమం చేపట్టినట్లు సీఎం రేవంత్ తెలిపారు. | Read More

ETV Bharat Live Updates - STEPWELLS RENOVATION IN HYDERABAD

09:49 PM, 27 Sep 2024 (IST)

గ్లోబల్ సిటీ హైదరాబాద్​కు పెట్టుబడులతో తరలిరండి – ఉప ముఖ్యమంత్రి భట్టి - Deputy CM Bhatti Vikramarka US Tour

Deputy CM Bhatti Vikramarka America Tour : తెలంగాణ రాష్ట్రం అమెరికన్ కంపెనీల భాగస్వామ్యాన్ని, సహకారాన్ని కోరుతోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అమెరికన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. గ్లోబల్ సిటీ హైదరాబాద్​కు పెట్టుబడులతో తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని లాస్ వెగాస్​లో జరుగుతున్న మైన్​ఎక్స్ పో 2024 అంతర్జాతీయ సదస్సులో భట్టి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ హైదారాబాద్​లో ఏఐతో నిర్వహించే పరిశ్రమలు, ఏఐ అభివృద్ధి, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు. ఈ విభాగాల్లో ఆసక్తిగల, అనుభవం ఉన్న ప్రపంచవ్యాప్త కంపెనీలకు తెలంగాణ స్వాగతం పలుకుతుందన్నారు. | Read More

ETV Bharat Live Updates - DEPUTY CM BHATTI VIKRAMARKA US TOUR

09:50 PM, 27 Sep 2024 (IST)

మూడోరోజూ ఉద్రిక్త పరిస్థితుల మధ్య మూసీ నది ప్రక్షాళన - పలు చోట్ల సర్వేకు అడ్డంకులు - Musi River Re survey Update

Musi River Survey 3rd Day : మూసీ నది ప్రక్షాళన కోసం చేపట్టిన సర్వే మూడోరోజు కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. నిర్వాసితులు సర్వే అధికారులను అడ్డుకోవడమే కాకుండా ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చిన డీసీఎం వ్యాన్లను తిప్పి పంపించారు. అడుగడుగునా అధికారులతో వాగ్వాదానికి దిగుతూ ఇళ్లు ఖాళీ చేసేదే లేదని నినాదాలు చేశారు. లంగర్‌హౌస్‌, బహదూర్‌పురాలో పెద్దసంఖ్యలో బాధితులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. న్యూ మారుతీనగర్‌లో స్థానికులు సర్వే అధికారులపై తిరగబడ్డారు. స్థానికులకు మద్దతుగా ఎంపీ ఈటల రాజేందర్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు నిర్వాసితులను రెండు పడక గదుల ఇళ్లకు తరలించేందుకు జీహెచ్​ఎంసీ 14 మంది హౌసింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. | Read More

ETV Bharat Live Updates - MUSI RIVER RE SURVEY UPDATE

07:34 PM, 27 Sep 2024 (IST)

శ్రీవారి దర్శనానికి టీటీడీ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి - సీఎం చంద్రబాబు - CBN Tweet on Tirumala Darshan

CBN Tweet on Tirumala Darshan : శ్రీవారి సన్నిధికి వెళ్లే భక్తులు టీటీడీ నిబంధనలు పాటించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించొద్దని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అన్యమతస్థుల కోసం శ్రీవారి దర్శన నిబంధనలు వివరిస్తూ తిరుమలలో టీటీడీ బోర్డులను ఏర్పాటు చేసింది. | Read More

ETV Bharat Live Updates - CM CHANDRABABU ON TTD DECLARATION

06:57 PM, 27 Sep 2024 (IST)

'మా ఇళ్లు కూల్చొద్దు' మూసీ రివర్​ బెడ్​ నిర్వాసితుల డిమాండ్ - Residents Protest At MRO Office

Residents Protest At MRO Office : తమ ఇళ్లు కూల్చవద్దంటూ కిషన్​బాగ్​, అసద్​బాబా నగర్, నందిముసలైగూడ వాసులు బహదూర్​పురా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. తమకు ప్రభుత్వం మరో చోట ఇచ్చే డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు వద్దని బాధితులు తెలిపారు. కాగా మూసీ నది రివర్​ బెడ్​లోకి అసద్​బాబా నగర్, ముసలై గూడ, కిషన్​బాగ్​ పరిధిలో దాదాపు 387 ఇళ్లు వస్తున్నాయి. | Read More

