తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు ఐఎండీ గుడ్​న్యూస్​ - రాగల మూడు రోజులు విస్తారంగా వర్షాలు! - Rainfall Alert in Telangana - RAINFALL ALERT IN TELANGANA

Rainfall Alert in Telangana : ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వానజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఇవాళ పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం నమోదైంది.

Rainfall Alert in Telangana
TS Weather Report Today

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 7:30 PM IST

Rainfall Alert in Telangana :రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) ప్రకటించింది. ఇవాళ ఉరుముల, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ద్రోణి/ గాలి విచ్చిన్నతి ఒకటి సౌరాష్ట్ర కచ్ వద్ద వున్న ఉపరితల ఆవర్తనం నుంచి మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ. ఎత్తులో కొనసాగుతున్నదని పేర్కొన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం మరాత్వాడా పరిసరాల మధ్య మహారాష్ట్ర ప్రాంతాల వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఇవాళ బలహీన పడిందని వెల్లడించింది.

రాష్ట్రంలో భానుడి భగభగలు- నాలుగు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు - temperatures in Telangana

Heavy Rain Recorded in Nalgonda Today :తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో రాష్ర్టంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలలోపే నమోదవుతున్నాయని తెలిపింది. నల్గొండ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. వేసవి వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు, అకాల వర్షం(Untimely Rain) కాస్తంత ఉపశమనాన్ని ఇచ్చింది. సుమారు గంటకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, అమ్మకానికి ఉంచిన వడ్లు తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

గుడ్ న్యూస్- ఈసారి నైరుతి రుతుపవనాలకు అన్నీ గ్రీన్ సిగ్నల్స్​! - monsoon forecast 2024 india

ఈదురు గాలుల వర్షంలో - కారు ఎలా నడపాలో మీకు తెలుసా? - How To Drive car Strong Winds rains

ABOUT THE AUTHOR

...view details