తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ జిల్లావాసులను భయపెడుతోన్న 'సీరియల్' మర్డర్స్ - ఎవరు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? - MURDERS IN MEDAK

మెదక్‌ జిల్లాలో వరుస హత్యల కలకలం - 10 రోజుల వ్యవధిలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య - ఈ రెండు హత్యలూ ఒకే మాదిరిగా ఉండటంతో భయపడుతున్న గ్రామస్థులు

Serial Murders In Medakat
Murders In Medak (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2024, 3:56 PM IST

Updated : Nov 3, 2024, 4:03 PM IST

SerialMurders in Medak :మెదక్‌ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. చిన్న శంకరంపేటలో 10 రోజుల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ రెండు హత్యలు కూడా ఒకే మాదిరిగా ఉండటం గ్రామస్థుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పద్మనాభస్వామి గుట్ట వద్ద మరో వ్యక్తిని బండరాయితో కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య: మెదక్ జిల్లా చిన్న శంకరంపేటలో 10 రోజుల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ రెండు హత్యలు కూడా ఒకే మాదిరిగా ఉండటంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. చనిపోయిన ఇద్దరు వ్యక్తులు కూడా బండరాయితో కొట్టి, మృతదేహాలపై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. రెండు మృతదేహాలు కూడా సగం కాలిపోయి ఉన్నాయి. గత నెల 24న చిన్న శంకరంపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో గుర్తుతెలియని యువకుడిని దుండగులు బండరాయితో కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదే క్రమంలో ఇవాళ కూడా చిన్న శంకరంపేట పద్మనాభ స్వామి గుట్ట వద్ద మరో వ్యక్తిని బండరాయితో కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ కూడా స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో పని చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

పది రోజుల వ్యవధిలో రెండు హత్యలు :మొదటి హత్య కేసు విచారణలో ఉండగానే, మరో హత్య వెలుగులోకి రావడంతో దర్యాప్తు పోలీసులకు సవాల్​గా మారింది. రెండు హత్యలు ఒకే విధంగా ఉండటంతో ఇద్దరినీ ఒకే వ్యక్తి చంపి ఉంటాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు హత్యలు ఎవరు చేశారు? అనే విషయాలను క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు. సీసీ టీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, ఏమైనా వివరాలు తెలిస్తే తెలియజేయాలని ప్రజలను పోలీసులు కోరారు.

"రెండు హత్యలు ఒకే మాదిరిగా బండరాయితో కొట్టి చంపారు. హత్యకు గురైన వారు ఇద్దరు కూడా స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో పని చేస్తున్నారు. హత్యలు చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. సీసీ టీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం."-ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, మెదక్‌ ఎస్పీ

కోరిక తీర్చమంటూ బలవంతం - ప్రతిఘటించడంతో మహిళపై అత్యాచారం - ఆపై కాల్వలో పడేసిన యువకులు

ఎవరు చంపుతున్నారు? - ఎందుకు చంపేస్తున్నారు? - అసలు ఆ హత్యలు చేస్తుందెవరు?

Last Updated : Nov 3, 2024, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details