ETV Bharat Live Updates - LOCAL RESIDENTS PROTEST BAHADURPURA

05:28 PM, 27 Sep 2024 (IST)

మేడిగడ్డ డ్యామేజీకి అదే ప్రధాన కారణం - ఈఎన్సీ హరిరామ్‌ పలు కీలక విషయాల వెల్లడి - PC Ghosh Commission Inquiry

PC Ghosh Commission Inquiry : కాళేశ్వరంపై ప్రాజెక్టుపై విచారణ చేస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరామ్ హాజరయ్యారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాల గురించి హరిరామ్‌ను ప్రశ్నించారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై పలు ప్రశ్నలను అడిగారు. | Read More

ETV Bharat Live Updates - PC GHOSH COMMISSION INQUIRY HARIRAM

05:21 PM, 27 Sep 2024 (IST)

డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో చోరీ - ఖరగ్‌పూర్‌లో ఇద్దరు దొంగల అరెస్ట్‌ - Robbery In Bhatti Vikramarka House

Robbery In Deputy CM Bhatti Vikramarka House : రాష్ట్ర డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క మల్లు ఇంట్లో చోరీ జరిగింది. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో చోరీకి పాల్పడిన దుండగులు పలు వస్తువులు ఎత్తికెళ్లినట్లు తెలిసింది. ఈ చోరీ కేసులో పశ్చిమ్‌బెంగాల్‌ పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు ఖరగ్‌పూర్‌ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్‌ వెల్లడించారు. | Read More

ETV Bharat Live Updates - DEPUTY CM BHATTI HOUSE ROBBERY

05:23 PM, 27 Sep 2024 (IST)

టేస్టీగా ఉన్నాయని బయట దొరికే ఫుడ్​లు లాగించేస్తున్నారా? - అయితే ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్ - Story On Food Adulteration

Story On Food Adulteration : తిండి కలిగితే కండ కలదోయ్‌ అన్నారు మహాకవి గురజాడ అప్పారావు. అయితే, నాణ్యత ప్రమాణాలు లేని, కలుషిత ఆహారం ఎంత తీసుకున్నా తిప్పలు తప్పవు అంటున్నారు వైద్యులు. ఇది నూటికి నూరు శాతం వాస్తవమేనని తేలింది. మనిషి ఆరోగ్య సమస్యలకు మూలకారణం నాణ్యత లేని, కలుషిత ఆహారం తీసుకోవడమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు ఆరోగ్య నివేదికలు ఇదివరకే వెల్లడించాయి. కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల 10 మందిలో ఒకరు అనారోగ్యం బారిన పడుతున్నారు. 60 కోట్ల మంది మరణిస్తున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బాధితులు పెరిగి, మరణాలు అధికం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి, ఆహారం కలుషితం కాకుండా ఆపేదెలా? ఆహారం కలుషితం కావడానికి గల కారణాలు ఏంటి? కలుషిత ఆహారం తీసుకోకుండా ప్రజల్లో అవగాహన పెంచడం ఎలా? ఇప్పుడు చూద్దాం. | Read More

ETV Bharat Live Updates - STORY ON FOOD ADULTERATION

03:36 PM, 27 Sep 2024 (IST)

చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణపతకాలు - రూ.25 లక్షల నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ - Chess Olympiad Winners Met CM

Telangana Government Nazrana chess Olympiads Winner : భారతదేశం తరపున తొలిసారి స్వర్ణపతకాలు సాధించిన క్రీడాకారులు అర్జున్, ద్రోణవల్లి హారిక జూబ్లీహిల్స్​లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అర్జున్, హారికను అభినందించిన సీఎం రూ. 25 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించారు. | Read More

ETV Bharat Live Updates - GOVT NAZRANA CHESS OLYMPIAD WINNERS

03:29 PM, 27 Sep 2024 (IST)

ఏపీ మాజీ సీఎం జగన్‌ తిరుమల పర్యటన రద్దు - ys Jagan Tirumala visit Cancelled

Jagan Tirupati Tour Cancelled : ఏపీ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తిరుమల పర్యటన రద్దు అయింది. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో డిక్లరేషన్‌పై ఆయన సంతకం చేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. ఈ క్రమంలో జగన్‌ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. | Read More

