ETV Bharat / entertainment

'డూప్​లు లేవు, డూప్లికేట్​లు లేవు - గుర్రం ఎక్కింది, నడిపింది బాలయ్యనే' - BALAKRISHNA NBK 109 TITLE TEASER

'డాకు మాహరాజ్'​ టైటిల్ టీజర్​ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన దర్శకుడు బాబీ!

Balakrishna NBK 109 Title Teaser
Balakrishna NBK 109 Title Teaser (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2024, 5:36 PM IST

Balakrishna NBK 109 Title Teaser : నందమూరి నటసింహం బాలకృష్ణ డాకు మహారాజ్‌గా అలరించేందుకు సిద్ధమయ్యారు. డైరెక్టర్​ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్​. ఈ కార్యక్రమానికి తమన్, దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ హాజరై సందడి చేశారు.

టీజర్​లో బాలయ్య ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ మహారాజుది, కండ్రగొడ్డలి పట్టిన యమధర్మ రాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ బాలయ్యను ఎలివేట్​ చేసి తీరు, ఆయన గుర్రపు స్వారీ చేస్తూ బందిపోటు లుక్​లో కనిపించిన తీరు హైలైట్​గా నిలిచింది.

అయితే ఈ టైటిల్ టీజర్ లాంఛ్​ ఈవెంట్​ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ ప్రచార చిత్రంలో బాలయ్య చేసిన గుర్రపు స్వారీ గురించి మాట్లాడారు. బాలయ్య ఎలాంటి డూప్​ లేకుండా స్టంట్స్​ చేసినట్లు వివరించారు. " ఎలా ఉంది, రీసౌండ్ ఉందా? కండ్రగొడ్డలి పట్టిన యమధర్మ రాజు ఎట్లున్నాడు. టీజర్‌లో చూపించిన దాంట్లో డూప్​లు లేవు, డూప్లికేట్​లు లేవు. గుర్రం ఎక్కింది ఆయనే, నడిపింది ఆయనే. యుద్ధానికి వచ్చేది కూడా ఆయనే. అన్నీ ఒరిజినల్‌ షాట్స్​. మీరు చాలా కాలం నుంచి సహనంగా ఉన్నందుకు థ్యాంక్స్​. ఎప్పుడూ చూడని బాలయ్యను చూపిస్తున్నాం. ఆయనకు కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో, అందరినీ దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇది పక్కా మాస్‌ సినిమా ఇది. సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. తమన్‌ అదిరే సంగీతం అందించారు. ఈ మ్యూజిక్‌ చూసినప్పుడు, స్పీకర్స్‌ ఓనర్స్‌ నా మీద, తమన్‌ మీద కేసు వేస్తారేమో అనిపించింది. అందరి కన్నా ముఖ్యంగా బాలకృష్ణ గారికి ప్రత్యేక థ్యాంక్స్‌. యుద్ధం ఎలా ఉంటుందో థియేటర్లో చూస్తారు" అని దర్శకుడు బాబీ చెప్పుకొచ్చారు.

డాకు అంటే అర్థమిదే - డాకు మహరాజ్​ అనే టైటిల్​ను అనౌన్స్​ చేశాక చాలా మంది డాకు అంటే అర్థం ఏమిటా అని వెతుకుతున్నారు. డాకు అనేది హిందీ పదం. డాకు అంటే బందిపోటు, దొంగ అని అర్థం. అందుకు తగ్గట్టే సినిమాలో బాలయ్య ప్రచార చిత్రంలో బందిపోటు గెటప్​లో కనిపించారు!

కాగా, భగవంత్‌ కేసరి సినిమా తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న చిత్రమిది. బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపిస్తారని టాక్​ వినిపిస్తోంది. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్‌, చాందినీ చౌదరీ, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్ యాక్టర్​ బాబీ దేవోల్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక అగ్ర నటుడు కూడా ఇందులో నటిస్తున్నారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.

NBK 109 టైటిల్ రివీల్ - 'డాకు మహారాజ్'గా బాలయ్య!

'కంగువా' డైరెక్టర్​ శివ నెక్ట్స్​ సినిమా - ఆ స్టార్​ హీరోతోనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.