CM Revanth Reddy Picture On Silk Cloth : మన చేనేత కార్మికులు మగ్గంపై చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అగ్గిపెట్టెలో పట్టే చీరలు, దబ్బనంలో పట్టే చీర, బంగారం, వెండితో తయారీ చేసిన కోకలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఎందరో కళాకారులు సందర్భానుసారంగా తమ టాలెంట్ బయట పెడుతూనే ఉంటారు. ఇలాగే ప్రధాన మంత్రి చేత ప్రశంసలు అందుకున్న సిరిసిల్ల చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతం చేశారు.
రేపు(నవంబర్ 8న) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టు వస్త్రంపై తెలంగాణ ముఖ చిత్రంలో సీఎం ఫోటో వచ్చే విధంగా దాదాపు ఐదు రోజులపాటు శ్రమించి తయారు చేశారు. దీని పొడవు 32 ఇంచులు వెడల్పు 47 ఇంచులు. ఈ ముఖచిత్రాన్ని తయారు చేయడానికి రూ. 20 వేల వరకు ఖర్చు వచ్చిందని హరిప్రసాద్ తెలిపారు. నవంబర్ 8న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అవకాశం కల్పిస్తే ఈ పట్టు వస్త్రాన్ని సీఎంకు కానుకగా అందిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
'నవంబర్ 8న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అరుదైన కానుకగా అందించాలని పట్టువస్త్రంపై సీఎం రేవంత్రెడ్డి చిత్రం వచ్చేలా తయారు చేశా. దాదాపు ఐదు రోజులపాటు శ్రమించి పట్టువస్త్రం తయారు చేశాను. నాకు అవకాశం కల్పిస్తే రేవంత్రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు ఈ వస్త్రాన్ని అందిస్తా'- వెల్ది హరిప్రసాద్, చేనేత కార్మికుడు