ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించిన తెలంగాణ భక్తులు - మేళతాళాలు, నృత్యాలతో భారీ ఊరేగింపు - Bangaru BONAM TO DURGAMMA

Devotees Bangaru Bonam to Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మకు ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు బోనాలు, సారె సమర్పిస్తున్నారు. తెలంగాణకు చెందిన భాగ్యనగర్ మహంకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించారు. మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలతో భారీ ఊరేగింపుగా వెళ్లి దుర్గమ్మకు బోనం ఇచ్చారు.

Devotees Bangaru Bonam to Kanaka Durga Temple
Devotees Bangaru Bonam to Kanaka Durga Temple (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 4:53 PM IST

Telangana Devotees Bangaru Bonam to Kanaka Durga Temple on Bejawada:విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది. ఆషాఢ మాసం సందర్భంగా దుర్గమ్మకు భక్తులు బోనాలు, సారె సమర్పిస్తున్నారు. తెలంగాణకు చెందిన భాగ్యనగర్ మహంకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. ముందుగా విజయవాడ బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి చేరుకొని తెలంగాణ నుంచి వచ్చిన భక్తులు దేవతామూర్తులకు పూజలు నిర్వహించారు. అనంతరం నైవేద్యంతో బంగారు బోనం సిద్దం చేశారు. దుర్గమ్మకు పట్టు వస్త్రాలు తీసుకుని బంగారు బోనాన్ని శిరస్సుపై ధరించి జోగిని నిషా క్రాంతి నృత్యం చేశారు. తర్వాత జోగిని నిషా క్రాంతి బంగారు బోనం ఎత్తుకుని సామూహిక ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి బయల్దేరారు.

ఆదివారం నుంచే బోనాల సందడి- ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? - Bonalu 2024

భారీ ఊరేగింపుతో దుర్గమ్మకు బోనం సమర్పణ: మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలతో భారీ ఊరేగింపుతో ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గమ్మకు బోనం సమర్పించారు. అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడిబియ్యంతో పాటు కృష్ణమ్మ తల్లికి పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, గంగతెప్పను సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో భాగ్యనగర్‌ కమిటీ ఆధ్వర్యంలో బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనంతోపాటు సారె సమర్పించడం ఆనవాయితీ. 14 సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని నిర్వహిస్తున్నారు. బోనం సమర్పణ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రజలందరూ ఆయురోగ్యాలతో ఉండాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

శివమెత్తిన భాగ్యనగరం - గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం - GOLCONDA BONALU 2024

జులై 7 నుంచి తెలంగాణలో బోనాల సందడి మొదలైెంది. ఈ బోనాల ఉత్సవాలు ఆగస్టు 4 వరకు బోనాల కొనసాగనున్నాయి. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో భాగ్యనగరంలో మారుమోగుతోంది. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం సరికొత్త శోభను సంతరించుకుంది. ఆషాఢమాసంలో వచ్చే తొలి గురు లేదా ఆదివారాల్లో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి తెలంగాణ ప్రభుత్వం బోనాల జాతరను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు సైతం బోనాల పండగను జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా నిర్వహిస్తామో అలాగే స్వదేశంలో కూడా సంప్రదాయబద్ధంగా బోనాలకు పూజలు నిర్వహించారు. తొట్టెల ఊరేగింపు, పోతురాజు ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
లండన్​లో ఘనంగా బోనాల వేడుకలు - హాజరైన ప్రవాస భారతీయ కుటుంబాలు - Bonalu Celebrations In London

ABOUT THE AUTHOR

...view details