Summer Sports Training Camps :విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఆటలు ఎంతగానో తోడ్పడుతుంటాయి. చిన్నప్పటి నుంచే క్రీడలపై మక్కువ పెంచేందుకు జీహెచ్ఎంసీ ఏటా వేసవి శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వేసవి శిక్షణా శిబిరాలు ప్రారంభించిన జీహెచ్ఎంసీ అధికారులు అవసరమైన క్రీడా సమాగ్రిని అందుబాటులో ఉంచారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. పలు పాఠశాలల్లో ఆటలాడుకునేందుకు మైదానాలు లేకపోవడంతో ఆయా పాఠశాలల విద్యార్థులకు ఈ వేసవి శిబిరాలు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. శిబిరాల్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించిన కోచ్‌లు విద్యార్థులకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు.
Sports camps under GHMC :అమీర్‌పేట, సనత్‌నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి, గోషామహల్ తదితర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఈ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, క్రికెట్, స్విమ్మింగ్ తదితర క్రీడల్లో బల్దియా శిక్షణ ఇప్పిస్తోంది. 37 రోజుల పాటు సాగే ఈ శిక్షణ శిబిరాలు ఈనెల 31న ముగియనున్నాయి. ఆరేళ్ల నుంచి పదహారేళ్ల వయసు ఉన్న పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు.
క్రీడా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ
"వేసవి శిక్షణా శిభిరాలకు వచ్చినవారు చాలా మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారయ్యారు. ఈ క్యాంపుల ముఖ్య ఉద్దేశం పిల్లలను జాతీయ క్రీడాకారులగా తీర్చిదిదటమే. పిల్లల్లో దాగి ఉన్న క్రీడాశక్తిని వెలికితీసి వారిని మంచి క్రీడా కారులుగా తీర్చిదిద్దుతున్నాం. మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారుల ప్రోత్సాహాంతో ఈ శిక్షణను అందిస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించి వారిలో క్రీడా ప్రతిభను పెంపొందింపజేయడమే ఈ శిక్షణా శిభిరాల ముఖ్య ఉద్దేశం"- అంజిబాబు, కోచ్