ETV Bharat / state

తెల్లవారుజామునే హైదరాబాద్​లో రెండు చోట్ల సెల్​​ఫోన్ చోరీ ఘటనలు - దర్యాప్తులో షాకింగ్ నిజాలు - CELL PHONE THEFT CASES IN HYDERABAD

హైదరాబాద్​లో నిన్న తెల్లవారుజామున రెండు చోట్ల సెల్​ఫోన్ ​దొంగతనాలు - కత్తితో బెదిరించి చోరీలు - సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా నిందితుల అరెస్ట్ - వారి ఆధార్ కార్డులు చూసి షాకైన పోలీసులు

Cell Phone Theft Cases In Hyderabad
Cell Phone Theft Cases In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 13, 2024, 6:57 PM IST

Cell Phone Theft Cases In Hyderabad : హైదరాబాద్​లో తెల్లవారుజామున నిర్మానుష్య ప్రాంతాల్లో వాకింగ్​కు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త!, ఇటీవల సెల్​ఫోన్ దొంగలు తెల్లవారుజామునే విజృంభిస్తున్నారు. ఒంటరిగా కనిపిస్తే వచ్చి బెదిరించి మరీ దోచుకెళ్తున్నారు. అడ్డుకుంటే కత్తితో దాడి చేసేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనే నిన్న తెల్లవారుజామున అబిడ్స్, ఐమాక్స్ ఏరియాల్లో జరిగాయి. రెండు ఘటనల్లో నిందితులు ఒక్కరే.

ఇదీ జరిగింది : మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఐమాక్స్ వద్ద న్యాయవాది కల్యాణ్ వాకింగ్​కు వెళ్లారు. అతని వద్దకు ఇద్దరు వ్యక్తులు యాక్టివాపై వచ్చారు. హిందీలో మాట్లాడుతూ ఆయన దగ్గరున్న శాంసంగ్ మొబైల్​ గుంజుకునేందుకు యత్నించారు. లాయర్ కల్యాణ్ అడ్డుకోవడంతో కత్తితో బెదిరించారు. అయినా విడిచిపెట్టకపోవడంతో దాడి చేసి ఫోన్​తో పారిపోయారు. ఈ దాడిలో కల్యాణ్​కు గాయాలయ్యాయి. వెంటనే బాధితుడు పోలీస్ కంట్రోల్ రూమ్​కు సమాచారమిచ్చారు.

సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు : ఈ ఘటన జరగడానికి గంట ముందు అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే తరహ చోరీ జరిగింది. గన్ ఫౌండ్రీలోని ప్రసాద్ అపార్ట్ మెంట్ వద్ద వాచ్ మెన్ వద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్​ను ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి వారు ఐమాక్స్ వద్దకు వెళ్లారు. ఒకేరోజు ఒకే ఏరియాలో రెండు సెల్​ఫోన్​ చోరీలు జరగడంతో సెంట్రల్​జోన్ డీసీపీ అక్షాన్ష్ యాదవ్ అప్రమత్తమయ్యారు. ప్రత్యేక టీమ్​లతో దర్యాప్తునకు ఆదేశించారు.

చోరీ జరిగిన ఏరియాలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్​ను పోలీసులు చెక్ చేశారు. వాటి ఆధారంగా రాంనగర్ ఫిష్ మార్కెట్ వద్ద ఒకరిని అదుపులోకి తీసుకొని విచారించగా వాచ్ మెన్ వద్ద దొంగిలించిన రెడ్ మీ మొబైల్ ఫోన్ లభించింది. అతనిచ్చిన సమాచారంతో చాంద్రాయణ గుట్ట బండ్లగూడ వద్ద మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గరి నుంచి న్యాయవాది కల్యాణ్ నుంచి దొంగిలించిన శాంసంగ్ మొబైల్ ఫోన్​ను రికవరీ చేశారు. నిందితుల నుంచి దాడికి ఉపయోగించిన కత్తితో పాటు హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు ఇద్దరూ మైనర్లే : దర్యాప్తు వివరాలను అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, సైఫాబాద్ ఏసీపీ సంజయ్ వెల్లడించారు. నిందితులు ఇద్దరు మైనర్లు కావడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. నిందితుల ఆధార్ కార్డుల ఆధారంగా మైనర్లు అని తేలిందని, వారి వయసును నిర్దారించేందుకు ఉస్మానియా హాస్పిటల్​లో టెస్టుల కోసం పంపించినట్లు తెలిపారు. ముషీరాబాద్​లో అరెస్ట్ చేసిన బాలుడిపై గతంలో వారిపై ఇదే తరహాలో మొబైల్ స్నాచింగ్ కేసు నమోదు అయిందన్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్​కు తరలించిన అనంతరం కస్టడీకి తీసుకొని విచారిస్తామని ఏసీపీలు తెలిపారు.

"ఇద్దరు నిందితులు కూడా మైనర్లే. ఒకరిని రాంనగర్​ దగ్గర, మరో నిందితుడిని బండ్లగూడలో అరెస్ట్ చేశాం. వీరిద్దరిని రిమాండ్​కు పంపిన తరువాత పోలీస్ కస్టడీకి తీసుకుంటాం" - చంద్రశేఖర్, అబిడ్స్ ఏసీపీ

సినిమా రేంజ్​లో చోరీ ప్లాన్​ చేశాడు - కత్తితో మినీ ఏటీఎంలోకి చొరబడ్డాడు - కట్​ చేస్తే!

పక్కన చేరి, ఘరానా చోరీ - హైదరాబాద్​లో దోపిడీ ముఠాల హల్​చల్ - THEFT GANGS IN HYDERABAD

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.