Supreme Court on Note for Vote Case :ఓటుకు నోటు కేసు విచారణను బదిలీ చేయాలని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. గురువారం ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులోని నిందితుడు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, దర్యాప్తు సంస్థ ఎసీబీ చూసే హోం శాఖ కూడా ఆయన వద్దే జగదీశ్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టకు వివరించారు. పీసీసీ అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్‌లో జరిగిన ర్యాలీల్లో పలు మార్లు పోలీసులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారని తెలిపారు.
ఓటుకు నోటు కేసు అప్డేట్ - విచారణ బదిలీ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు - SC on Note for Vote Case - SC ON NOTE FOR VOTE CASE
SC on Note for Vote Case Update : ఓటుకు నోటు కేసు ట్రయల్ బదిలీ చేయాలని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు పిటిషన్‌ను రద్దు చేసింది.
Published : Aug 29, 2024, 12:07 PM IST
|Updated : Aug 29, 2024, 12:34 PM IST
సీఎంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే కేసుపై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్లో కూడా వైఖరి మారిందని జగదీశ్ రెడ్డి తరపు న్యాయవాది చెప్పారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న సుప్రీంకోర్టు, కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని, తమకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది ధర్మాసనం వెల్లడించింది.