తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల, ఫిబ్రవరి 27న పోలింగ్

Rajya Sabha Elections 2024 Schedule : రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్‌ విడుదలయింది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల ఎన్నికకు, కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల ఫిబ్రవరి 8న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 27న ఎలక్షన్‌ పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో మూడు స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌లోని మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Rajya Sabha Elections 2024
Rajya Sabha Elections 2024 Schedule

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 3:08 PM IST

Updated : Jan 29, 2024, 3:42 PM IST

Rajya Sabha Elections 2024 Schedule : రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్‌ విడుదలయింది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్య సభ సభ్యుల ఎన్నికకు(Rajya Sabha Elections) కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్‌, జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌లోని సీఎం రమేష్‌, కనకమేడల, వేమిరెడ్డిల పదవీ కాలం ముగియడంతో వారి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

టార్గెట్​ డబుల్​ డిజిట్ - సాయంత్రానికి పీసీసీ వద్దకు కాంగ్రెస్ ఎంపీ ఆశావహుల లిస్ట్!

Rajya Sabha Election In Telangana: రాష్ట్రంలో ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియగా, వీరిస్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రతి 39.6 శాసన సభ్యులకొకరు చొప్పున ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పూర్తి కోటాతో ఏ పార్టీ కూడా రెండు గానీ, మూడు గానీ సీట్లు గెలిచే అవకాశం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు(Congress) 64 మంది, మిత్రపక్షమైన సీపీఐకి ఒకరు, బీఆర్ఎస్ 39, బీజేపీ(BJP) 8, మజ్లిస్‌కు ఏడుగురు సభ్యుల బలం ఉంది.

లోక్​సభ ఎన్నికల్లో 10 సీట్లే లక్ష్యంగా 'బీజేపీ క్లస్టర్ సమావేశాలు'

నిర్ణీత 39.6 శాతం ఓట్ల ప్రకారం కాంగ్రెస్‌ తన బలంతో ఒక సీటును గెలుచుకున్నాక ఆ పార్టీకి సీపీఐతో కలిపి మరో 25 ఓట్లు ఉంటాయి. అంటే రెండో స్థానంలో 40 ఓట్లు సాధించడం కష్టమే. మరోవైపు బీఆర్ఎస్(BRS) కు 39 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దాని మిత్రపక్షమైన మజ్లిస్‌కు గల ఏడు స్థానాలు కలిస్తే మొత్తం 46 అవుతాయి. అంటే ఒక సీటు గెలిచాక మిగిలేవి ఆరు ఓట్లు. 40 ఓట్ల కోటాతో రెండో స్థానంలో అది పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు.

Rajya Sabha Seats In Telangana : ముగ్గురే అభ్యర్థులు బరిలో నిలిస్తే పోలింగుతో, సంఖ్యాబలంతో సంబంధం లేకుండా వారి ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. ముగ్గురికి మించి అభ్యర్థులు బరిలో ఉంటే పోలింగ్ అనివార్యమవుతుంది. అప్పుడు మొదటి మూడు స్థానాల్లో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు. కాంగ్రెస్‌కు ఒక స్థానం గెలిచే ఓట్లతో పాటు అదనంగా మరో 25 ఎక్కువ ఓట్లు ఉన్నందున అది రెండు స్థానాలకు పోటీ చేసే వీలుంది. బీఆర్ఎస్​కు ఒక స్థానం గెలిచిన తర్వాత అదనంగా మరో ఆరు ఓట్లే ఉన్నందున అది రెండోస్థానానికి పోటీ చేసే వీలు ఉండదు. ఈ సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్‌ రెండు, బీఆర్ఎస్ ఒక స్థానానికి పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - హస్తం పార్టీపై విమర్శలతో విరుచుకుపడుతున్న గులాబీ నేతలు

Last Updated : Jan 29, 2024, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details