Orchard Development in Telangana :ఇటీవల కాలంలో రాష్ట్రంలో డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ, బత్తాయి, జామ వంటి వివిధ రకాల పండ్లకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. మన దగ్గర పండ్ల తోటల సాగు తక్కువగా ఉండడంతో మామిడికాయలను తప్ప.. మిగతా అన్ని పండ్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో మార్కెట్లో అన్ని రకాల పండ్ల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పండ్ల తోటల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. పండ్ల తోటల సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు ప్రోత్సహం కల్పించేందుకు సన్నహాలు చేస్తోంది. అయితే, పండ్ల సాగు కోసం అర్హులైన రైతులు ఎవరు ? ఎన్ని రకాల పండ్లకు ప్రోత్సాహం అందిస్తారు ? ఈ పథకం ఎప్పటి నుంచి అమలులోకి రానుంది ? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఇతర పంటలతో పోలిస్తే పండ్ల తోటల సాగు కొంత లాభాసాటిగా ఉంటుంది. అలాగే వీటికి మార్కెట్లో కూడా డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. అయితే, తెలంగాణ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (నరేగా) అనుసంధానం చేసి వివిధ రకాల పండ్ల తోటల విస్తీర్ణం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీనిద్వారా ప్రతి మండలానికి 50 ఎకరాల్లో పండ్లతోటల సాగును ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎవరు అర్హులు ?
పండ్ల తోటల సాగులో భాగంగా రాష్ట్రంలో ఐదెకరాలలోపు సాగుభూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులకు రాయితీ కల్పించి పండ్లతోటలను ప్రోత్సహించాలని ఆలోచిస్తున్నారు. అలాగే రైతులకు ఉపాధి జాబ్ కార్డు కూడా ఉండాలి. వ్యవసాయ, ఉద్యాన (హార్టికల్చర్), నరేగా శాఖ సమన్వయంతో రైతులను ఎంపిక చేస్తారు.
సబ్సిడీ అందించే పండ్ల తోటలు ఇవే!