Telangana Govt changed Tenth Class Marks System : పదో తరగతిలో గ్రేడ్ పద్ధతిని తొలగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి గ్రేడింగ్ పద్ధతికి బదులుగా ఫలితాలు మార్కుల రూపంలో ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. ఇక ఇంటర్నల్ మార్క్‌ల విధానాన్ని సైతం తొలగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో పదో తరగతి విద్యార్థులకు 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించే వారు. ఇకపై ఈ ఉద్ధతికి స్వస్తి పలుకుతూ 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది.
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో భారీ మార్పులు - 10TH CLASS MARKS SYSTEM CHANGED
పదో తరగతి మార్కుల విధానంలో మార్పులు - ఇకపై 100 మార్కులకు ఎగ్జామ్స్ - ఇంటర్నల్ మార్కుల విధానం పూర్తిగా రద్దు
Telangana Govt changed Tenth Class Marks System (ETGV Bharat)
Published : Nov 28, 2024, 7:47 PM IST
|Updated : Nov 28, 2024, 9:25 PM IST
దీంతో పాటు ఆన్సర్ షీట్లోనూ మార్పులు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. 24 పేజీల బుక్ లెట్‌ను విద్యార్థులకు అందించనునట్టు పేర్కొంది. ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టులకు 12 పేజీల బుక్ లెట్స్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు విద్యార్థులకు సమాచారం ఇవ్వాలని జిల్లా విద్యా శాఖ అధికారులు, ప్రిన్సిపళ్లను ఆదేశించింది.
పదో తరగతి పరీక్ష ఫీజు తేదీలు వచ్చేశాయ్ - ఆ రోజే లాస్ట్ డేట్
Last Updated : Nov 28, 2024, 9:25 PM IST