తెలంగాణ

telangana

LIVE UPDATES : రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి : ఏపీ సీఎం చంద్రబాబు - Ramoji Rao Memorial Program

By ETV Bharat Telangana Team

Published : Jun 27, 2024, 3:51 PM IST

Updated : Jun 27, 2024, 6:34 PM IST

Ramoji Rao Memorial Program Live
Ramoji Rao Memorial Program (ETV Bharat)

  • Ramoji Rao Memorial Program Live Updates :రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. విజయవాడ శివారు కానూరు వందడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్‌లో సంస్మరణ సభకు ప్రభుత్వం తరఫున ప్రతిష్ఠాత్మక ఏర్పాట్లు చేశారు. వివిధ రంగాల్లో రామోజీరావు విశేష సేవలకు గుర్తింపుగా ఏర్పాటు చేసిన ఈ సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. ఈ వేడుకకు రామోజీ కుటుంబసభ్యులు సహా సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

LIVE FEED

6:31 PM, 27 Jun 2024 (IST)

చంద్రబాబు 2

ఎవరడిగినా నిర్మొహమాటంగా సలహాలు ఇచ్చేవారు: చంద్రబాబు

అన్ని పార్టీల నేతలకు ప్రాధాన్యం ఇచ్చేవారు: చంద్రబాబు

నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసిన వ్యక్తి.. రామోజీరావు..: చంద్రబాబు

పనిచేస్తూనే మరణించాలనే ఆయన కోరిక నెరవేరింది: చంద్రబాబు

తెలుగుభాష అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం: చంద్రబాబు

పని చేస్తూనే మరణించాలని కోరుకున్న వ్యక్తి రామోజీరావు: చంద్రబాబు

తెలుగుజాతి గొప్పగా ఉండాలని ఎప్పుడూ ఆకాంక్షించేవారు: చంద్రబాబు

రామోజీ స్థాపించిన వ్యవస్థ.. కుటుంబానిదే కాదు.. పది కోట్ల ప్రజలది: చంద్రబాబు

ఎన్టీఆర్‌కు భారతరత్నఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం: చంద్రబాబు

రామోజీరావుకు కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత: చంద్రబాబు

అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం: చంద్రబాబు

అమరావతిలో ఓ రోడ్డుకు రామోజీరావు పేరు పెడతాం: చంద్రబాబు

విశాఖలో చిత్రనగరికి రామోజీరావు పేరు పెడతాం: చంద్రబాబు

6:30 PM, 27 Jun 2024 (IST)

చంద్రబాబు 1

  • ఈనాడును ప్రజాగళంగా రామోజీరావు తీర్చిదిద్దారు: చంద్రబాబు
  • మేం విపక్షంలోనే ఉన్నప్పుడే పోరాడాం.. రామోజీ నిత్యం పోరాడేవారు: చంద్రబాబు
  • రామోజీరావు కొన్ని వందల మంది జర్నలిస్టులను తయారు చేశారు: చంద్రబాబు
  • రామోజీరావు కొన్ని వందల మంది నటీనటులను తయారు చేశారు: చంద్రబాబు
  • పచ్చళ్లను 150 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు: చంద్రబాబు
  • జిల్లా ఎడిషన్లు తెచ్చి క్షేత్రస్థాయి ప్రజాసమస్యలు ప్రస్తావించారు: చంద్రబాబు
  • ఈనాడు పత్రిక ద్వారా సమాజ హితం కోసం కృషి చేశారు: చంద్రబాబు
  • రామోజీ ఫిల్మ్‌ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దారు: చంద్రబాబు
  • కొవిడ్ వచ్చినప్పుడు ప్రజలకు రామోజీరావు అండగా ఉన్నారు: చంద్రబాబు
  • తెలుగుజాతి ఎప్పటికీ గుర్తుంచుకునే వ్యక్తి రామోజీరావు: చంద్రబాబు
  • రామోజీరావు ఏనాడూ వ్యక్తిగత అవసరాల కోసం అడగలేదు: చంద్రబాబు
  • రామోజీరావు విలువల కోసం పోరాడారు: ఏపీ సీఎం చంద్రబాబు
  • ఆస్తులన్నీ పోయినా రాజీపడబోనని రామోజీరావు తేల్చిచెప్పారు: చంద్రబాబు
  • ఎన్ని కష్టాలు వచ్చినా భయపడలేదు.. ధైర్యంగా ఎదుర్కొన్నారు..: చంద్రబాబు
  • భయం అంటే ఏంటో తెలియని వ్యక్తి రామోజీరావు: చంద్రబాబు
  • హైదరాబాద్‌ అభివృద్ధిలో రామోజీరావు ఆలోచనలు ఉన్నాయి: చంద్రబాబు
  • రాజధానికి అమరావతి పేరు పెట్టాలని సూచించారు: చంద్రబాబు
  • అమరావతి.. దశ, దిశ మారుతుంది: ఏపీ సీఎం చంద్రబాబు
  • తెలుగుజాతి ఉజ్వల భవిష్యత్తుకు అమరావతి నాంది పలుకుతుంది: చంద్రబాబు