ETV Bharat Live Updates - YS JAGAN VISIT TO TIRUMALA

03:17 PM, 27 Sep 2024 (IST)

దేవర మూవీ ప్రదర్శనలో ఉద్రిక్తత - టికెట్లు లేకుండానే దూసుకెళ్లిన అభిమానులు - NTR Fans Rushed Into Movie Theater

NTR Fans Rushed into movie Theater : దేవర సినిమా విడుదల సందర్భంగా కడపలోని ఓ థియేటర్ యాజమాన్యానికి, ఎన్టీఆర్ అభిమానులకు మధ్య భారీ స్థాయిలో గొడవ చెలరేగింది. అర్ధరాత్రి ఒంటిగంటకు సినిమా ప్రదర్శించగా చాలామంది ప్రేక్షకులు టికెట్లు లేకుండానే థియేటర్​లోకి దూసుకెళ్లారు. దీంతో కాసేపు సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. | Read More

ETV Bharat Live Updates - NTR FANS HULCHAL IN THEATERS

02:22 PM, 27 Sep 2024 (IST)

అవస్థల నిలయంగా ఆదిలాబాద్‌ ఐటీఐ కళాశాల - అధ్యాపకులు లేక నిలిచిపోయిన బోధన - ITI Faculty Shortage in Adilabad

Faculty Shortage in ITI College : ఒకవైపు నియోజకవర్గానికి ఐటీఐను ఏర్పాటు చేసి యువత ఉపాధికి బాటలు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతుంటే మరోవైపు బోధకుల ఖాళీలు, సౌకర్యాల లేమితో ప్రస్తుత ఐటీఐ కళాశాలలు తమ ప్రభావాన్ని కోల్పోతున్నాయి. ఇందుకు ఆదిలాబాద్‌ జిల్లా ఐటీఐ కళాశాలే నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న బోధకులంతా వేతనాలు రాక మూకుమ్మడి సెలవు పెట్టడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతోంది. | Read More

ETV Bharat Live Updates - ITI LECTURER SHORTAGE IN ADILABAD

12:34 PM, 27 Sep 2024 (IST)

ప్రకాశ్​రాజ్ అలా కామెంట్‌ చేయాల్సిన అవసరం లేదు : పవన్ కల్యాణ్ - Pawan Kalyan VS Prakash Raj

Pawan Kalyan VS Prakash Raj : నటుడు ప్రకాశ్ రాజ్​ పోస్ట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. తిరుపతి లడ్డూ వివాదంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆ విషయంలో దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో పోస్టు పెట్టానని వివరించారు. దిల్లిలో మీ స్నేహితులంటూ ఆయన ఆ విధంగా కామెంట్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. | Read More

ETV Bharat Live Updates - PAWAN KALYAN VS PRAKASH RAJ

11:52 AM, 27 Sep 2024 (IST)

శ్రీరాం సాగర్​ ప్రాజెక్టు ఎకో టూరిజంపై ముందడుగు - ఇకనైనా రూపురేఖలు మారేనా? - ECO TOURISM POLICY IN TELANAGANA

SRSP Project Tourism Development: నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై ముందడుగు పడింది. ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ ప్రాంతాన్ని ఏకో టూరిజం హబ్‌గా చేసేందుకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ నడుం బిగించింది. పర్యాటకాభివృద్ధికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆలస్యమైనా ఫారెస్ట్ డెవలప్​మెంట్​ కార్పోరేషన్ తీసుకున్న నిర్ణయంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - SRSP ECO TOURISM IN NIZAMABAD

10:46 AM, 27 Sep 2024 (IST)

'డిస్కౌంట్​' అనగానే క్లిక్​ చేస్తున్నారా? - 'బుక్' అయిపోతారు జాగ్రత్త - How to Avoid Online Shopping Frauds

