ETV Bharat / bharat

3 మీటర్ల దగ్గరకు వచ్చిన ఇస్రో SPADEX శాటిలైట్స్​ - డాకింగ్ ఎప్పుడంటే? - ISRO SPADEX DOCKING MISSION

మరింత దగ్గరవుతున్న భారత స్పేడెక్స్‌ ఉపగ్రహాలు - సక్రమంగా పనిచేస్తున్న శాటిలైట్​ వ్యవస్థలు : ఇస్రో

ISRO SPADEX
ISRO SPADEX (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2025, 7:33 AM IST

Updated : Jan 12, 2025, 8:18 AM IST

ISRO SpaDeX Docking Mission : భారత స్పేడెక్స్‌ ఉపగ్రహాలు ఆదివారం మరింత దగ్గరయ్యాయి. శనివారం వాటి మధ్య దూరం 230 మీటర్లుగా ఉండగా, ఆదివారం నాటికి ఆ దూరం మొదట 15 మీటర్లకు చేరుకుంది. ఆ తరువాత ఇస్రో ఆ రెండు శాటిలైట్లను 3 మీటర్ల దగ్గరకు తీసుకువచ్చి, ఆపై సురక్షితంగా తిరిగి వెనక్కు తీసుకువచ్చింది. డేటాను పూర్తిగా విశ్లేషించిన తరువాత డాకింగ్ ప్రక్రియ చేపడతామని ఇస్రో తెలిపింది. ఆ ప్రస్తుతానికి శాటిలైట్లలోని అన్ని వ్యవస్థలూ సక్రమంగానే పనిచేస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ప్రస్తుతం అన్ని సెన్సర్ల పనితీరును విశ్లేషిస్తున్నామని పేర్కొంది.

"ప్రస్తుతం SD01 (ఛేజర్​), SDX02 (టార్గెట్​) రెండూ మంచి స్థితిలో ఉన్నాయి. వాటి మధ్య ఉన్న దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గించే ట్రయల్ ప్రక్రియ ముగిసింది. ఆ తరువాత ఆ రెండు శాటిలైట్లను సురక్షితమైన దూరానికి తరలించాం. డేటాను విశ్లేషించిన తరువాత డాకింగ్ ప్రక్రియ చేపడతాం." - ఇస్రో ట్వీట్

షేక్​ హ్యాండ్​ కోసం
ఇంతకు ముందు ఇస్రో ఓ ట్వీట్ చేసింది. రెండు ఉపగ్రహాల షేక్ హ్యాండ్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.

"ప్రస్తుతం SD01 (ఛేజర్​), SDX02 (టార్గెట్​) రెండూ మంచి స్థితిలో ఉన్నాయి. వాటి మధ్య దూరం 15 మీటర్ల మాత్రమే ఉంది. వాటి మధ్య మంచి ఉత్తేజకరమైన షేక్​ హ్యాండ్​ కోసం మనం కేవలం 50 అడుగుల దూరంలో ఉన్నాం. అవి రెండూ పరస్పరం స్టన్నింగ్ ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నాయి." - ఇస్రో ట్వీట్

డాకింగ్ ఎప్పుడు?
అయితే ఈ ఉపగ్రహాల అనుసంధానాన్ని (డాకింగ్‌) ఎప్పుడు చేపడతామన్నది మాత్రం ఇస్రో వెల్లడి చేయలేదు. వాస్తవానికి ఈ జనవరి 7, 9 తేదీల్లో ఈ ప్రక్రియను నిర్వహిస్తామని తొలుత ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత దాన్ని ఇస్రో వాయిదా వేసింది. అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్‌-4 లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు అవసరమైన డాకింగ్‌ ప్రక్రియపై పట్టు సాధించే ఉద్దేశంతో, ఇస్రో డిసెంబర్​ 30న ఎస్‌డీఎక్స్‌01 (ఛేజర్‌), ఎస్‌డీఎక్స్‌02 (టార్గెట్‌) శాటిలైట్లను పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా నింగిలోకి ప్రయోగించింది. ఈ ఉపగ్రహాల బరువు 220 కిలోగ్రాములు మాత్రమే. వీటిని భూమి నుంచి 475 కిలోమీటర్ల దూరంలో ఉన్న వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ స్పే​డెక్స్​ ప్రయోగం విజయవంతం అయితే, ప్రపంచంలో ఈ సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నాల్గో దేశంగా భారత్ నిలవనుంది.

Last Updated : Jan 12, 2025, 8:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.