Registrations Growth Increase In Congress Government : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత, స్థిరాస్తి వ్యాపారం పుంజుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయని, అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో జరిగిన రెజిస్ట్రేషన్లతో పోలిస్తే, 12.5శాతం సంఖ్య పెరిగినట్లు వివరించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవనాలు, లేఅవుట్ల అనుమతులతో పాటు ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు కూడా పెరగడమే ఇందుకు నిదర్శనమని వెల్లడించింది.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దాదాపు మూడు నెలలపాటు ఆర్థిక లావాదేవీలు స్తంభించినా, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే స్థిరాస్థి రంగం పుంజుకున్నట్లు ప్రభుత్వం వివరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ ప్రాజెక్టు, మెట్రో రైలు విస్తరణ, సికింద్రాబాద్ నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే రెండు ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణం, రాబోయే రోజుల్లో నగర రూపురేఖలు మారిపోనున్నాయని వివరించింది.
ధరణి పెండింగ్ దరఖాస్తులను పది రోజుల్లో పరిష్కరించాలి : సీఎస్ శాంతికుమారి - DHARANI PENDING APPLICATIONS 2024
మరోవైపు అవుటర్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించే ప్రణాళికలు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించటంతో స్థిరాస్తి రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడినట్లు వెల్లడించింది. గతంతో పోలిస్తే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో రిజిస్టేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం పెరిగిందని, 2023 డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకు ఏడు నెలల్లో ప్లాట్లు భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4670.52 కోట్ల ఆదాయం వచ్చినట్లు వివరించింది. అంతకు ముందు అంటే మే 2023 నుంచి నవంబర్ 2023 వరకు వచ్చిన ఆదాయం రూ.4,429.23 కోట్లతో పోలిస్తే, రూ.241.29 కోట్లు ఆదాయం పెరిగినట్లు వెల్లడించింది.
రోజురోజుకు విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్‌లో స్థిరాస్థి రంగం వృద్ధికి ఈ పెరుగుదల సంకేతంగా చెప్పొచ్చని ప్రభుత్వం పేర్కొంది. 2022 డిసెంబర్ నుంచి 2023 జూన్ వరకు ఇదే సమయంతో పోల్చితే రూ.270.86 కోట్లు అధికంగా ఆదాయం వచ్చినట్లు తెలిపింది. గత ఏడు నెలల్లో జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 2,18,160 కాగా, ఇది గత ఏడాది ఇదే సమయంలో జరిగిన 1,93,962 రిజిస్ట్రేషన్లతో పోలిస్తే, 12.5% అధికమని వెల్లడించింది.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 54,111 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ జరగగా, గత ఏడాది ఇదే సమయంలో జరిగిన 50,535 ఫ్లాట్‌లు రిజిస్ట్రేషన్లతో పోలిస్తే 7% పెరుగుదల నమోదైనట్లు వివరించింది. డిసెంబర్ 7 నుంచి జూన్ 30 వరకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో 18077 భవనాలకు అనుమతి ఇవ్వగా, గత ఏడాది ఇదే సమయంలో ఇచ్చిన అనుమతులు 17911గా పేర్కొన్న ప్రభుత్వం 7809 అనుమతులు అధికంగా ఇచ్చి 13.17శాతం వృద్ధి నమోదైనట్లు వివరించింది.
20 వేల కోట్ల భూములను తనఖా! - ఎక్స్‌వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్ - KTR OPPOSED GOVT LANDS MORTGAGE