Sister Killed Brothers for Benefits From Government :ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తండ్రి పక్షవాతంతో మరణించగా, ఆ కుటుంబానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు తనకే దక్కాలనే ఉద్దేశంతో సొంత అన్న, తమ్ముడు ఒకరికి తెలియకుండా మరొకరిని హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని పల్నాడులో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అయితే వారి మృతదేహాలు లభించకపోవడంతో ఈ విషయాన్ని నిర్ధారించలేకపోతున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు యానాది కాలనీకి చెందిన పౌలిరాజుకు ముగ్గురు పిల్లలు. భార్య కొన్నేళ్ల క్రితం మరణించారు. ఆయన నకరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది జనవరిలో పక్షవాతంతో మృతి చెందారు.
5 గుంటల భూమి కోసం దారుణానికి ఒడిగట్టిన తమ్ముడు, మరదలు - అసలు ఏమైందంటే?
పెద్ద కుమారుడు గోపీకృష్ణ బొల్లాపల్లి మండలం బండ్లమోటు పీఎస్‌లో కానిస్టేబుల్. రెండో సంతానం కుమార్తె కృష్ణవేణి. పెళ్లై భర్తను వదిలి పుట్టింట్లో ఉంటోంది. మూడో సంతానం దుర్గా రామకృష్ణ. కుమారులిద్దరికీ పెళ్లిల్లు అయ్యాయి. కానీ వీరిని భార్యలు వదిలి పుట్టిళ్లకు వెళ్లిపోయారు. ముగ్గురు కూడా వాళ్ల జీవిత భాగస్వాములను వదిలి పెట్టి తండ్రి దగ్గరే ఉంటున్నారు. అయితే నిందితురాలికి నకరికల్లులో ప్రియుడు ఉన్నట్లు సమాచారం. కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుపై ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ ప్రయోజనాలు 'నా కంటే నాకు రావాలి' అంటూ తరచూ ముగ్గురూ గొడవ పడేవారు.