తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు - నిర్ధారించిన NDDB - Fat In Tirumala Laddu Issue - FAT IN TIRUMALA LADDU ISSUE

Tirumala Laddu Ghee Issue : గత ప్రభుత్వం హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలు బయటకొచ్చాయి. తిరుపతి లడ్డులో నెయ్యి విషయమై నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ల్యాబ్‌లో పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు. నెయ్యిలో చేప నూనె, పామాయిల్‌, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు కలిపినట్లు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ల్యాబ్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Tirumala Laddu Ghee Issue
Tirumala Laddu Ghee Issue (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 6:17 PM IST

Updated : Sep 19, 2024, 10:52 PM IST

TTD Ghee Issue Facts : వైఎస్సార్సీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు బయటపెట్టారు. నివేదికల్లో పొందుపర్చిన అంశాలను ప్రస్తావిస్తూ, జగన్​పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లడ్డుల్లో నెయ్యిపై జులై 8, 2024న ల్యాబ్‌కు పంపించగా జులై 17వ తేదీన NDDB CALF ల్యాబ్ నివేదిక ఇచ్చిందన్నారు.

ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన NDDB CALF ల్యాబ్ ద్వారా వైఎస్సార్సీపీ బండారం బట్టబయలైందన్నారు. నెయ్యి కొనుగోళ్లలో ఎటువంటి నాణ్యత పాటించలేదని, ఆధారాలతో సహా నిరూపించారు.

రూ.320కే నెయ్యి టెండర్లు పిలిచారు : నాణ్యమైన నెయ్యికి రూ.వెయ్యికి పైగా ఖర్చవుతుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.320కి నెయ్యి టెండర్లు పిలిచిందన్నారు. నలుగురికి నెయ్యి టెండర్‌ కాంట్రాక్టు ఇచ్చారని, నాణ్యమైన నెయ్యి రూ.320కి ఇచ్చే వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. లంచాల కోసం 15 వేల కిలోల నెయ్యి టెండర్‌ ఇచ్చారన్న ఆనం, ఆవు నెయ్యి విషయంలో ల్యాబ్‌ సర్టిఫికేషన్‌ లేదన్నారు.

నెయ్యి సర్టిఫికేషన్​కు రూ.75 లక్షల ల్యాబ్​ పెట్టే పరిస్థితి లేదా : నెయ్యి సర్టిఫికేషన్‌కు రూ.75 లక్షలతో ల్యాబ్‌ పెట్టే పరిస్థితిలో లేరా అని నిలదీశారు. నెయ్యి విషయమై నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ల్యాబ్‌లో పరీక్షలు చేసిందన్నారు. నెయ్యిలో చేప నూనె, పామాయిల్‌, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు కలిపినట్లు తేలిందన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు నివేదికలో వెల్లడైందని తెలిపారు.

"వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి తిరుమలలో లడ్డూలు వాసన వస్తున్నాయి అని ఎప్పటి నుంచో ఫిర్యాదులు వస్తున్నాయి. నెయ్యి సరఫరా చేసే వాళ్లని మార్చేశారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్​కి చెందిన నందిని నెయ్యిని మార్చేశారు. ఎందుకంటే కర్ణాటక వాళ్లు లంచాలు ఇవ్వరు కాబట్టి. ఈ విషయం కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. నాణ్యమైన నెయ్యి వెయ్యికి పైగా ఖర్చవుతుంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 320కి నెయ్యి టెండర్లు పిలిచి, వారికి ఇచ్చేశారు. నాణ్యమైన నెయ్యి 320కే ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అనే నేను అడుగుతున్నాను. లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టే అక్కడ సప్లై చేసే వాళ్లు తప్పు చేశారు. టీటీడీకి 75 లక్షల రూపాయలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? రుజువులు కావాలి అని అన్నారు కదా, ఇదిగోండి రుజువులు. ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. వెంటనే దీనిపైన విచారణ ఉంటుంది". - ఆనం వెంకటరమణారెడ్డి, తెలుగుదేశం నేత

తిరుమల కొండపై పూలు ధరించకూడదు - ఎందుకో తెలుసా? - NO FLOWERS RULE IN TIRUMALA

శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక - మారిన తిరుమల లడ్డూ రూల్స్! మీకు తెలుసా? - New Rules for Tirumala Laddu

Last Updated : Sep 19, 2024, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details