ETV Bharat / entertainment

డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ : ఆ బిట్​ వచ్చినప్పుడు ఫుల్​ విజిల్స్​! సీట్​లో అస్సలు కూర్చోరట! - DAAKU MAHARAJ TWITTER REVIEW

బాలయ్య మాస్ ర్యాంపేజ్ - డాకు మహారాజ్​కు ఆడియెన్స్​ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తోందంటే?

Daaku Maharaj Twitter Review
Daaku Maharaj Twitter Review (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2025, 6:40 AM IST

Daaku Maharaj Twitter Review : నందమూరి నటసింహం బాలకృష్ణ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. ట్రైలర్​, సాంగ్స్​తో భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఆదివారం థియేటర్లలో విడుదలైంది. అయితే ఇప్పటికే ఈ సినిమాను చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరీ ఈ సినిమా ఎలా ఉందంటే?

ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​, విజువల్స్, స్టోరీ ఇలా అన్ని ఎలిమెంట్స్​ బాగుందని ఓ యూజర్ రాసుకొచ్చారు. మరొకరేమో ఇది మాస్ ఫెస్ట్ అని, బాలయ్య యాక్షన్ అదిరిందని తెలిపారు. ఇక తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్​గా నిలిచిందని అన్నారు.

ఇంకొకరేమో ఇది ఓ మంచి యాక్షన్ డ్రామా అని చెప్పుకొచ్చారు. బాలయ్య, బాబీ దేఓల్​ నటన ఓ రేంజ్​లో ఉందని, సినిమాటోగ్రాఫీ వర్క్ బాగుందని అంటున్నారు.

ఇదిలా ఉండగా, 'సినిమా మాత్రం మీరు ఎంత ఊహించుకుంటారో అంతకుమించి ఉంటుంది' అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ వేరే లెవెల్​లో ఉందని, దెబ్బకు థియేటర్లు పగిలిపోతున్నాయని అన్నారు. డైరెక్టర్ బాబీ చాలా అద్భుతంగా తెరకెక్కించారని దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనని కామెంట్ చేశారు.

"అగ్ని ఆగదా శక్తి ఆగదా సుర సుర సురా సురా" అనే బిట్ వచ్చిన ప్రతి ఊర మాస్ సెంటర్లలో ఎవ్వరు సీట్లలో కూర్చోరంటూ మరో యూజర్ సినిమాకు మరింత హైప్ ఇచ్చారు. ఆ బిట్​ వచ్చినప్పుడు ఫుల్​ విజిల్స్​! సీట్​లో అస్సలు కూర్చోరని అభిమానులు అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.