తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ 'పాము'ను మీరెప్పుడైనా తిన్నారా? - ఒక్కసారి రుచి చూస్తే ఇక వదిలిపెట్టరు! - RARE EEL FISH IN ANDHRA PRADESH

మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప - చూస్తే పాము అనిపించేలా రూపం - 8 అడుగుల పొడవుండే నల్ల బొమ్మిడాయి - ఆంధ్రాలోని కాకినాడ తీరంలో దొరికిన ఈల్​ రకం చేప

Rare Eel Fish in Andhra Pradesh
Rare Eel Fish in Andhra Pradesh (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2024, 2:27 PM IST

Rare Eel Fish in Andhra Pradesh :ఎవరైన పాము చూస్తే భయంతో పరుగులు పెడతారు. అలాంటిది ఆమె చేత్తో పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ ఎంతో ధైర్యంగా ఉంది. అదేంటి? ఆమె పామును చేతిలో పట్టుకొని, అలా ఎలాంటి బెరుకు లేకుండా హ్యాపీగా నవ్వుతూ ఫొటోలకు పోజులిస్తుందని అనుకుంటున్నారా?. దగ్గరకు వెళ్లి చూస్తే మీకే అర్థం అవుతుంది ఆమె ఎందుకు నవ్వుతుందో అని. అది చూసిన తర్వాత హాఁ..! ఏం ఉందిలే. ఆ పామును మనం కూడా పట్టుకోవచ్చు అంటారు. అదేంటి? అలా అంటున్నారు అనుకుంటున్నారా? అవునండి, ఆమె పట్టుకున్న పామును మీరూ పట్టుకోవచ్చు. ఎందుకంటే అది పాము కాదు చేప కాబట్టి.

చిత్రంలో కనిపిస్తుంది సముద్రపు చేప. చూడటానికి అచ్చం పాములా ఉంది. దూరం నుంచి చూస్తే కచ్చితంగా ఎవరైనా పాము అనుకోవాల్సిందే. ఇంతకీ ఆ పామును అదేనండీ పాములాంటి చేపను ఎక్కడ పట్టారో తెలుసా? మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు చిక్కింది ఈ మీనం. ఆ చేప పేరు నల్ల బొమ్మిడాయి. సముద్రంలో పెరిగే ఈల్​ జాతికి చెందిన చేప ఇది. ఇలాంటి చేపలు మన దగ్గర ఉండవు లెండి. ఎందుకంటే మనకు సముద్రం ఉండదు కదా.. కేవలం చెరువు చేపలే లభ్యమవుతాయి.

8 అడుగుల నల్ల బొమ్మిడాయి చేప :సాధారణంగా ఈల్​ జాతికి చెందిన చేపలు సముద్రంలో పెరుగుతాయి. ఇవి మూడు నుంచి నాలుగు అడుగుల వరకు పెరుగుతాయి.ఇవి మత్స్యకారులు సముద్రంలో చేపలకు వెళ్లేటప్పుడు ఈ ఈల్​ చేపలు (బొమ్మిడాయి) వలలకు నిత్యం దొరుకుతాయి. వీటి రుచి కూడా అమోగంగా ఉంటుంది. కానీ ఇవి చూడటానికి పాముల్లా ఉండటంతో చాలా మంది కొనేందుకు, తినేందుకు కూడా భయపడతారు. శుక్రవారం (అక్టోబరు 25)న కాకినాడలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వారికి 8 అడుగుల ఈ నల్ల బొమ్మిడాయి చేప చిక్కింది.

ఆ నల్లబొమ్మిడాయిని సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చిన మత్య్సకారులు, అమ్మేందుకు ఇలా పైకెత్తి చూపారు. ఇది తినడానికి ఎంతో రుచికరంగా ఉన్నా, పాములా ఉండటంతో కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించరని మత్స్యకారులే చెబుతున్నారు. అందుకే వీటిని ఎండబెట్టి బయటకు ఎగుమతి చేస్తామని తెలిపారు. కాకినాడలోని కుంభాభిషేకం చేపల రేవు వద్ద 50 కిలోల బొమ్మిడాయి (ఈల్​ చేపలు) చేపలను రూ.5000లకు మత్స్యకారులు విక్రయించారు.

మీకు ఎండు చేపలు తినే అలవాటు ఉందా? లేదా? - అయితే తప్పక ఈ స్టోరీ చదవాల్సిందే! - Dry Fish Benefits In Telugu

పోలీస్ బందోబస్తు మధ్య చేపల విక్రయం - అంత స్పెషల్ ఏంటంటే? - KG Fish Rs100 in Khammam

ABOUT THE AUTHOR

...view details