తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు వేయడానికి వెళ్లేవారికి గుడ్​న్యూస్, ఈ దారుల్లో స్పెషల్​ ట్రెయిన్స్​​ - అయినా దక్కని టికెట్లు - Special Trains For Elections 2024 - SPECIAL TRAINS FOR ELECTIONS 2024

Special Trains For Lok Sabha Elections 2024 : ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో ఓటేసేందుకు స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సినవారు రైలు ప్రయాణాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​తో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వైపు వెళ్లే రైళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. గత వారంరోజుల నుంచి ట్రెయిన్​ టికెట్ల కోసం ప్రయాసపడుతున్నారు. మరోపక్క ప్రయాణికుల డిమాండ్ మేరకు అవసరమైన రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

Special Trains Elections 2024
Elections Effect on Railway Tickets

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 9:59 PM IST

Elections Effect on Railway Tickets : ఒకపక్క వేసవి కాలం, మరోపక్క ఎన్నికలు వచ్చేశాయి. వేసవికాలంలో చాలా మంది తీర్థయాత్రలకు, విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. ఇదే సమయంలో ఎన్నికలు కూడా రావడంతో రైళ్లన్నీ రద్దీగా మారిపోయాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​లో రెండు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. మే నెలలో 7, 13 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్​, బిహార్​లో మొత్తం 7 దశలకుగాను ఇప్పటివరకు రెండు దశలే పూర్తయ్యాయి. మే 7, 13, 20, 25, జూన్ 1వ తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉత్తర భారతదేశానికి చెందినవారు ఉండడంతో ఈ నాలుగు రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే దానాపూర్, గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్​లను ఎక్కువ సంఖ్యలో వేశారు. ఇక ఉత్తరాంధ్ర మీదుగా వెళ్లే విశాఖ, ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్​లకు తోడు అదే మార్గంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Special Trains Between Hyd And Arsikere : సికింద్రాబాద్ - సంత్రగాచి - సికింద్రాబాద్ మధ్య 42 రైళ్లు, కాచిగూడ- కోచువెలి - కాచిగూడ మధ్య 4 సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్- ఆరిస్కరా మధ్య 38 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. మహబూబ్​నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ మీదుగా కర్ణాటకకు ఈ రైళ్లున్నాయి. ఇలా సికింద్రాబాద్- దానాపూర్, హైదరాబాద్- గోరఖ్​పూర్, కాచిగూడ- కోచువెలి, సికింద్రాబాద్- అగర్తల, సికింద్రాబాద్ - సంత్రగాచి, సికింద్రాబాద్ - షాలీమర్, సికింద్రాబాద్- పాట్నా, తిరుపతి షిర్డీ, కాచిగూడ - మధురై, సికింద్రాబాద్- కొళ్లం, హైదరాబాద్ కటక్, హైదరాబాద్- రాక్సౌల్ ఇలా ఇతర రాష్ట్రాలను కలుపుతూ నడిచే రైళ్లకు తోడు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ కూడా ప్రత్యేక రైళ్లున్నాయి.

Railway Department Running Special Trains For Elections : సికింద్రాబాద్ - తిరుపతి, లింగంపల్లి- కాకినాడ, హైదరాబాద్- నర్సాపూర్, సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఈ సీజన్​లో మొత్తం 1079 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. దానాపూర్​కు 22 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి 11 రైళ్లు వెళ్తున్నాయి. ఈ రైళ్లన్నీ ప్రతి గురువారం నగరం నుంచి బయలుదేరుతాయి, అటువైపు నుంచి ఇదే సంఖ్యలో ప్రతి శనివారం తిరుగు ప్రయాణమవుతాయని అధికారులు తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే ఈ రైళ్లన్నీ అన్ రిజర్వ్​తోనే నడుస్తుంటాయి. ప్రతి రోజూ నడిచే సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ ప్రెస్​లో వెయిటింగ్ లిస్ట్ జాబితా ఉన్నందున క్లోనింగ్ రైళ్ల మాదిరి వీటిని నడుపుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

Special Trains: జర్నీ ప్లాన్​ చేసుకోండి... ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు

తెలుగు రాష్ట్రాల్లో మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు ఆంధ్రప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఏపీ ఎన్నిల్లో ఓటేసేందుకు వెళ్లేవారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్ రోజు టిక్కెట్లు దొరకనివారు రెండు నుంచి మూడు రోజుల ముందే రైల్వే రిజర్వేషన్లు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, నర్సాపురం, కాకినాడ, విశాఖపట్టణం వైపు వెళ్లే రైళ్లలో మే 12న రిజర్వేషన్లు పూర్తయిపోయాయి.

ఏసీ బోగీల్లోనూ దొరకని టికెట్లు: నెల్లూరు, తిరుపతి వైపు మార్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. మే 10, 11 తేదీల్లో కూడా దూరప్రాంత రైళ్లలో ఒక్కో బండిలో వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్టు కన్పిస్తుంది. కొన్నింట్లో అయితే ఆ పరిమితి కూడా దాటిపోయి రిగ్రెట్ వస్తోంది. అన్ని ఏసీ బోగీలు, అధిక చార్జీలుండే సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్​లో సాధారణంగా అయితే ఒక రోజు ముందు కూడా రిజర్వేషన్ దొరుకుతుంది. కానీ వచ్చే నెలలో ఎన్నికలు ఉండటంతో నెలరోజుల ముందే టికెట్లు అయిపోయినట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

12వ తేదీకి గరీబ్ రథ్​లో భారీగా వెయిటింగ్ లిస్ట్ కన్పిస్తుందని, గౌతమి ఎక్స్ ప్రెస్​లో, విశాఖ ఎక్స్ ప్రెస్​లో, ఈస్ట్ కోస్ట్​లో వెయిటింగ్ లిస్టు వందల సంఖ్యలో ఉన్నట్లు ప్రయాణికులు పేర్కొంటున్నారు. 11వ తేదీన గౌతమి ఎక్స్ ప్రెస్ స్లీపర్, ఏసీల్లో వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి వెళ్లే నారాయణాద్రి, శబరి, చార్మినార్, పద్మావతి, చైన్నై ఎక్స్ ప్రెస్, వెంకటాద్రి, రాయలసీమ ఎక్స్ ప్రెస్, తిరుపతి స్పెషల్ వంటి రైళ్లలో మే 10, 11, 12 తేదీల్లో భారీగా వెయిటింగ్ లిస్టు కన్పిస్తుంది. ఎల్టీటీ- విశాఖ ఎక్స్ ప్రెస్​లో మే 3-12 వరకు నాలుగు రోజులు రిగ్రెట్​లో ఉందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. 11, 12 తేదీల్లో కోణార్క్, జన్మభూమి రైళ్లు రిగ్రెట్లో ఉన్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

ఓటు వేయడానికి వెళ్లేవారికి గుడ్​న్యూస్ ఈ దారుల్లో స్పెషల్​ ట్రెయిన్స్​​ అయినా దక్కని టికెట్లు

రాయితీలు పునరుద్ధరించని రైల్వే

Trains: మళ్లీ పరుగులు తీయనున్న ప్రత్యేక రైళ్లు...

ABOUT THE AUTHOR

...view details