ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

LIVE UPDATES: అచ్యుతాపురం సెజ్‌ ఘటనలో తప్పు చేసిన వారిని ప్రభుత్వం క్షమించదు: సీఎం - Reactor Blast Live updates - REACTOR BLAST LIVE UPDATES

Reactor Blast in Escientia Pharma Company at Atchutapuram SEZ Live Updates
Reactor Blast in Escientia Pharma Company at Atchutapuram SEZ Live Updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2024, 10:34 AM IST

Updated : Aug 22, 2024, 5:30 PM IST

Reactor Blast in Escientia Pharma Company at Atchutapuram SEZ Live Updates : అనకాపల్లి జి‌ల్లాలోని అచ్యుతాపురం సెజ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే పరిశ్రమల్లో ఎన్నడూ ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్‌లోని మిశ్రమం ఎలక్ట్రికల్ ప్యానల్‌పై పడటంతో ఏసీ యూనిట్లకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు విస్తరించి, అంతటా అంటుకుని పేలుడు సంభవించింది. దీంతో గోడలు, ఏసీ యూనిట్లు కూలి కింద పనిచేస్తున్న కార్మికులపై పడిపోయాయి. పేలుడు ధాటికి అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఈ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందగా, మరో 36 మంది గాయపడ్డారు.

LIVE FEED

4:51 PM, 22 Aug 2024 (IST)

రెడ్‌ జోన్‌ పరిశ్రమలు ఎస్‌వోపీ కచ్చితంగా అనుసరించాలి: సీఎం

  • బాధిత కుటుంబాలను ఆదుకునే బాధ్యత తీసుకుంటాం: సీఎం
  • బాధిత కుటుంబాలకు కంపెనీ పరిహారం చెల్లిస్తుంది: సీఎం
  • పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం: సీఎం
  • ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం: సీఎం
  • రెడ్‌ జోన్‌ పరిశ్రమలు ఎస్‌వోపీ కచ్చితంగా అనుసరించాలి: సీఎం
  • ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమలు చూడాలి: సీఎం
  • ప్రమాదాలు వీలైనంత వరకు తగ్గించేందుకు ప్రయత్నిస్తాం: సీఎం
  • ఎవరైనా కుట్రలు చేసినా ఎక్కువ రోజులు సాగవు: సీఎం
  • దాదాపు 90-95 శాతం పరిశ్రమలు బాధ్యత వహిస్తున్నాయి: సీఎం
  • కొన్ని పరిశ్రమలు బాధ్యతారాహిత్యంగా ఉంటున్నాయి: సీఎం
  • తప్పు చేసిన వారిని ఈ ప్రభుత్వం క్షమించదు: సీఎం

4:35 PM, 22 Aug 2024 (IST)

పరిశ్రమలో ఏం జరిగింది.. లోపాలపై కమిటీ విచారిస్తుంది : సీఎం

  • రెడ్‌ క్యాటగిరీలోని పరిశ్రమలు జాగ్రత్తలు తీసుకోవాలి : సీఎం
  • పరిశ్రమలు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి : సీఎం
  • పరిశ్రమలు వెంటనే అంతర్గత విచారణ చేపట్టాలి : సీఎం
  • ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చాం : సీఎం
  • భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఇబ్బందులు వస్తాయి : సీఎం
  • ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ వేస్తున్నా : సీఎం
  • పరిశ్రమలో ఏం జరిగింది.. లోపాలపై కమిటీ విచారిస్తుంది : సీఎం
  • పరిశ్రమలకు ఉన్న ఇబ్బందులపైనా కమిటీ విచారిస్తుంది : సీఎం
  • పరిశ్రమలు బాధ్యత తీసుకోకుండా ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు : సీఎం
  • నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టం.. శిక్షిస్తాం : సీఎం
  • బాధిత కుటుంబాలను ఆదుకునే బాధ్యత తీసుకుంటాం : సీఎం
  • బాధిత కుటుంబాలకు కంపెనీ పరిహారం చెల్లిస్తోంది : సీఎం
  • పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్‌ కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం : సీఎం
  • ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం : సీఎం