6:22 PM, 27 Jun 2024 (IST)

చంద్రబాబు 2

  • జిల్లా ఎడిషన్లు తెచ్చి క్షేత్రస్థాయి ప్రజా సమస్యలు ప్రస్తావించారు : చంద్రబాబు
  • ఈనాడు పత్రిక ద్వారా సమాజ హితం కోసం కృషి చేశారు : చంద్రబాబు
  • నటులు, జర్నలిస్టులు, కళాకారులకు జీవితం ఇచ్చారు: చంద్రబాబు
  • ప్రియా పచ్చళ్లను 150 దేశాలకు ఎగుమతి చేశారు: చంద్రబాబు
  • రామోజీ ఫిల్మ్‌ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దారు: చంద్రబాబు
  • కొవిడ్ వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉన్నారు: చంద్రబాబు
  • వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తిగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు : చంద్రబాబు
  • తనకు ఫలానా పని చేయాలని ఎప్పుడూ అడగలేదు : చంద్రబాబు
  • విలువల కోసం బతికారు.. ప్రజల కోసం పోరాటం చేశారు..: చంద్రబాబు

6:15 PM, 27 Jun 2024 (IST)

చంద్రబాబు - ఏపీ ముఖ్యమంత్రి

  • రామోజీరావు.. అక్షర శిఖరం: సీఎం చంద్రబాబు
  • సంస్మరణ సభకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు: సీఎం చంద్రబాబు
  • రామోజీరావు.. సమాజానికి ఎంతో సేవ చేశారు: సీఎం చంద్రబాబు
  • రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించాలి: సీఎం చంద్రబాబు
  • మారుమూల గ్రామంలో పుట్టి పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగారు: చంద్రబాబు
  • రామోజీరావు.. వ్యక్తి కాదు.. ఆయనో వ్యవస్థ..: చంద్రబాబు
  • ఎంచుకున్న ప్రతి రంగంలో నెంబర్‌వన్‌గా ఎదిగారు: చంద్రబాబు
  • నీతి, నిజాయతీకి ప్రతిరూపం.. రామోజీరావు..: చంద్రబాబు
  • ఏ పనిచేసినా ఎప్పుడూ ప్రజాహితం కోరుకునేవారు: చంద్రబాబు
  • మీడియా రంగంలో చేసిన కృషికి అనేక అవార్డులు వచ్చాయి: చంద్రబాబు
  • మార్గదర్శిని దెబ్బతీయాలని అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయి: చంద్రబాబు
  • ఏం చేసినా మార్గదర్శిపై నమ్మకాన్ని దెబ్బతీయలేకపోయారు: చంద్రబాబు

6:02 PM, 27 Jun 2024 (IST)

కిరణ్

  • నాన్నగారి సంస్మరణ సభ నిర్వహించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు: కిరణ్‌
  • ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎప్పుడూ పరితపించేవారు: కిరణ్‌
  • ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా నిలబడేవారు: కిరణ్‌
  • ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారు: కిరణ్‌
  • దేశం నలుమూలలా బాధితులకు అండగా నిలబడ్డారు: కిరణ్‌
  • నాన్నగారి స్ఫూర్తితో ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని మాటిస్తున్నాం: కిరణ్‌
  • నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు సూచించారు: కిరణ్‌
  • అమరావతి.. దేశంలోనే గొప్ప నగరంగా మారాలి: కిరణ్‌
  • అమరావతి కోసం రూ.10 కోట్లు విరాళం అందిస్తున్నాం: కిరణ్‌
  • నాన్నగారి సంస్మరణ సభకు హాజరైన అందరికీ నమస్సులు: కిరణ్‌

