ETV Bharat / state

డీఎస్సీకి స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైన వారికి షాక్! - ధ్రువపత్రాలు పునఃపరిశీలించనున్న విద్యాశాఖ - DSC SPORTS QUOTA UPDATE

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల ధ్రువపత్రాల పునఃపరిశీలనకు విద్యాశాఖ నిర్ణయం - ఈ నెల 20, 21, 22 తేదీల్లో ధ్రువపత్రాల పునఃపరిశీలనకు నిర్ణయం

DSC sports quota candidates Certificate verification
DSC sports quota candidates Certificate verification (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2024, 7:54 PM IST

Updated : Nov 13, 2024, 10:18 PM IST

DSC Sports Quota Candidates Certificate Reverification : తెలంగాణ డీఎస్సీ స్పోర్ట్స్​ కోటా అభ్యర్థుల ధ్రువపత్రాలను పున:పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే నవంబర్​ 20,21,22 వ తేదీల్లో సర్టిఫికెట్​ రీవెరిఫికేషన్​ చేయనుంది. కొంతమంది అభ్యర్థులు ఫేక్​ సర్టిఫికెట్లు పెట్టి స్పోర్ట్స్​ కోటాలో ఎంపికైనట్లుగా కంప్లైంట్​లు వచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 393 మంది సర్టిఫికెట్లను అధికారులు మరోసారి నిశితంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్ అభ్యర్థులకు కీలక సమాచారాన్ని అందించింది.

డీఎస్సీ-2024 పూర్వపరాలు : ఈ ఏడాది ఫిబ్రవరి నెల 29న నోటిఫికేషన్ విడుదల చేసిన కాంగ్రెస్ సర్కారు జులై 18 నుంచి ఆగస్టు 5 వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించింది. మొత్తం 11,062 టీచర్ ఉద్యోగాలకు గాను 2 లక్షల 46 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి అక్టోబర్​ 1 నుంచి 5 వ తేదీ వరకు డీఈవోల ఆధ్వర్యంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. వీరిలో మొత్తం 10,006 మందికి నియామక పత్రాలను అందించారు.

Confusion In Selection Of Teacher Jobs In Nizamabad : ఇదిలా ఉండగా డీఎస్సీ-2024 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో మెరిట్‌ ఆధారంగా జరిపిన ఎంపికల్లో గందరగోళం కొనసాగింది. ఖమ్మం జిల్లాలో అర్హత లేని 7 మంది అభ్యర్థులను ఎంపిక చేశారంటూ ఆలస్యంగా గుర్తించిన విద్యాశాఖ, ఈ వ్యవహారంలో బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు హెచ్​ఎంలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ క్రమంలోనే నిజామాబాద్‌ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలిని అనర్హురాలిగా పేర్కొంటూ విద్యాశాఖ అధికారులు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు.

సెకండరీ గ్రేడ్​ టీచర్​ విభాగంలో 257 వ ర్యాంక్ సాధించిన లావణ్య అనే అమ్మాయికి నిజామాబాద్​ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక వడ్డెర కాలనీ ప్రైమరీ స్కూల్​లో పోస్టింగ్ ఇచ్చారు. గత నెల ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఆమె, శనివారం వరకు విధులు నిర్వర్తించారు. కాగా టెక్నికల్​ కారణాలతో పొరపాటున లావణ్య ఉద్యోగానికి ఎంపికయ్యారని, ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన 125 వ ర్యాంకు పొందిన అభ్యర్థిని భార్గవి గైర్హాజరైనట్లు చూపడంతో ఇలా జరిగిందని తెలిపారు. దీంతో సరిచేసి లావణ్యను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థుల అడ్డదారులు - అర్హత లేకున్నా ఈడబ్ల్యూఎస్​ సర్టిఫికెట్ల​ సమర్పణ - Telangana DSC Counseling 2024

అయ్యో పాపం : ఒకేసారి 2 జాబ్స్ - ఒకటి వదిలేస్తే రెండోదీ పోయింది

Last Updated : Nov 13, 2024, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.