పేదింటి విద్యార్థికి అండగా నిలిచిన స్మితా సబర్వాల్ - ఉన్నత చదువులకు చేయూత (ETV Bharat) Smita Sabharwal Help To Poor Student Study : నల్గొండ జిల్లా జనగామకు చెందిన మాచాల కవిత తన రెండేళ్ల కుమారుడు గౌతమ్‌ను తీసుకుని కరీంనగర్ పట్టణంలోని నందిని కాన్వెంట్ స్కూల్‌కు వచ్చింది. భర్త చనిపోవడంతో పాఠశాలలో ఆయాగా చేరి అక్కడే గౌతమ్‌ను చదివించింది. పట్టుదలతో అతను చదువును కొనసాగించి ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 9.8 జీపీఏ సాధించాడు. పై చదువులు చదివించడానకి స్తోమత లేని వీరి స్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ గౌతమ్‌కు అండగా ఉంటానిని ముందుకొచ్చారు. ఆ విద్యార్థి ఉన్నత చదువులకు తాను సాయం చేస్తానని ప్రకటించారు.
గౌతమ్‌ను అభినందించిన స్మితాసబర్వాల్ : విద్యార్థి విజయగాధతో పాటు ఆర్ధిక ఇబ్బందులను తెలుసుకున్న స్మితా సబర్వాల్ విద్యార్థి వివరాల కోసం 'స్మితంహితం' ఆర్గనైజేషన్‌ను పంపారు. అంతేకాకుండా కరీంనగర్ పట్టణంలోని ఎన్‌ఎన్ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన స్మితా సబర్వాల్ గౌతమ్, అతని తల్లి కవితలను పిలిపించారు.
డ్రైవర్ కుమార్తెకు ఇంటర్లో 986 మార్కులు - ప్రభుత్వ కాలేజీ అయినా అన్ని మార్కులు ఎలా సాధించిందంటే? - 986 Marks for Driver Daughter
కవిత గౌతమ్‌లతో మాట్లాడిన స్మితా సబర్వాల్ కొడుకును చదివించాలనే దృఢ సంకల్పాన్ని అభినందించడమే కాకుండా కష్టపడి చదివించాలనే తల్లి కలను నెరవేర్చినందుకు గౌతమ్‌ను అభినందించారు. అతని చదువుకు, ఐఐటీ పూర్తి చేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు నందిని కాన్వెంట్ స్కూల్ చైర్మన్ వై. శేఖర్ రావు తెలిపారు. తన కుమారుడు చదువులకు సాయం చేస్తానన్న స్మిత సబర్వాల్‌కు కవిత కృతజ్ఞతలు తెలిపారు.
"10 వ తరగతి పరీక్ష ఫలితాల్లో 9.8 ర్యాంకు వచ్చింది. మార్కులు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మా అమ్మ స్కూల్లో ఆయాగా చేస్తూ నన్ను కష్టపడి చదివించింది. ఐపీఎస్ స్మితా సబర్వాల్ మా పేదరికాన్ని గమనించి ఆర్థికంగా ఆదుకుంటానడం ఎంతో సంతోషంగా ఉంది. నన్ను చిన్నప్పటి నుంచి ఉచితంగా చదివించిన ఉపాధ్యాయుడికి, ఐఏఎస్ స్మిత సబర్వాల్‌కు నా కృతజ్ఞతలు." -మాచాల గౌతం, విద్యార్థి
నడవలేని స్థితి అయినా కుటుంబం, గురువుల సహకారంతో సివిల్స్ సాధించా : 887వ ర్యాంకర్ హనిత - Interview with UPSC Ranker Hanitha
టాప్ క్లాస్ స్కూల్లో షారుక్ తనయుడు - ఏడాడికి ఫీజు ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔటే! - Sharukh Khan Younger Son School Fee