తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 20 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Fri Sep 20 2024 లేటెస్ట్‌ వార్తలు- రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ - అక్టోబరు 2 నుంచే దరఖాస్తుల స్వీకరణ - New Ration Cards issue oct 2nd

By Telangana Live News Desk

Published : 4 hours ago

Updated : 6 minutes ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

11:07 AM, 20 Sep 2024 (IST)

రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ - అక్టోబరు 2 నుంచే దరఖాస్తుల స్వీకరణ - New Ration Cards issue oct 2nd

New Ration Cards in Telangana : కొత్త రేషన్​ కార్డుల కోసం ఎదురు చూసే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అక్టోబరు 2వ తేదీ నుంచి నూతన రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. రేష‌న్​కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల‌పై సచివాలయంలో సీఎం రేవంత్​రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. | Read More

ETV Bharat Live Updates - NEW RATION CARDS IN TELANGANA

10:41 AM, 20 Sep 2024 (IST)

డేటింగ్ పేరుతో చీటింగ్- అందమైన యువతుల ఫోటోలతో అమెరికన్‌ యువకులకు ఎర - HYD Police Arrest Online Fraudster

HYD Police Arrest Online Fraudster : పగలంతా నిద్ర, ఇక చీకటిపడితే చాలు రంగంలోకి దిగుతాడు. ఇదేదో ఉద్యోగానికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా అయితే పోరపాటే. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి ఆన్‌లైన్‌లో అమ్మాయిలా మాట్లాడుతూ, అమెరికా యువకుల్ని మోసం చేస్తున్న బెంగుళూరుకి చెందిన ఘరానా కేటుగాడిని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. | Read More

ETV Bharat Live Updates - HYD POLICE ARREST BANGALORE MAN

09:11 AM, 20 Sep 2024 (IST)

హైదరాబాద్‌లో మరో జూపార్క్- రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక - Zoo Park in Fourth City

Zoo Park in Fourth City : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నగరం అవతల ముచ్చర్ల ప్రాంతంలో రాబోయే ‘ఫోర్త్‌ సిటీ’లో జూపార్కు ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఫోర్త్‌ సిటీలో అధికంగా 15 వేల ఎకరాలకు పైగా రెవెన్యూ భూమి ఉండటంతో అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూపార్కుతో పాటు నైట్‌ సఫారీ వంటివి సైతం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. | Read More

ETV Bharat Live Updates - TG GOVT ON ZOO PARK IN FOURTH CITY

08:42 AM, 20 Sep 2024 (IST)

బంధాలు నేర్పే బడి వచ్చేసింది - ఇక ఆన్​లైన్​ విధానంలోనూ షురూ - Family and Marriage Counseling

Family and Marriage Counselling Course : ఈ మధ్యకాలంలో ఉద్యోగాల కారణంగా తమ వ్యక్తిగత జీవితాన్ని చాలామంది ఆస్వాదించలేకపోతున్నారు. ఇవి కుటుంబ బంధాలపై మరింత ప్రభావం చూపుతున్నాయి. దీంతో కౌన్సిలింగ్ బాట పడుతున్నారు. అలా ఫ్యామిలీ, మ్యారేజీ కౌన్సిలింగ్​ కోర్సులకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ కోర్సును ప్రస్తుతం తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో బోధిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates - FAMILY AND MARRIAGE COUNSELING

08:14 AM, 20 Sep 2024 (IST)

కాళేశ్వరంపై చేసిన​ తీర్మానాలు ఇవ్వండి - రాష్ట్ర సర్కార్​ను కోరిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ - PC GHOSH COMMISSION INQUIRY UPDATE

Kaleshwaram Project investigation Expedited : కాళేశ్వరం ప్రాజెక్ట్​పై న్యాయ విచారణను జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ వేగవంతం చేసింది. కాళేశ్వరంపై నాటి మంత్రివర్గ నిర్ణయాలు, తీర్మానాలు ఇవ్వాలని జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ రాష్ట్ర సర్కార్​ను కోరింది. ఈ క్రమంలోనే ఇవాళ రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ, ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబరెటరీస్ ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. నేటి నుంచి తదుపరి విచారణ ప్రారంభిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ దఫా మరో 25 మంది వరకు ఇంజనీర్లను ప్రశ్నించనుంది. | Read More

ETV Bharat Live Updates - KALESHWARAM PROJECT INVESTIGATION

07:20 AM, 20 Sep 2024 (IST)

నత్తనడకన సాగుతున్న భూమి క్రమబద్ధీకరణ ప్రక్రియ - గడువులోగా పూర్తికావడం కష్టమే! - Telangana Govt Delay In LRS Work

Delay In LRS Work : రాష్ట్రంలో భూమి క్రమబద్ధీకరణ పథకం - ఎల్​ఆర్ఎస్ అమలు అనుకున్నంత వేగంగా పుంజుకోవడం లేదు. 25,70,000 దరఖాస్తులను మూడు నెలల్లో పరిష్కరించాలని ప్రభుత్వం గడవు నిర్దేశించుకుంది. ప్రస్తుత పురోగతి చూస్తుంటే ఆ లోపు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు 60 వేల అనధికారిక ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటి విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై అధ్యయనం చేస్తోంది. | Read More

ETV Bharat Live Updates - TELANGANA GOVT DELAY IN LRS WORK

06:55 AM, 20 Sep 2024 (IST)

నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ- అజెండాలోని కీలక అంశాలివే! - Telangana Cabinet Meet Today

Telangana Cabinet Meet : రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం ఈ సాయంత్రం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో హైడ్రా బలోపేతం సహా ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునే విషయమై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. | Read More

ETV Bharat Live Updates - TG CABINET MEET IN SECRETARIAT
Last Updated : 6 minutes ago

ABOUT THE AUTHOR

...view details