4:27 PM, 22 Aug 2024 (IST)

గత ఐదేళ్లలో విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి

  • విశాఖలోని ఆస్పత్రుల్లో ఫార్మా కంపెనీ బాధితులను పరామర్శించా:చంద్రబాబు
  • తీవ్రంగా గాయపడిన బాధితులను ఆస్పత్రుల్లో పరామర్శించా :చంద్రబాబు
  • మృతులు, బాధితుల కుటుంబసభ్యులను ఓదార్చా:చంద్రబాబు
  • మృతుల కుటుంబాలకు రూ.కోటి ఆర్థిక సాయం :చంద్రబాబు
  • తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు సాయం:చంద్రబాబు
  • స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షల సాయం:చంద్రబాబు
  • బాధితుల కుటుంబాలకు అధికారులు చెక్కులు అందజేస్తారు :చంద్రబాబు
  • పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి :చంద్రబాబు
  • నిబంధనల మేరకు ఎస్‌వోపీ అనుసరించలేదని తెలుస్తోంది :చంద్రబాబు
  • గత ఐదేళ్లలో విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి
  • పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రత ప్రమాణాలు చేపట్టలేదు
  • ఫార్మా పరిశ్రమలో శక్తివంతమైన పేలుడు జరిగింది

3:36 PM, 22 Aug 2024 (IST)

అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష

  • అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా పరిశ్రమ పరిశీలించిన సీఎం చంద్రబాబు
  • ఘటన వివరాలు సీఎం చంద్రబాబుకు వివరించిన కలెక్టర్‌ విజయకృష్ణన్‌
  • పరిశ్రమలో కలియతిరిగి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్న సీఎం
  • అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష
  • సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు

12:54 PM, 22 Aug 2024 (IST)

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు: సీఎం

  • ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసింది: సీఎం
  • 17 మంది మరణించారు, 36 మందికి గాయాలయ్యాయి: సీఎం
  • 10 మందికి తీవ్రగాయాలు, 26 మందికి స్వల్పగాయాలయ్యాయి: సీఎం
  • బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలందించాలని ఆదేశించాం: సీఎం
  • తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షలు చొప్పున పరిహారం: సీఎం
  • స్వల్ప గాయాలైనవారికి రూ.25 లక్షలు చొప్పున పరిహారం: సీఎం
  • భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు: సీఎం

12:52 PM, 22 Aug 2024 (IST)

ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసింది: సీఎం

  • ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసింది: సీఎం
  • 17 మంది మరణించారు, 36 మందికి గాయాలయ్యాయి: సీఎం
  • 10 మందికి తీవ్రగాయాలు, 26 మందికి స్వల్పగాయాలయ్యాయి: సీఎం
  • గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసింది: సీఎం

12:49 PM, 22 Aug 2024 (IST)

తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షలు చొప్పున పరిహారం: సీఎం

  • అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులకు సీఎం పరామర్శ
  • విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్లిన సీఎం చంద్రబాబు
  • బాధితులు, బాధిత కుటుంబసభ్యులకు సీఎం భరోసా
  • బాధితుల వద్దకెళ్లి వైద్యసేవలను అడిగి తెలుసుకున్న సీఎం
  • ఎంత ఖర్చు అయినా అందరికీ వైద్య సేవలందిస్తాం: సీఎం
  • అవసరమైన వారికి ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయిస్తాం: సీఎం
  • బాధిత కుటుంబీకులకు పరిహారం వివరాలు చెప్పిన సీఎం
  • తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షలు చొప్పున పరిహారం: సీఎం
  • స్వల్ప గాయాలైనవారికి రూ.25 లక్షలు చొప్పున పరిహారం: సీఎం
  • ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం: సీఎం
chandrababu (ETV Bharat)

12:47 PM, 22 Aug 2024 (IST)

బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు భరోసా

  • అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులకు సీఎం పరామర్శ
  • విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్లిన సీఎం చంద్రబాబు
  • మెడికవర్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చంద్రబాబు పరామర్శ
  • ప్రమాద వివరాలను బాధితుల నుంచి తెలుసుకుంటున్న సీఎం
  • క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకుంటున్న సీఎం
  • ధైర్యంగా ఉండాలని బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం
  • మేము అన్నీ చూసుకుంటామని బాధితులకు సీఎం భరోసా
  • ఎంత ఖర్చు అయినా మిమ్మల్ని రక్షించుకుంటాం: బాధితులతో సీఎం
  • మేము అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి: బాధితులతో సీఎం
  • బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్న సీఎం
  • బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు భరోసా
  • ఎంత ఖర్చు అయినా భరిస్తామని బాధిత కుటుంబాలకు సీఎం భరోసా
  • తీవ్ర గాయాలైనవారికి రూ.50 లక్షలు చొప్పున పరిహారం: సీఎం
  • స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షలు చొప్పున పరిహారం: సీఎం

12:32 PM, 22 Aug 2024 (IST)

ఎంత ఖర్చు అయినా మిమ్మల్ని రక్షించుకుంటాం: బాధితులతో సీఎం

  • అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులకు సీఎం పరామర్శ
  • విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్లిన సీఎం చంద్రబాబు
  • మెడికవర్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చంద్రబాబు పరామర్శ
  • ప్రమాద వివరాలను బాధితుల నుంచి తెలుసుకుంటున్న సీఎం
  • క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకుంటున్న సీఎం
  • ధైర్యంగా ఉండాలని బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం
  • మేము అన్నీ చూసుకుంటామని బాధితులకు సీఎం భరోసా
  • ఎంత ఖర్చు అయినా మిమ్మల్ని రక్షించుకుంటాం: బాధితులతో సీఎం

12:21 PM, 22 Aug 2024 (IST)

విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్లిన సీఎం చంద్రబాబు

  • అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద బాధితులకు సీఎం పరామర్శ
  • విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్లిన సీఎం చంద్రబాబు
  • మెడికవర్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చంద్రబాబు పరామర్శ
  • ప్రమాద వివరాలను బాధితుల నుంచి తెలుసుకుంటున్న సీఎం
  • క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకుంటున్న సీఎం

11:48 AM, 22 Aug 2024 (IST)

విశాఖ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

  • విశాఖ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • కాసేపట్లో విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్లనున్న సీఎం
  • మెడికవర్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న సీఎం
  • అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో నిన్న ఘోర ప్రమాదం
  • నిన్నటి ప్రమాదంలో 17 మంది మృతి, 36 మందికి గాయాలు

11:42 AM, 22 Aug 2024 (IST)

బాధితులను పరామర్శించిన స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు

  • అనకాపల్లిలోని ఉషా ప్రైమ్‌ ఆస్పత్రిలో బాధితులకు పరామర్శ
  • బాధితులను పరామర్శించిన స్పీకర్‌ అయ్యన్న, ఎంపీ సీ.ఎం.రమేష్‌
  • బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న స్పీకర్‌, ఎంపీ

10:56 AM, 22 Aug 2024 (IST)

అనకాపల్లిలోని ఉషా ప్రైమ్‌ ఆస్పత్రికి వెళ్లిన వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

  • అనకాపల్లిలోని ఉషా ప్రైమ్‌ ఆస్పత్రికి వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
  • ప్రమాదంలో మొత్తం 36 మందికి చికిత్స: వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
  • విశాఖలోని మెడికవర్‌లో ఏడుగురికి చికిత్స: వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
  • అనకాపల్లిలోని ఉషా ప్రైమ్‌ ఆస్పత్రిలో 18 మందికి చికిత్స: కృష్ణబాబు
  • పవన్‌సాయి ఆస్పత్రిలో 8 మందికి చికిత్స: కృష్ణబాబు
  • మరో ముగ్గురు కిమ్స్‌లో ఉన్నారు: వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
  • చికిత్స పొందుతున్నవారు క్రమంగా కోలుకుంటున్నారు: కృష్ణబాబు
  • పూర్తిగా కోలుకున్నాకే డిశ్చార్జి: వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు

