No Electricity Bill Payments on UPI Apps :ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఈనెల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ - టీజీఎస్‌పీడీసీఎల్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఈ విషయం తెలిపింది. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు జులై 1 నుంచి ఆయా సంస్థలు విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేసినట్లు వెల్లడించింది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల మాదిరిగానే ఆయా యాప్స్ విద్యుత్తు బిల్లుల చెల్లింపు సేవలు నిలిపేసినట్లు పేర్కొంది. డిస్కం వెబ్‌సైట్ లేదా టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్‌లో కరెంటు బిల్లులు చెల్లించాలని టీడీఎస్‌పీడీసీఎల్ వినియోగదారులకు సూచించింది.
Electricity Bill Payments On TGSPDCL App : తెలుగు రాష్ట్రాల్లోని అన్ని డిస్కమ్‌లకు ఆర్బీఐ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. బిల్లుల చెల్లింపుల్లో సమర్థత, భద్రతకు పెద్దపీట వేసే చర్యల్లో భాగంగా బిల్లు చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది. అయితే ఇది కేవలం దక్షిణ తెలంగాణ జిల్లాలకు మాత్రమే అని తెలిపింది. ఉత్తర తెలంగాణకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని నిర్దేశించి దానికి సంబంధించి జులై 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు తీసువచ్చింది. ఇందులో భాగంగా భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్‌ను బిల్లర్లు యాక్టివేట్ చేసుకోవాలని తెలిపింది.
గతంతో పోల్చుకుంటే వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా : దక్షిణ డిస్కం - TGSPDCL Power Monitoring