తెలంగాణ

telangana

ETV Bharat / state

సబ్‌అర్బన్ ప్రయాణాల్లో మార్పులు - మరిన్ని ఎంఎంటీస్‌ రైళ్లు - కేంద్రం బడ్జెట్‌పై గంపెడాశలు - MMTS SERVICES EXPECTED IN TELANGANA

సబ్‌అర్బన్ ప్రయాణాల్లో మార్పులు - మరో ఎంఎంటీఎస్ రైళ్లు - ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై భారీగా ఆశలు

Suburban Railway Lines and MMTS Services Expected in Telangana
Suburban Railway Lines and MMTS Services Expected in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 4:46 PM IST

Suburban Railway Lines and MMTS Services Expected in Telangana :హైదరాబాద్‌ పరిధిలో అమృత్‌ భారత్‌ స్టేషన్ పథకం కింద 12 స్టేషన్లలో అభివృద్ధి పనులు, చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభంతో, ముంబయి తరహాలో సబర్బన్‌ రైలు ప్రయాణాల్లోనూ మార్పులు రావాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఈ మేరకు కేంద్రం ప్రకటనలు కురిపించనుందని గంపెడాశలు పెట్టుకున్నారు. ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుకు స్వస్తి పలికి డెడికేటేడ్‌ ట్రాక్‌ల నిర్మాణం, యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రైలు పరుగులు దిశగా అడుగులు పడతాయని ఆశిస్తున్నారు.

రాజధాని పరిధిలో ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా 120 ఎంఎంటీఎస్‌ల అవసరముంది. ప్రస్తుతం 80 సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో 1.8 లక్షల మంది ప్రయాణికులకు ప్రస్తుతం 50 వేల మంది మాత్రమే ఎంఎంటీఎస్‌లలో ప్రయాణిస్తున్నారు. అతి తక్కువ టికెట్‌ ఖర్చుతో, అత్యంత వేగంగా గమ్యం చేరుకునే వెసులుబాటు ఉన్న ఎంఎంటీఎస్‌ మార్గాలను పునరుద్ధరించి, డెడికేటెడ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.

రాకపోకలను బట్టి ఎంఎంటీఎస్‌లు నడపాలని :ఇటీవలే చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభమైంది. ఇక్కడి నుంచి 25 జతల రైళ్లను నడపించాలని ద.మ రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పనులు సాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఒత్తిడి తగ్గించి తొలిదశలో 10 జతల రైళ్లను చర్లపల్లి నుంచి నడపాలని భావిస్తోంది. చర్లపల్లికి అనుసంధానిస్తూ అవసరమైన ఎంఎంటీఎస్ రైళ్లు లేపు. ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే ఒకటి నడుపుతున్నారు. కాచిగూడ, మేడ్చల్‌, హైదరాబాద్‌, లింగంపల్లి, తెల్లాపూర్‌, ఫలక్‌నుమా నుంచి చర్లపల్లికి రైళ్ల రాకపోకలను బట్టి ఎంఎంటీఎస్‌లు నడపాలని సబర్బన్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్ కోరుతోంది.

ప్రకటనతో ఆశలు :యాదాద్రికి రైల్వేలైన్‌ పనులను ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతేడాది ప్రకటించిన నేపథ్యంలో ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుపై ఆశలు చిగురించాయి. నగరం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రికి రోడ్డు మార్గంలో 2గంటల సమయం పడుతోంది. అదే ఎంఎంటీఎస్‌ అందుబాటులోకి వస్తే రూ.20 టిక్కెట్‌పై గంట వ్యవధిలో చేరుకోవచ్చు. ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి, అక్కడి నుంచి యాదాద్రికి లైన్‌ వేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఘట్‌కేసర్‌ వరకు పనులు పూర్తికాగా మరో 33 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీనిపై కేంద్రం ఈ బడ్జెట్‌లో స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశముంది.

రాష్ట్రానికి ఈసారైనా కొత్త రైళ్లు వచ్చేనా? - కేంద్ర బడ్జెట్‌పై సర్కార్ గంపెడాశలు!

ప్రయాణికులకు గుడ్​న్యూస్ - త్వరలోనే చర్లపల్లి నుంచి మరో 8 రైళ్ల పరుగులు

ABOUT THE AUTHOR

...view details