Ramagundam Thermal Power Plant : విద్యుత్ ఉత్పత్తి భారంగా మారుతోందన్న అభిప్రాయంతో రామగుండం జెన్‌కో ప్లాంట్(Ramagundam Genco Plant) మూసివేయాలనే సిఫార్సులు వస్తున్నాయి. ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు 62.5 మెగా వాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం అయినా, అందులో కేవలం 55 మెగా వాట్లే ఉత్పత్తి అవుతోంది. కొత్త థర్మల్ కేంద్రాల్లో నాలుగైదు రూపాయలకే కరెంట్ ఉత్పత్తవుతుంటే, రామగుండం ప్లాంట్‌లో యూనిట్‌కు రూ.8 వెచ్చించాల్సి వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్లాంటును మూసివేస్తే ఆర్థిక భారం తగ్గుతుందని జెన్‌కో పాలక మండలి నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ అధ్యయన నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
వచ్చే ఏడాది యాదాద్రి వెలుగులు.. రేపు పనులు పరిశీలించనున్న సీఎం
Genco Thermal Power Plant in Ramagundam : రామగుండంలో పాత ప్లాంటు మూసేస్తే అక్కడే కొత్తగా 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో మరొకటి నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ కోరుతున్నారు. కొత్త ప్లాంటును సూపర్ క్రిటికల్ ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తే తక్కువ కాలుష్యం వెలువడుతుంది. పైగా పక్కనే సింగరేణి బొగ్గు గనులు, సొంత భూమి ఉన్నందున అతి తక్కువ వ్యయంతో కొత్తది నిర్మించవచ్చని ఇంజినీర్లు చెబుతున్నారు. తొలుత డిజైన్ చేసిన బాయిలర్‌ని పక్కనపెట్టి కాలుష్య ప్రభావం తగ్గించడానికి కొత్త ప్రమాణాలతో డిజైన్లు రూపొందించడం వల్ల ఆలస్యమైనట్లు వివరించారు.
"సింగరేణి సమస్యలు, నియోజక వర్గానికి రావాల్సిన కేంద్ర పరిశ్రమలకు సంబంధించి సమస్యలు, తాగునీటి సమస్యలు, రాష్ట్ర విభజనలో రావాల్సిన మరొక ప్లాంటు దాని విస్తరణ కోసం కృషి చేస్తాం. జెన్‌కో ప్లాంటును ఆధునీకరణ చేపడుతాం. సూపర్ క్రిటికల్ ప్లాంటుగా తీర్చిదిద్దుతాం. సింగరేణి బొగ్గు గనులు, సొంత భూమి ఉన్నందున తక్కువ వ్యయంతో కొత్తది నిర్మించవచ్చని ఇంజినీర్లు చెప్పారు. కాలుష్యం తగ్గించడానికి కొత్త ప్రమాణాలతో డిజైన్లు రూపొందించడంలో ఆలస్యం అయ్యింది. రూ. 10 వేల 598 కోట్లతో నిర్మాణ వ్యయం అవుతుందని అంచనా వేయగా పనుల జాప్యంతో నాలుగు వేల కోట్లకు చేరింది. ప్లాంట్‌కు 500 ఎకరాలకు పైగా స్థలంతో పాటు బొగ్గు, నీరు అందుబాటులో ఉంది." - శ్రీధర్‌బాబు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి