ETV Bharat / spiritual

నరదృష్టి పోగొట్టే 'కూష్మాండ దీపం'? ఇలా వెలిగిస్తే మీ దోషాలన్నీ తొలగిపోతాయ్! - KUSHMANDA DEEPAM TELUGU

కూష్మాండ దీపం అంటే ఏంటి? అది ఎలా వెలిగించాలి? కూష్మాండ దీపాన్ని ఎందుకు వెలిగించాలి?

Kushmanda Deepam Telugu
Kushmanda Deepam Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 23 hours ago

Kushmanda Deepam Telugu : భగవంతుని పూజలో దీపారాధనకు విశిష్ట స్థానముంది. అలాగే కొన్ని రకాల కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రత్యేక దీపారాధన చేయాలని శాస్త్రం చెబుతోంది. ఉదాహరణకు దుర్గాదేవికి వెలిగించే నిమ్మకాయ దీపం, కార్తీక మాసంలో పెట్టే ఉసిరిక దీపం ఇవన్నీ ఈ కోవకు చెందినవే! అలాగే మరో ప్రత్యేక దీపారాధన పద్ధతి అయిన కూష్మాండ దీపం గురించి తెలుసుకుందాం.

కూష్మాండం అంటే?
కూష్మాండం అంటే గుమ్మడికాయ. హిందూ సంప్రదాయం ప్రకారం కూష్మాండ దీపం అత్యంత శక్తివంతమైనది.

కూష్మాండ దీపం విశిష్టత
ఒక వ్యక్తికి దృష్టి దోషం, నరఘోష, శని దోషం, ఆర్థిక సమస్యలు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం, పిల్లలు మాట వినకపోవడం, సంతానం కలగక పోవడం, సంతానం వృద్ధిలోకి రాకపోవడం మొదలైన సమస్యలు ఉన్న వారు కాల భైరవ తత్వం ప్రకారం ఈ కూష్మాండ దీప పరిహారాన్ని చేసుకోవచ్చు. క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కడానికి ఇది మంచి పరిహారం. ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. కావలసిందల్లా కేవలం భక్తి శ్రద్ధ మాత్రమే!

కూష్మాండ దీపం ఎలా పెడతారు
ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే! ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకుని దాన్ని అడ్డంగా కోసి గింజలు పిక్కలు తీసి, లోపల ఏమి లేకుండా డొల్లగా చేసి పెట్టుకోవాలి. తరువాత గుమ్మడికాయ లోపలి భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి.

పంచోపచార పూజ
దీపారాధన పూర్తయ్యాక ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాల భైరవ అష్టకం 11 సార్లు చదవాలి.

కూష్మాండ దీపారాధన ఎప్పుడు చెయ్యాలి?
కూష్మాండ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ, అమావాస్య రోజున కానీ సంకల్పం చెప్పుకొని, మనసులోని కోరిక విన్నవించి, ఉదయం 4:30 నుంచి 6:00 మధ్యలో చెయ్యాలి. ముఖ్యంగా ఐశ్వర్యం కోరుకునే వారు ధనయోగం కోసం అష్టమి రోజు చెయ్యాలి. పలుకుబడి, పరపతి, జనాకర్షణ కోరుకునే వారు అమావాస్య రోజు చెయ్యాలి. మొత్తానికి 19 అష్టములు కానీ, 19 అమావాస్యలు కానీ ఈ కూష్మాండ దీపారాధన చేయాలి. ప్రసాదంగా ఎండు ఖర్జూరం సమర్పించాలి. గుర్తుంచుకోండి ఇక్కడ ఏ దైవం అన్నది ప్రసక్తి కాదు దీపారాధనే దైవంగా భావించి పూజించాలి.

ఈ నియమాలు తప్పనిసరి
కూష్మాండ దీపారాధన చేసేవారు ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు.

కూష్మాండ దీపారాధన ఫలం
నరఘోష, నరదృష్టితో బాధపడేవారు, గ్రహ వాస్తు పీడలతో ఇబ్బంది పడేవారు భక్తిశ్రద్ధలతో కూష్మాండ దీపారాధన చేయడం వలన జీవితంలో దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అత్యంత శక్తివంతమైన ఈ దీపారాధన వలన విపరీత జన ఆకర్షణ పెరుగుతుంది.

శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.