RTC Drivers Protest in Vikarabad : ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు భోజనం చేసే సమయంలో బస్సును ప్లాట్‌ఫామ్ వద్ద కాకుండా డిపోలో ఓ పక్కన నిలిపి ఉంచుతారు. ఆ సమయంలో ఆ బస్సులో ఎవరూ ఎక్కడానికి ఉండదు. భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ డ్యూటీ ఎక్కుదామనుకున్న డ్రైవర్, కండక్టర్‌ను ఓ ప్రయాణికుడు వచ్చి బస్సు ఎప్పుడు బయల్దేరుతుందని అడిగాడు. వారు భోజనం అయ్యాక బయల్దేరతామని చెప్పారు. అయితే అది అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తి గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా డ్రైవర్‌పై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనను మిగతా డ్రైవర్లు ఖండించారు. ప్రయాణికుడి తీరుకు నిరసనగా డిపోలో సుమారు 45 బస్సులను నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.
డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం :వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ డిపోలో ప్రయాణికుడు నవాజ్ బస్సు ఆలస్యం అవడంతో వికారాబాద్ డిపో డ్రైవర్ రాములును ఎప్పుడు తీస్తారని అడిగాడు. భోజనం చేసి ఐదు నిమిషాల్లో తీస్తామని రాములు బదులిచ్చాడు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఆగ్రహానికి గురైన నవాజ్ రాములుతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం దాడి చేశాడు. ఈ ఘటనపై వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్, కండక్టర్లు కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Heat Effect on Bus Drivers in Hyderabad : మండే ఎండలోనూ.. బస్సు 'రయ్ రయ్' అనాల్సిందే