తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల - ముఖ్యమైన తేదీలు ఇవే - MLA QUOTA MLC ELECTIONS IN TG

ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల - మార్చి 3న నోటిఫికేషన్‌, 20న ఎన్నికలు

MLA Quota MLC Elections in Telangana
MLA Quota MLC Elections in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2025, 2:53 PM IST

MLA Quota MLC Elections in Telangana :తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలో ఐదుగురి ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.

మార్చి 29 నాటికి ఐదుగురి ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. తెలంగాణలో పదవీకాలం ముగిసే వారిలో సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్‌ హాసన్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ (ETV Bharat)

ముఖ్యమైన తేదీలు : -

  • ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ : మార్చి 3
  • నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం : మార్చి 10
  • నామినేషన్ల పరిశీలన : మార్చి 11
  • నామినేషన్ల ఉపసంహరణ : మార్చి 13
  • పోలింగ్‌: మార్చి 20
  • ఓట్ల లెక్కింపు : మార్చి 20

బీఆర్‌ఎస్​కు ఒక స్థానం! : మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్​లు బీఆర్​ఎస్​ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎగ్గె మల్లేశం మాత్రం కొద్ది నెలల క్రితమే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. మీర్జా సహన్‌ ఎమ్​ఐఎమ్​ నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో నాలుగు సీట్లను అధికార కాంగ్రెస్‌, ఒక స్థానాన్ని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ దక్కించుకునే అవకాశం ఉంది.

పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - ముఖ్యమైన తేదీలు ఇవే

ABOUT THE AUTHOR

...view details