తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రయాణికులకు గుడ్​న్యూస్​ - విశాఖపట్నం-సికింద్రాబాద్‌ వందేభారత్‌ కోచ్‌లు భారీగా పెంపు - 8 MORE COACHES VIZAG VANDE BHARAT

సికింద్రాబాద్​ టూ విశాఖపట్నం వందే భారత్​లో పెరిగిన కోచ్​ల సంఖ్య - 8 నుంచి 16కు పెంపు

Seating Capacity in Visakhapatnam Vande Bharat Trains Increased
Seating Capacity in Visakhapatnam Vande Bharat Trains Increased (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2025, 12:26 PM IST

Seating Capacity in Visakhapatnam Vande Bharat Trains Increased : విశాఖపట్నం - హైదరాబాద్​ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందే భారత్​ (20707/20708) ఎక్స్​ప్రెస్​లో కోచ్​లో సంఖ్యను 8 నుంచి 16కు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దీంతో సీట్ల సంఖ్య 530 నుంచి 1,128కి పెరగనుందని తెలిపింది. ఈ నెల 13 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ రైలును 2024 మార్చి 12న ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో ఎగ్జిక్యూటివ్​ కోచ్​1, ఛైర్​కార్​ కోచ్​లు 7 ఉన్నాయి. తాజా నిర్ణయింతో ఎగ్జిక్యూటివ్​ కోచ్​లు 2కి, ఛైర్​కార్ కోచ్​లు 14కి పెరుగుతాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్​ కుమార్​ జైన్​ తెలిపారు.

వందే భారత్ ఎక్స్​ప్రెస్ సౌకర్యాలపై ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే ట్విటర్ ద్యారా తెలిపింది.

"మూడు రోజుల నుంచి విశాఖకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎన్ని రైళ్లు ప్రయత్నించినా దొరకలేదు. నిన్న మధ్యాహ్నం బుక్ చేశాం. కన్ఫర్మ్​ కాగానే చాలా సంతోషించాం. చాలా ఆనందంగా ఉంది." - ప్రయాణికురాలు

ABOUT THE AUTHOR

...view details