Telangana Government Banned Hookah Centers : తెలంగాణలో డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మాదకద్రవ్యాల నిరోధక విభాగం-టీఎస్‌న్యాబ్‌కు పూర్తిస్థాయి సంచాలకుడిని నియమించారు. దీంతో పోలీసుశాఖ మత్తు పదార్థాల కట్టడిపై కార్యాచరణను ప్రారంభించింది. ఇందులో భాగంగా పబ్లు, బార్లు, హుక్కా కేంద్రాలపై ఫోకస్ పెట్టింది.
Hookah Centers Ban in Telangana : ఈ క్రమంలోనే హైదరాబాద్లోని హుక్కా పార్లర్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలతో పాటు పొగాకు ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కేసుల్లో (Drugs Cases in Telangana) పట్టుబడే యువకుల్లో ఎక్కువ మంది హుక్కా కేంద్రాలకు వెళ్లేవారు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే హుక్కా పార్లర్లపై నిషేధం విధించాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలో వాటిపై నిషేధం విధిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
అల్ఫాజోలం కొకైన్ కంటే ప్రమాదకరం - అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు : సందీప్ శాండిల్య
హైదరాబాద్‌లో ఎక్కువగా హుక్కా కేంద్రాలు :రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఎక్కువగా హుక్కా కేంద్రాలు నడుస్తున్నాయి. దాదాపు 500 లకు పైనే నడుస్తున్నాయని పోలీసు అధికారులు అంచనా వేశారు. ఇవికాకుండా పబ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఇళ్లల్లో గుట్టుగా కొనసాగేవి భారీగానే ఉన్నట్లు గుర్తించారు. ఈ కేంద్రాల్లో మద్యం పొగాకు ఉత్పత్తులతో పాటు వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసుల తనిఖీలతో తరచూ వెల్లడవుతోంది.