తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రూప్‌-1పై ప్రభుత్వం కసరత్తు - అదనపు ఖాళీల వివరాలపై ఆరా - Telangana Group1 Notification 2024

Telangana Group1 Notification 2024 : తెలంగాణలో గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా గతంలో జారీ చేసిన 503 పోస్టులకు అదనంగా ఉన్న ఖాళీల వివరాలను ఇవ్వాలని విభాగాలను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు ఖాళీల వివరాలను గుర్తించి ప్రభుత్వానికి పంపిస్తున్నారు.

tspsc
tspsc

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2024, 1:24 PM IST

Telangana Group1 Notification 2024 :రాష్ట్రంలో గ్రూప్‌-1 కేటగిరీ (Telangana Group-1 ) ఉద్యోగాల భర్తీపై కసరత్తు ప్రారంభమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుగా కాంగ్రెస్‌ సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా విభాగాల వారీగా అదనపు ఖాళీల గుర్తింపు ప్రక్రియను చేపట్టింది. 2022 జీవో నం.26 కింద గతంలోనే గుర్తించిన 503 గ్రూప్‌-1 ఉద్యోగాలకు అదనంగా ఖాళీల వివరాలు వెంటనే పంపించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చింది.

ప్రభుత్వ విభాగాలు గత రెండు సంవత్సరాలుగా అదనంగా ఏర్పడిన ఖాళీలు, మరో ఏడాదిలో పదవీ విరమణతో ఏర్పడే ఖాళీలు గుర్తించి నివేదికను రాష్ట్ర సర్కార్‌కు పంపిస్తున్నాయి. మరికొన్ని విభాగాల్లో ఖాళీలను గుర్తించేందుకు రెండు రోజుల సమయం కావాలని విజ్ఞప్తి చేశాయి. తద్వారా అదనంగా వచ్చే గ్రూప్‌-1 ఉద్యోగాల సంఖ్యపై వీలైనంత త్వరలో స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు వెల్లడించాయి.

జనవరిలో గ్రూప్-2 పరీక్షలు జరుగుతాయా? - టీఎస్‌పీఎస్సీ నిర్ణయం కోసం ఉద్యోగార్థుల ఎదురుచూపులు

రద్దు చేయాలా? వేచి చూడాలా? :మరోవైపు ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీ కోసం గత సంవత్సరం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షపై సమాలోచనలు జరుపుతున్నారు. రెండోసారి నిర్వహించిన పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, రద్దుచేసి మళ్లీ నిర్వహించాలంటూ ఇప్పటికే హైకోర్టు టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై కమిషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అది విచారణకు వచ్చి తుది తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందోనని పరీక్ష రాసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Telangana Group 1 Exam Update :ఈ క్రమంలోనే గ్రూప్‌-1 పరీక్షపై ఎలా ముందుకు వెళ్లాలని కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు, ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష రద్దుచేసి ముందుకు వెళ్లాలా? లేదా తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలా? కొత్తగా గుర్తించే ఖాళీలతో తాజాగా మరో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వేయడమా? లేదా పాత నోటిఫికేషన్‌కు అనుబంధంగా చేర్చడమా? అనే విషయమై నిర్ణయం వెలువడాల్సి ఉంది.

Revanthreddy on TSPSC Board : టీఎస్​పీఎస్సీ బోర్డు.. రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది : రేవంత్​రెడ్డి

TS Govt on Group-1 Notification : 2011లో ఇచ్చిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై న్యాయవివాదాలు తలెత్తడంతో తీవ్ర జాప్యం జరిగింది. ఆ నియామకాలు 2018లో పూర్తయ్యాయి. తాజాగా వివిధ విభాగాల్లోని అదనపు ఖాళీలు గుర్తించిన తర్వాత సర్కార్ నుంచి వచ్చే ప్రతిపాదనల వివరాలను టీఎస్‌పీఎస్సీ (TSPSC) రోస్టర్‌ పాయింట్లు, సర్వీసు నిబంధనలు, విద్యార్హతలు రిజర్వేషన్లు అన్నీ పరిశీలించిన తర్వాతే నోటిఫికేషన్‌ ఇచ్చే విషయమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు గ్రూప్‌-1 నుంచి కిందిస్థాయి వరకు కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే ఆయా ఖాళీల భర్తీకి ఎంత సమయం పడుతుంది? ప్రస్తుతం జారీ చేసిన వాటి నియామక ప్రక్రియ ఎంత వరకు వచ్చిందన్న విషయమై ఇప్పటికే నియామక సంస్థల నుంచి తెలంగాణ ప్రభుత్వం వివరాలు తీసుకుంది.

గ్రూప్‌-1 ప్రకటనపై కొత్త ప్రభుత్వం నిర్ణయమే కీలకం - మరీ చిక్కుముడి వీడేదెలా?

TSPSC Aspirants Confusion : గ్రూప్-1 చదవాలా.. గ్రూప్-2కు ప్రిపేర్ అవ్వాలా.. అయోమయంలో అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details