తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఊహాజనితమైన అంశాలతో పిటిషన్​ వేశారు - విచారణ దశలో జోక్యం చేసుకోలేం' : ఓటుకు నోటు కేసులో సుప్రీం - Vote For Note Case - VOTE FOR NOTE CASE

Vote For Note Case : ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌ రెడ్డికి ఊరట లభించింది. కేసును భోపాల్‌ కోర్టుకు బదిలీ చేయాలన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఊహాజనితమైన అంశాలతో స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్‌ వేశారని, విచారణ జరుగుతున్న దశలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది.

SC Judgement on Vote for Note Case
Vote For Note Case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2024, 12:26 PM IST

Updated : Sep 20, 2024, 1:05 PM IST

SC Judgement on Vote for Note Case : ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలని బీఆర్ఎస్​కు చెందిన మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, ఆయన అభ్యర్థనను నిరాకరించింది. కేసును భోపాల్‌కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని, ఊహాజనితమైన అంశాలతో స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్‌ వేశారని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత దశలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

కేసు విచారణలో ఏసీబీ డీజీ సీఎం, హోంమంత్రిగా ఉన్న రేవంత్ ​రెడ్డికి రిపోర్టు చేయనక్కర్లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ట్రయల్‌ కోర్టు పారదర్శకంగా విచారణ చేయాలని, కేసు విచారణలో సీఎం రేవంత్‌ జోక్యం చేసుకోకూడదని ఆదేశించింది. కేసు విచారణపై విశ్రాంత జడ్జి పర్యవేక్షణకూ నిరాకరించిన సుప్రీంకోర్టు, భవిష్యత్‌లో సీఎం జోక్యంపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్లొచ్చని తుది ఉత్తర్వులు జారీ చేసింది.

క్షమాపణల అంగీకారం : మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై ధర్మాసనాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. తమ తీర్పులపై అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉందని పేర్కొన్న ధర్మాసనం, ప్రజా జీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని వెల్లడించింది. సీఎం రేవంత్ ​రెడ్డి క్షమాపణలను సుప్రీంకోర్టు అంగీకరించింది.

అసలేం జరిగిందంటే : దిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ అంశంపై సీఎం రేవంత్‌ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందన్న రేవంత్ వ్యాఖ్యలను, ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రేవంత్‌ రెడ్డి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీని ప్రశ్నించింది. రాజకీయ వైరుధ్యంలోకి కోర్టులను ఎందుకు లాగుతారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము రాజకీయ పార్టీలను సంప్రదించి ఆదేశాలు జారీ చేయాలా? అని నిలదీసింది. తమ ఆదేశాలపై రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోబోమని తేల్చిచెప్పింది.

కొత్త రేషన్​కార్డుల కోసం వెయిట్ చేస్తున్నారా? - డేట్​ వచ్చేసింది - ఇక వెంటనే అప్లై చేసుకోండి - New Ration Cards issue oct 2nd

నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ- అజెండాలోని కీలక అంశాలివే! - Telangana Cabinet Meet Today

Last Updated : Sep 20, 2024, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details