సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా రద్దీ - అడుగు తీసి అడుగు వేసే ఖాళీ లేదు - Secunderabad railway station rush - SECUNDERABAD RAILWAY STATION RUSH
Dussehra 2024 : నగరంలో అప్పుడే దసరా పండుగ ఎఫెక్ట్ కనిపిస్తోంది. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో తల్లిదండ్రులు వారి పిల్లలతో సొంతూళ్లకు పయనం అవుతున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది. అడుగుతీసి అడుగు వేయాలన్నా ఖాళీ లేకుండా ఉంది.
Published : Oct 3, 2024, 10:06 AM IST
|Updated : Oct 3, 2024, 11:19 AM IST
Secunderabad Railway Station Rush : దసరా పండుగ వచ్చింది, పిల్లలకు సెలవులు తెచ్చింది. ఇంకేముంది నగరవాసులంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతోంది. దసరా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర భారతదేశానికి వెళ్లేందుకు ప్రజలు రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు. అలాగే దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తమ తమ సొంతూళ్లలో పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకోవడం కోసం ఉత్సాహంగా వెళుతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.