Online Shopping Scam : ప్రస్తుతం పండుగ వచ్చిందంటే చాలు జనాలంతా ఒకేవైపు చూస్తారు. అదే ఆన్​లైన్​ షాపింగ్​. మార్కెట్​ రేటు కన్నా భారీ డిస్కౌంట్లకు వస్తువులు వస్తాయని కొనుగోలు చేస్తుంటారు. ఈ ఒక్క కారణాన్ని అవకాశంగా తీసుకొని సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ-మెయిల్​, మెసేజ్​ల​ ద్వారా తప్పుడు సందేశాలు పంపుతూ భారీగా దోచుకుంటున్నారు. మరి అలాంటి మోసాల నుంచి ఎలా బయటపడాలో బ్యాంక్​ బజార్​.కామ్​ చెబుతుంది. మరి ఆ టిప్స్​ ఏంటో చూద్దామా. | Read More

ETV Bharat Live Updates - AVOID ONLINE SHOPPING FRAUDS TIPS

10:46 AM, 27 Sep 2024 (IST)

జగన్‌ తిరుమల పర్యటనపై తీవ్ర ఉత్కంఠ - డిక్లరేషన్‌ కోరనున్న టీటీడీ - EX CM Jagan Tirumala Tour

EX CM Jagan Tirumala Tour: శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై పెను దుమారం రేగిన వేళ, మాజీ సీఎం జగన్‌ చేపట్టిన తిరుమల పర్యటన కాకరేపుతోంది. వెంకన్న దర్శనానికి వెళ్లేముందు జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ హిందూ ధార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు ఆందోళనబాట పట్టాయి. మరోవైపు జగన్‌ నుంచి డిక్లరేషన్‌ తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. సంతకం చేసిన తర్వాతే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని తేల్చి చెబుతున్నారు. | Read More

ETV Bharat Live Updates - EX CM JAGAN TIRUMALA TOUR

10:40 AM, 27 Sep 2024 (IST)

మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు - కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ - ED Raids on Minister Ponguleti

ED Raids at Minister Ponguleti Residence : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఆయన నివాసంతో పాటు కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - ED SEARCHES MINISTER PONGULETI

10:31 AM, 27 Sep 2024 (IST)

పండక్కి ఊరెళ్తున్నారా? - హైదరాబాద్​ టూ తిరుపతికి స్పెషల్‌ ట్రైన్స్‌ - డీటెయిల్స్​ ఇవే - Special Trains To Tirupati

Special Trains To Tirupati in October : అక్టోబర్‌లో దసరా, దీపావళి పండుగలు ఉన్న కారణంగా సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలానే నిర్మాణ పనుల కారణంగా వచ్చే నెలంతా పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. | Read More

ETV Bharat Live Updates - SPECIAL TRAINS TO TIRUPATI

10:28 AM, 27 Sep 2024 (IST)

స్కూల్​కు వెళ్లనని చిన్నారి మారాం - అసలు విషయం తెలుసుకొని తల్లి షాక్​! - Teacher Misbehaviour with Girl

Teacher Misbehaved With Girl in Krishna District : విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువే కీచకుడిలా మారాడు. ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనతో స్కూల్​కు వెళ్లనంటూ చిన్నారి మారాం చేసింది. దీంతో చిన్నారిని తల్లి ప్రశ్నించడంతో అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. | Read More

ETV Bharat Live Updates - TEACHER SEXUAL HARASSMENT CASE

10:02 AM, 27 Sep 2024 (IST)

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో రాజులు ఏలిన 'ప్రకృతి సోయగాలు' - ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత - Karimnagar Historic Places

Karimnagar Historic places : ఏదైనా పర్యాటక ప్రదేశానికి వెళ్లినప్పుడు చారిత్రాక కట్టడాలు ఉన్నాయా? వాటి ప్రత్యేతక ఏంటి? అని తెలుసుకుంటుంటాం కదా. ఈ స్టోరీలో కరీంనగర్‌లోని కట్టడాలు, పురాతన దేవాలయాలు, జలపాతాల గురించి తెలుసుకుందాం. | Read More

ETV Bharat Live Updates - KARIMNAGAR HISTORIC PLACES

09:41 AM, 27 Sep 2024 (IST)

నవంబరు నుంచి భూముల ధరల సవరణ - అమల్లోకి తీసుకురానున్న రాష్ట్ర ప్రభుత్వం - Revision of Land Prices

Land Prices Revision in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నవంబరు నుంచి భూముల కొత్త మార్కెట్‌ విలువను అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు అధ్యయనం చేసిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ, మార్కెట్‌ విలువను సవరించే ప్రక్రియను పూర్తిచేసింది. కొత్త రెవెన్యూ చట్టాన్ని కూడా అక్టోబరులో అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. | Read More

ETV Bharat Live Updates - REVISION OF LAND PRICES IN TG

09:02 AM, 27 Sep 2024 (IST)

భక్తులకు 'దారి' చూపిస్తున్న మల్లన్న - హైదరాబాద్​ - శ్రీశైలం మధ్య 55 కి.మీ. భారీ ఫ్లై ఓవర్! - Elevated Corridor Srisailam Highway

Elevated Corridor Srisailam Highway : హైదరాబాద్​ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు, ప్రకృతి ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్ చెప్పనుంది. నల్లమల అడవుల గుండా 55 కిలోమీటర్ల భారీ ఫ్లైఓవర్​కు ప్రణాళికలు రచిస్తోంది. ఈ వంతెన పూర్తి అయితే రాష్ట్రంలోనే అతిపెద్ద వంతెనగా రికార్డు సృష్టించనుంది. ఈ కారిడార్​ పూర్తి అయితే ప్రకృతి అందాలను చూసుకుంటూ నల్లమల అడవి గుండా హాయిగా మల్లన్న దర్శనానికి వెళ్లొచ్చు. | Read More

ETV Bharat Live Updates - HYDERABAD AND SRISAILAM FLYOVER

07:32 AM, 27 Sep 2024 (IST)

డ్రైవర్‌ పథకం వేస్తే - స్నేహితులు కొట్టేశారు - పోయింది రూ.15 లక్షలు - దొరికింది రూ.2 కోట్లు! - Rs 2crore Theft In Medak

Driver Looted Rs.2 Crore in Owner House : యజమాని దగ్గర భారీగా డబ్బుందని తెలుసుకున్న డ్రైవర్, తన స్నేహితులతో కలిసి ప్లాన్‌ వేశాడు. యజమాని ఇంట్లో లేని సమయంలో చోరీకి పాల్పడ్డాడు. యజమాని రూ.15 లక్షలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేస్తే, నిందితుల దగ్గర మాత్రం రూ.2.02 కోట్లు పట్టుబడటం గమనార్హం. | Read More

ETV Bharat Live Updates - RS 2CRORE THEFT IN MEDAK

07:04 AM, 27 Sep 2024 (IST)

మీ అకౌంట్​లో డబ్బు జమ అయినట్లు మెసెజ్​ వచ్చిందా? - అది డమ్మీ కావొచ్చు, బ్యాలెన్స్ చెక్​ చేసుకోండి - Dummy Messages Cyber Crime in hyd

Cyber Crimes in Hyderabad : జనం డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో ముందుకొస్తున్నారు. బ్యాంకుల తరహాలో డబ్బు జమ చేసినట్లు డమ్మీ సందేశాలు పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని, తమ బ్యాంకు ఖాతా లేదా ఫోన్‌ పని చేయడం లేదని, డబ్బు పంపాలంటూ నిండా ముంచుతున్నారు. నమ్మకం కుదరకపోతే ఇంకో మిత్రుడి ఖాతా నుంచి డబ్బు బదిలీ చేస్తున్నామంటూ అచ్చం బ్యాంకుల తరహాలోనే సందేశాలతో ఏమార్చుతున్నారు. | Read More

ETV Bharat Live Updates - DUMMY MESSAGES CYBER CRIMES

06:56 AM, 27 Sep 2024 (IST)

నేడు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఆదినారాయణ అంతిమ సంస్కారాలు - ETV Bureau Chief Last Rites

ETV Bureau Chief Adinarayana Last Rites : గురువారం హఠాన్మరణం చెందిన సీనియర్ పాత్రికేయులు, ఈటీవీ హైదరాబాద్‌ బ్యూరో చీఫ్‌ టీ.ఆదినారాయణ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఉదయం పదిన్నర గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఆదినారాయణ కుటుంబ సభ్యుల్ని, తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెప్పారు. | Read More

ETV Bharat Live Updates - ETV BUREAU CHIEF LAST RITES
Last Updated : Sep 27, 2024, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details