5:53 PM, 27 Jun 2024 (IST)

పవన్ కల్యాణ్‌

  • 2008లో మొదటిసారి రామోజీరావును కలిశా: పవన్ కల్యాణ్‌
  • రామోజీరావు మాట్లాడే విధానం నన్ను చాలా ఆకర్షించింది: పవన్ కల్యాణ్‌
  • ప్రజాసంక్షేమం కోణంలోనే ఆయన ఎప్పుడూ మాట్లాడేవారు: పవన్ కల్యాణ్‌
  • రామోజీరావు మాటల్లో జర్నలిజం విలువలే నాకు కనిపించాయి: పవన్ కల్యాణ్‌
  • పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో రామోజీరావు వివరించారు: పవన్ కల్యాణ్‌

5:45 PM, 27 Jun 2024 (IST)

మంత్రి పార్థసారథి

  • అతి సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థితికి ఎదిగారు: పార్థసారథి
  • అడుగుపెట్టిన ప్రతి రంగంలో ఎవరెస్టు శిఖరంలా ఎత్తుకు ఎదిగారు: పార్థసారథి
  • పత్రిక ద్వారా సమాజంలో అనేక మార్పులు తెచ్చారు: పార్థసారథి
  • క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నతస్థితికి చేరుకోవచ్చని చెప్పారు: పార్థసారథి
  • ప్రజాసమస్యలపై పత్రిక ద్వారా కలం ఝుళిపించారు: మంత్రి పార్థసారథి

5:44 PM, 27 Jun 2024 (IST)

శ్రావణ్‌కుమార్‌

  • రాజధానికి అమరావతి పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు: శ్రావణ్‌కుమార్‌
  • అమరావతిలో రామోజీరావు విగ్రహం పెట్టాలని కోరుతున్నా: శ్రావణ్‌కుమార్‌
  • ప్రతిపనిలో ప్రజాహితం ఉండాలని కోరుకున్నారు: శ్రావణ్‌కుమార్‌
  • ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు నేనున్నానని ముందుకొచ్చారు: శ్రావణ్‌కుమార్‌
  • పత్రిక ద్వారా ప్రజల్లో ఎంతో చైతన్యం ఇచ్చారు: శ్రావణ్‌కుమార్‌

5:37 PM, 27 Jun 2024 (IST)

రాజమౌళి

  • రామోజీరావు.. ఎన్నో శిఖరాలు అధిరోహించారు: రాజమౌళి
  • తెలుగు ప్రజలకు ఇంత చేసిన రామోజీరావుకు మనమేం చేయగలం?: రాజమౌళి
  • రామోజీరావుకు భారతరత్న ఇవ్వడం సముచితం, సబబు: రాజమౌళి

5:36 PM, 27 Jun 2024 (IST)

కీరవాణి

  • రామోజీరావు.. సంగీత దర్శకుడిగా నాకు జన్మ ఇచ్చారు: కీరవాణి
  • రామోజీరావు వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నా: కీరవాణి
  • రామోజీరావులా ఒక్కరోజు జీవించినా చాలు: కీరవాణి
  • మా దేవుడి గదిలో రామోజీరావు గారి ఫొటో ఉంటుంది: కీరవాణి

5:32 PM, 27 Jun 2024 (IST)

శ్యాంప్రసాదరెడ్డి

  • రామోజీరావుతో మా నాన్నకు చాలా సాన్నిహిత్యం ఉంది: శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
  • రామోజీరావు దగ్గరకు మా అమ్మాయిని తీసుకెళ్లా: శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
  • కష్టపడి పనిచేసి పైకి రావాలని చెప్పేవారు: శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
  • తన జీవితాన్ని తానే రాసుకున్న వ్యక్తి.. రామోజీరావు..: శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
  • రామోజీరావు నిజమైన మానవతావాది: శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
  • రామోజీరావు నీడలో 40 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి: శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
  • సమాజంలో మార్పు కోసం కలాన్ని ఆయుధంగా వాడారు: శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి
  • రామోజీరావు లాంటి లక్షణాలు ఉన్నవ్యక్తి చాలా అరుదు: శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి

