తెలంగాణ

telangana

ETV Bharat / state

సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం - తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం - Praja Palana Day

September 17th Telangana Praja Palana Day : ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనుండగా, మిగిలిన జిల్లాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే వారి వివరాలను పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థల్లోనూ మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని పేర్కొన్నారు.

September 17th Telangana Praja Palana Day
September 17th Telangana Praja Palana Day (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 7:06 AM IST

September 17th Telangana Praja Palana Day :సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవంగా ఉత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ పతాకావిష్కరణ చేయాలని ఆదేశించింది. జాతీయ పతాకావిష్కరణకు జిల్లాల వారీగా ఇంఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు, సలహాదారులను, ప్రభుత్వ విప్‌లను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను జిల్లాల ఇంఛార్జీలుగా నియమించింది.

జిల్లాల వారిగా ఇంఛార్జీలు :ఆదిలాబాద్‌ - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, భద్రాద్రి కొత్తగూడెం - మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హనుమకొండ - దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జగిత్యాల - ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌ కుమార్‌, జయశంకర్‌ భూపాలపల్లి - అటవీ అభివృద్ది కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పొదెం వీరయ్య, జనగామ - ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, జోగులాంబ గద్వాల్‌ - ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు జితేందర్‌ రెడ్డి, కామారెడ్డి - పర్యాటక అభివృద్ది కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పటేల్‌ రమేశ్​ రెడ్డి, కరీంనగర్‌ - ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబులను ఇంఛార్జీలుగా నియమించింది.

అతిపెద్ద కంట్రోల్​ రూమ్ ఏర్పాటుకు 'హైడ్రా' సన్నాహాలు - ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకే - Hydra with NRSC for Maps

ఖమ్మం - ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆసిఫాబాద్‌ - మండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్​, మహబూబాబాద్‌ - ప్రభుత్వ విప్‌ రామచంద్రనాయక్‌, మహబూబ్​నగర్‌ - ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంచిర్యాల - ప్రభుత్వ సలహాదారు హర్కర్‌ వేణుగోపాల్‌, మెదక్‌ - ప్రభుత్వ సలహాదారు కేశవరావు, మేడ్చల్‌ - ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, ములుగు - స్త్రీ శిశు శాఖ మంత్రి సీతక్క, నాగర్‌కర్నూల్‌ - ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, నల్గొండ - ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నారాయణపేట్‌ - పోలీస్ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గురునాథ్‌ రెడ్డి ఉత్సవాల రోజున జెండా ఎగుర వేసేందుకు నిర్ణయించారు.

నిర్మల్‌ - ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య, నిజామాబాద్‌ - మినరల్‌ డెవ్‌లప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఇరావత్రి అనిల్, పెద్దపల్లి - మహిళా కమిషన్‌ ఛైర్​పర్సన్‌ నేరెళ్ల శారద, రాజన్న సిరిసిల్ల - ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, రంగారెడ్డి - సీఎం సలహాదారు వేం నరేందర్​ రెడ్డి, సంగారెడ్డి - మంత్రి దామోదర రాజనర్సింహ, సిద్దిపేట - బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, సూర్యాపేట - మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, వికారాబాద్‌ - స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, వనపర్తి - ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ప్రీతమ్‌, వరంగల్‌ - మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, యాదాద్రి భువనగిరి - మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డిలను జాతీయ పతాకావిష్కరణ చేసేందుకు నియమించారు. సెప్టెంబర్​ 17న ఉదయం 10 గంటలకు అన్నిచోట్ల జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తారు. జిల్లా కలెక్టర్లు ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.

కోచింగ్​ సెంటర్లను కంట్రోల్​లో పెడతాం : మంత్రి శ్రీధర్​బాబు - Sridhar Babu On Coaching Institutes

వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన - విపత్తు నష్టంపై ఆరా - Central Team Visit telangana

ABOUT THE AUTHOR

...view details