తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రగ్ కేసులో హీరో రాజ్​ తరుణ్ ప్రేయసి - రిమాండ్ రిపోర్ట్​లో పలు కీలక అంశాలు - narsingh Drug Case

Raj Tharun Girl Friend Drug Case Update : సినీ హీరో రాజ్​తరుణ్​ ప్రేయసి లావణ్య డ్రగ్ కేసులో పట్టుపడ్డారు. పోలీసుల అదుపులో ఉన్న ఆమె రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను పొందుపర్చారు. ఇది వరకే లావణ్యపై డ్రగ్స్ కేసు నమోదైందన్న పోలీసులు పక్కా సమాచారంతో ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Narsingh  Drug Case Update
Raj Tharun Girl Friend Drug Case Update

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 6:31 PM IST

Updated : Jan 30, 2024, 7:54 PM IST

Raj Tharun Girl Friend Drug Case Update :నార్సింగ్ పోలీస్ స్టేషన్​ పరిధిలో మాదకద్రవ్యాలతో పట్టుబడిన నిందితురాలు లావణ్య రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలను పొందుపర్చారు. విజయవాడకు చెందిన ఆమె 15 సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం హైదరాబాద్​కు వచ్చారని పోలీసులు గుర్తించారు. చదువు అనంతరం సంగీతం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ పలు లఘు చిత్రాల్లో నటించారని రిమాండ్ రిపోర్టులో వివరించారు.

గోవా నుంచి తెచ్చి హైదరాబాద్​లో డ్రగ్స్ విక్రయం - రాజ్​తరుణ్ ప్రేయసి అరెస్ట్

ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడిన ఆమె డ్రగ్స్ కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉనీత్ రెడ్డి అనే వ్యక్తి నుంచి ఆమె మాదకద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు వివరించారు. గతంలో మోకిల పోలీస్ స్టేషన్​లో ఉనీత్ రెడ్డిపైన డ్రగ్స్ కేసు నమోదు చేశారని, అతను బెంగళూరు నుంచి మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి నగరంలో విక్రయాలు జరుపుతున్నారని తెలిపారు. ఎండీఎంఏ (MDMA Drug) డ్రగ్​ను రూ.1500కు కొని నగరంలో రూ.6000కు విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

శంషాబాద్​ విమానాశ్రయంలో మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా హెరాయిన్​ పట్టివేత - విలువ తెలిస్తే షాక్!

Hero Raj Tharun Girl Friend Caught With Drugs :కాగా సోమవారం నగర శివారు నార్సింగ్​లో సైబరాబాద్​ ఎస్​వోటీ పోలీసులు లావణ్యను అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి 4గ్రాములు ఎండీఎంఏ డ్రగ్​ను (Drug) స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఓ డ్రగ్స్ కేసులో లావణ్య పరారీలో ఉందని, పక్కా సమాచారంలో నార్సింగ్​లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్​లో మరో డ్రగ్స్​ ముఠా - మైనర్​ బాలుడు సహా బీఫార్మసీ విద్యార్థి అరెస్ట్

గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చిన ఆమె సినీ హీరో రాజ్​తరుణ్​ (Tollywood Hero Raj Tharun) ప్రేయసిగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితురాలిని రాజేంద్రనగర్​ ఉప్పర్​పల్లి కోర్టులో హాజరుపరుచగా 14 రోజుల రిమాండ్​కు పంపించారని పోలీసులు తెలిపారు. అయితే నిందితురాలి నుంచి 1.5 గ్రాముల కంటే ఎక్కువగా 4 గ్రాములు డ్రగ్ స్వాధీనం చేసుకున్నందుకు ఈ కేసును రంగారెడ్డి జిల్లా కోర్టుకు బదిలి చేశారని పోలీసులు వివరించారు.

Drug Cases in Hyderabad : రాష్ట్రంలో ఇటీవలి కాలంలో భారీగా డ్రగ్స్ ముఠాలు బయట పడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రంలో డ్రగ్స్​ అనే మాట వినిపించకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి డ్రగ్స్​ ముఠాలపై స్పెషల్​ ఫోకస్​ పెట్టిన పోలీసులు, ఎక్కడ మత్తు పదార్థాల వాసన వచ్చినా అక్కడ వాలిపోతున్నారు. పక్కా సమాచారంలో తనిఖీలు నిర్వహించి అమ్మెవారితో పాటు కొనుగోలుదారులనూ అరెస్ట్ చేసి ఊచలు లెక్కపెట్టిస్తున్నారు.

రాష్ట్రంలో మరో 2 డ్రగ్స్ గ్యాంగుల పట్టివేత, అరెస్టైన వారిలో 21 ఏళ్ల యువతి

Last Updated : Jan 30, 2024, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details