ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇది జీవితంలో ఓ మధురమైన ఘట్టం - కొండంత బలాన్నిచ్చింది: లోకేశ్ - Nara Lokesh on Nomination

Nara Lokesh on Nomination: తన నామినేషన్ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలే ముందుండి నడిపించడం జీవితంలో ఓ మధుర ఘట్టమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. వేల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం కొండంత బలాన్నిచ్చిందన్నారు. మంగళగిరిని నంబర్‌ వన్‌గా మార్చాలన్న తన సంకల్పానికి ఇదే స్పూర్తితో వచ్చే ఎన్నికల్లో సంఘీభావం తెలియజేయాలని కోరారు.

TDP Lokesh on Nomination
TDP Lokesh on Nomination

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 4:43 PM IST

Nara Lokesh on Nomination: మంగళగిరిలో తన నామినేషన్ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలే సారథులై ముందుండి నడిపించడం జీవితంలో ఓ మధురమైన ఘట్టమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మండుటెండలో సైతం వేలసంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం తనకు కొండంత బలాన్నిచ్చిందన్నారు.

ఈ కార్యక్రమానికి సారథ్యం వహించిన టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు, మహిళలు, వృద్ధులు, యువతీయువకులు, అభిమానులకు పేరుపేరునా నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరిని నెం.1గా మార్చాలన్న తన సంకల్పానికి ఇదే స్పూర్తితో రాబోయే ఎన్నికల్లో సంఘీభావం తెలియజేయాలని కోరారు.

ఉత్సాహంగా నామినేషన్ల ప్రక్రియ - తొలి రోజు 229 దాఖలు - Leaders filed nominations

Nara Lokesh Nomination Mangalagiri: కాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేశ్ తరఫున టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా మంగళగిరిలోని సీతారామ కోవెల ఆలయం వద్ద నామినేషన్‌ పత్రాలకు ప్రత్యేక పూజులు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నారా లోకేశ్‌ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు కలిసి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

టీడీపీ సమన్వయకర్త నందం అబద్ధయ్య, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు, రేఖా సుధాకర్‌గౌడ్‌, ఎండీ ఇబ్రహీం తదితరులు ఒక సెట్‌ అందజేయగా, మరో సెట్‌ను పోతినేని శ్రీనివాసరావు, వేమూరి మైనర్‌బాబు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్‌, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి సమర్పించారు.

రెండోరోజు జోరుగా నామినేషన్ల ప్రక్రియ - ర్యాలీలతో తరలివస్తున్న నేతలు - Nominations in AP

ABOUT THE AUTHOR

...view details