Seetharamula Shobha Yatra In Bhadradri Temple :అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భద్రాద్రిలో లక్ష్మణ సమేత సీతారాముల శోభాయాత్ర వైభవంగా జరిగింది. మామిడి తోరణాలు వివిధ రకాల పుష్పాలతో భద్రాద్రి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయంలోని స్వామివారికి విశేష పూజలు నిర్వహించి నిత్య కల్యాణ మండపం వద్ద బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు.
అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ- రామాలయానికి విచ్చేసిన అమితాబ్, రజనీకాంత్ సహా ప్రముఖులు
చిన్నారుల కూచిపూడి నృత్యాలు, మహిళల కోలాటాల సందడి, మంగళ వాద్యాలు, వేద మంత్రాలు రామరథంతో సీతారాముల శోభాయాత్ర భద్రాద్రి పురవీధుల్లో ఘనంగా జరుగుతోంది. అయోధ్య విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భద్రాద్రి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో కదిలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భద్రాచలంలోని ప్రధాన ఆలయం నుంచి బయలుదేరిన సీతారాములు బ్రిడ్జి సెంటర్ అంబేడ్కర్ సెంటర్ తాత గుడి సెంటర్ రాజు వీధుల గుండా శోభాయాత్ర సాగింది. భద్రాద్రి ఆలయ ప్రాంగణం మొత్తం కాషాయ జెండాలు రామనామ భక్త సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది.
Pran Pratishtha Celebrations Khammam :మరోవైపు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలోని పురాతన శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సమీప గ్రామమైన మధిరలోని ఈ ఆలయం నిర్మించి వందేళ్ళకు పైబడింది. ఇక్కడ ఆలయంలో స్వామిని దర్శించుకుంటే భద్రాద్రి రామయ్యను, అయోధ్య రామయ్యను దర్శించుకున్నట్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయోధ్య మందిర ప్రారంభ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు. అయోధ్యలో జరిగే కార్యక్రమం భక్తులు వీక్షించేందుకు ఆలయంలో ప్రత్యేకంగా ఎల్ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేశారు.