High Court on Sewage Cultivated Vegetables cultivation :హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువుల మురుగునీటితో కూరగాయల సాగును అడ్డుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మురుగునీటితో సాగైన కూరగాయలు, ఆకుకూరలు ప్రజల ఆరోగ్యంపైప్రభావం చూపుతాయని, అందువల్ల అవి మార్కెట్లోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 చెరువుల దుస్థితిపై అడ్వొకేట్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని సూచనల అమలుపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కార్యాచరణ నివేదికను ఫొటోలతో సహా సమర్పించాలని ఆదేశించింది.
High Court on PIL :నగరంలోని చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోవడంపై 2007లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాఖ్యపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాసనం ఏర్పాటు చేసిన అడ్వకేట్ కమిషన్ మహానగరంలోని పలు చెరువుల దుస్థితిపై ఫోటోలతో సహా నివేదిక సమర్పించి పలు సూచనలు చేసింది. చాలా చెరువులు అక్రమణలకు గురయ్యాయని చెత్తాచెదారం, మురుగునీటితో దుర్గందభరితంగా తయారయ్యాయని అడ్వోకేట్ కమిషన్ పేర్కొంది. ఈ చెరువుల్లోని మురుగునీటితో పండించిన ఆరు కూరలు, కూరగాయలతోపాటు చేపలను వినియోగిస్తున్న ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం చూపిస్తోందని తెలిపింది.
దుర్గం చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలి : హైకోర్టు