Horoscope Today January 12th 2025 : 2025 జనవరి 12వ తేదీ (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ప్రయోజకరంగా ఉంటుంది. మనోబలంతో క్లిష్టమైన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి పరమైన ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్ట దేవతారాధన శుభకరం.
వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహసంచారం అనుకూలంగా లేనందున వృత్తి పరంగా గొప్ప అవకాశాలు కోల్పోవచ్చు. ఎవరితోనూ ఘర్షణలు లేకుండా చూసుకోండి. కుటుంబ కలహాల పట్ల మౌనంగా, ప్రశాంతంగా ఉండటం మంచిది. రాజీపూర్వక ధోరణి, సర్దుకుపోయే తత్వంతో ఉంటే మంచిది. వీలయితే ప్రయాణాన్ని వాయిదా వేయండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
మిథునం (Gemini) : మిథు నరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాలవారు ఆర్ధిక పరమైన లాభాలు అందుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొని ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.
కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. సమయానుకూలంగా నడుచుకుంటూ అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్ధికంగా అనుకూలమైన సమయం. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.
సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. పట్టుదలతో ముందడుగు వేస్తే విజయం మీ సొంతం. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. స్నేహితుల సహాయంతో అదనపు ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. కీలక విషయాలలో తెలివిగా ఆలోచిస్తే పనిలో సానుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యులతో అభిప్రాయం భేదాలు రాకుండా జాగ్రత్త పడండి. శివారాధన శ్రేయస్కరం.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్పష్టమైన ఆలోచన విధానంతో కొన్ని సమస్యలు సులువుగా పరిష్కరిస్తారు. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా, అంతటా విజయమే. పితృ వర్గం నుంచి ఆర్ధిక లబ్ధి పొందవచ్చు. మనోబలం తగ్గకుండా చూసుకోండి. కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శుభకరం.
తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు వ్యాపారులకు మంచి లాభదాయకంగా ఉంది. వృత్తినిపుణులు, ఆఫీసుల్లో పనిచేసేవారికి సహచరులు, తోటి ఉద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. కుటుంబంతో తీర్థయాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో స్థానచలనం ఉండవచ్చు. నవగ్రహ ప్రార్ధన శ్రేష్టం.
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఒక ముఖ్య విషయమై ఉన్నతాధికారులను కలుస్తారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. సమయానుకూలంగా నడుచుకొని అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆర్ధికంగా గొప్ప శుభసమయం నడుస్తోంది. ఊహించని ధనలాభాలు అందుకుంటారు. శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభకరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్ధిక నష్టం జరిగే సూచన ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. గణపతి ఆలయ సందర్శన శుభకరం.
మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి కీలక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. ప్రయాణాలు, కొత్త ప్రాజెక్టులు వాయిదా వేస్తే మంచిది. సమయానుకూలంగా ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో కలహాలు, వివాదాలు చోటు చేసుకుంటాయి. ఘర్షణలకు దూరంగా ఉండండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.
కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. తారాబలం అనుకూలంగా లేనందున కొత్త పనులు, ప్రయాణాలు చేపట్టవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకొని వీలైనంత వరకు శాంతంగా ఉండాలి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారెవరో గుర్తించాలి. వృథా ఖర్చులు ఉండవచ్చు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఈ రోజు కఠినమైన సమస్యలను ఎదుర్కొంటారు. మనస్తాపం కలిగించే ఓ సంఘటన ఫలితంగా ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఆర్ధిక పరిస్థితి క్షీణిస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతింటాయి, కనుక ఈ రోజును సాధ్యమైనంత ప్రశాంతంగా గడపండి. శని స్తోత్రం పారాయణతో ప్రతికూలతలు తొలగుతాయి.