5:32 PM, 27 Jun 2024 (IST)

గులాబ్ కొఠారి

  • రామోజీరావుతో 40 ఏళ్లుగా నాకు పరిచయం ఉంది: గులాబ్ కొఠారి
  • రామోజీరావు ప్రజల సమస్యలపై కలం కదిలించారు: గులాబ్ కొఠారి
  • ఎప్పుడూ ప్రజల సమస్యల గురించే ఆలోచించేవారు: గులాబ్ కొఠారి
  • సమాజంలో అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారు: గులాబ్ కొఠారి
  • రామోజీరావు.. సంస్కృతి, సంప్రదాయాలకు విలువ ఇచ్చేవారు: గులాబ్ కొఠారి
  • రామోజీరావు ఎప్పుడూ దూరదృష్టి కలిగి ఉండేవారు: గులాబ్ కొఠారి
  • ప్రభుత్వాలను ఎదిరించి మరీ కలంతో యుద్ధం చేసిన వ్యక్తి: గులాబ్ కొఠారి
    రామోజీరావు లాంటివారు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పుట్టాలి: గులాబ్ కొఠారి

5:19 PM, 27 Jun 2024 (IST)

మురళీమోహన్

  • కృషి, దీక్ష, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు: మురళీమోహన్
  • రైతు కుటుంబం నుంచి వచ్చి అనేక రంగాల్లో రాణించారు: మురళీమోహన్
  • రామోజీరావు.. సినీరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు: మురళీమోహన్
  • సమాజాన్ని జాగృతం చేసే చిత్రాలు తీయాలని అనేవారు: మురళీమోహన్
రామోజీరావుకు పుష్పాంజలి ఘటించిన చంద్రబాబు, పవన్‌, లోకేశ్ (ETV Bharat)

5:15 PM, 27 Jun 2024 (IST)

ఎన్‌.రామ్‌ (ప్రముఖ పాత్రికేయులు) కామెంట్స్‌

  • రామోజీరావుతో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది: ఎన్‌.రామ్‌
  • ఎడిటర్స్ గిల్డ్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామోజీరావు పరిచయం: ఎన్‌.రామ్‌
  • రామోజీరావు.. ఇన్వెస్టిగేషన్ జర్నలిజాన్ని నమ్మేవారు: ఎన్‌.రామ్‌
  • రామోజీరావు.. నమ్మిన విలువల కోసం కట్టుబడేవారు: ఎన్‌.రామ్‌
  • అప్పట్లో దేశ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉండేవి: ఎన్‌.రామ్‌
  • రాజీవ్‌ ప్రభుత్వం తెచ్చిన పరువు నష్టం బిల్లు తెచ్చింది: ఎన్‌.రామ్‌
  • రాజీవ్‌ ప్రభుత్వం తెచ్చిన పరువునష్టం బిల్లులో కఠిన నిబంధనలు పెట్టారు: ఎన్‌.రామ్‌
  • పాత్రికేయులే లక్ష్యంగా కఠిన నిబంధనలు రూపొందించారు: ఎన్‌.రామ్‌
  • పరువు నష్టం బిల్లుపై ఎడిటర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడిగా రామోజీ పోరాడారు: ఎన్‌.రామ్‌
  • రామోజీరావు పోరాటం ఫలితంగా ఆ బిల్లును వెనక్కి తీసుకున్నారు: ఎన్‌.రామ్‌
  • ఈనాడు పత్రిక సమాజంలోని క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టింది: ఎన్‌.రామ్‌
  • ఈనాడు ప్రస్థానంపై ఆస్ట్రేలియన్‌ రాజకీయవేత్త రాబిన్‌ జెఫ్రీ పుస్తకమే రాశారు: ఎన్‌.రామ్‌