10:55 AM, 22 Aug 2024 (IST)

అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరం: పవన్‌కల్యాణ్‌

  • అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరం: పవన్‌కల్యాణ్‌
  • ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని తెలుస్తోంది: పవన్‌కల్యాణ్‌
  • కాలుష్య నియంత్రణ నా పరిధిలో ఉంది, భద్రత వేరే శాఖలోకి వస్తుంది: పవన్‌
  • పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలాసార్లు చెప్పా: పవన్‌
  • పరిశ్రమలు మూతపడతాయనే భయం కూడా ఉంది: పవన్‌కల్యాణ్‌
  • ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలి: పవన్‌
  • సెప్టెంబర్‌లో విశాఖ వెళ్లి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తా: పవన్‌కల్యాణ్‌
  • పరిశ్రమల్లో భద్రత చర్యలపై సమావేశం నిర్వహిస్తా: పవన్‌కల్యాణ్‌
  • ప్రతి వారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరం: పవన్‌కల్యాణ్‌
  • సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదు: పవన్‌కల్యాణ్‌
  • రాబోయే 3 నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ: పవన్‌కల్యాణ్‌

10:41 AM, 22 Aug 2024 (IST)

ఎసెన్షియా కంపెనీ దుర్ఘటన అత్యంత బాధాకరం : మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీ దుర్ఘటన అత్యంత బాధాకరమని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. 17మంది దుర్మరణం చెందడం తీవ్రంగా కలచివేస్తోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించడం జరిగిందని తెలిపారు. క్షతగాత్రులను కూడా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందిని స్పష్టం చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వం ఇప్పటికే మెరుగైన వైద్య సేవలు అందిస్తోందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీ యాజమాన్యంపై ఇప్పటికే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

10:39 AM, 22 Aug 2024 (IST)

అచ్యుతాపురం ఫార్మా సెజ్​లో ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించింది : మంత్రి కొల్లు రవీంద్ర

అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. చివరి బాధితుడి వరకు న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే కంపెనీ యాజమాన్యంపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. కంపెనీ నుండి బాధితులకు పరిహారం ఇప్పిస్తామని ప్రభుత్వం నుండి కూడా సహకారం అందిస్తామని తెలిపారు. ప్రతి బాధితుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నేడు బాధితులందరినీ పరామర్శిస్తారని తెలిపారు. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

10:38 AM, 22 Aug 2024 (IST)

క్షతగాత్రులను పరామర్శించిన ఎంపీ సీ.ఎం.రమేష్‌

  • విశాఖ: మెడికవర్ ఆస్పత్రిలో క్షతగాత్రులకు ఎంపీ సీ.ఎం.రమేష్‌ పరామర్శ
  • బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న అనకాపల్లి ఎంపీ రమేష్‌

10:36 AM, 22 Aug 2024 (IST)

విశాఖ పర్యటనకు బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  • విశాఖ పర్యటనకు బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • కాసేపట్లో విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్లనున్న సీఎం
  • సీఎం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ
  • ఇప్పటికే ఆస్పత్రికి చేరుకున్న సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది

10:08 AM, 22 Aug 2024 (IST)

కాసేపట్లో విశాఖకు సీఎం చంద్రబాబు

  • కాసేపట్లో విశాఖకు సీఎం చంద్రబాబు
  • ఫార్మా కంపెనీ ఘటనలో మృతుల కుటుంబాలకు పరామర్శ
  • ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు
  • ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్న సీఎం చంద్రబాబు
  • ఘటనపై ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న సీఎం
  • తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం
  • తక్షణం క్షతగాత్రులను విశాఖ లేదా హైదరాబాద్ తరలించాలన్న సీఎం
  • క్షతగాత్రులను ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలన్న సీఎం
  • కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని ఆదేశం
Last Updated : Aug 22, 2024, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details