5:14 PM, 27 Jun 2024 (IST)

జయసుధ

  • రామోజీరావు ఒక ఎన్‌సైక్లోపీడియా: జయసుధ
  • ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించగలమని నమ్మిన వ్యక్తి రామోజీరావు: జయసుధ
  • సినీరంగంలో ఎందరికో రెండో జన్మ అందించారు: జయసుధ

5:14 PM, 27 Jun 2024 (IST)

కొల్లు రవీంద్ర

  • రామోజీరావు రైతు కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థాయికి ఎదిగారు: కొల్లు రవీంద్ర
  • ఈనాడు పత్రికతో ప్రజల్లో చైతన్యం నింపారు: మంత్రి కొల్లు రవీంద్ర
  • ఈటీవీ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో స్ఫూర్తి నింపారు: కొల్లు రవీంద్ర
  • తెలుగువారికి ఎప్పుడు కష్టాలు వచ్చినా అండగా నిలబడ్డారు: కొల్లు రవీంద్ర
  • సమాజసేవ కోసం విద్యార్థి దశ నుంచే రామోజీరావు కృషి చేశారు: కొల్లు రవీంద్ర
  • అక్షరమే ఆయుధంగా తెలుగువారి శ్రేయస్సు కోసం పోరాడారు: కొల్లు రవీంద్ర
  • రాజకీయాల్లో ఎన్టీఆర్‌కు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడ్డారు: కొల్లు రవీంద్ర

4:48 PM, 27 Jun 2024 (IST)

  • రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు
  • రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌
  • రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్
  • రామోజీరావు ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించిన చంద్రబాబు, పవన్, లోకేశ్
  • రామోజీరావుకు పుష్పాంజలి ఘటించిన చంద్రబాబు, పవన్‌, లోకేశ్
రామోజీరావు జీవితంలో వివిధ ఘట్టాలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు (ETV Bharat)

4:39 PM, 27 Jun 2024 (IST)

రామోజీరావు జీవితంలో వివిధ ఘట్టాలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు

  • ప్రతిష్ఠాత్మకంగా రామోజీరావు సంస్మరణ సభను ఏర్పాటు
  • ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • రామోజీరావు జీవితంలో వివిధ ఘట్టాలను వివరిస్తూ ఏర్పాటు
  • ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్న ప్రముఖులు

4:34 PM, 27 Jun 2024 (IST)

ఇతర ప్రముఖులు

సంస్మరణ సభలో పాల్గొన్న రామోజీరావు కుటుంబసభ్యులు

4:33 PM, 27 Jun 2024 (IST)

రాజకీయ ప్రముఖులు

రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌

వేదిక వద్ద రామోజీరావు ఛాయాచిత్ర ప్రదర్శన తిలకించిన పవన్ కల్యాణ్‌

రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొన్న మంత్రులు మనోహర్‌, సత్యకుమార్‌

రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొన్న మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి

4:14 PM, 27 Jun 2024 (IST)

రాజకీయ ప్రముఖులు

  • రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన మురళీమోహన్, జయసుధ
  • రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు మనోహర్‌, సత్యకుమార్‌
  • రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి

4:14 PM, 27 Jun 2024 (IST)

  • సినీ ప్రముఖులు
  • రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను
  • సంస్మరణ సభకు హాజరైన నిర్మాతలు అశ్వినీదత్‌, ఆదిశేషగిరిరావు
  • సంస్మరణ సభకు హాజరైన నిర్మాతలు దగ్గుబాటి సురేష్‌, శ్యాంప్రసాద్‌రెడ్డి

3:50 PM, 27 Jun 2024 (IST)

  • సంస్మరణ సభలో పాల్గొననున్న రాఘవేంద్రరావు, రాజమౌళి, బోయపాటి శ్రీను, కీరవాణి
  • సంస్మరణ సభలో పాల్గొననున్న నిర్మాతలు అశ్వనీదత్, సురేష్‌బాబు, శ్యాంప్రసాదరెడ్డి
  • సంస్మరణ సభలో పాల్గొననున్న రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులు
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ (ETV Bharat)
Last Updated : Jun 27, 2024, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details